మీ వ్యూస్

నేను లోకల్ అంటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుగా ఈ సినిమా పేరుకు, కథకు సంబంధం ఏమిటో అర్థం కాదు. అసలు కథ ఉంటేగా? ఇది ఇంకో ప్రశ్న. అన్ని మాఫియాల్లాగే ప్రచార మాఫియా తయారైంది. ఒక చెత్త సినిమాను పట్టుకొని అదే పనిగా టీవీలు, పేపర్లు, గోడలమీద ప్రచారం చేసి, ఇన్ని కోట్లు అన్ని కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇలా చేయడంతో ఆ సినిమా చూసి తల బొప్పికట్టిన వేల ఆడియన్స్‌లో నేనొకడిని. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు కొట్టేయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. సినిమా హీరో మొదటినుండి చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రేమ దోమ అంటూ తెగ గోల పెట్టేసి హీరోయిన్‌ను, వాళ్ల తల్లిదండ్రులను, తన తల్లిదండ్రులకు వీర బోర్ కొట్టించాడు. ఓ వంద రోజుల వరకు సినిమా జోలికి పోనని ఒట్టేసుకున్నాను.
-ఎస్‌ఎల్ నరసింహమూర్తి, హైదరాబాద్

నిరాశ
ఓం నమో వెంకటేశాయ చిత్రం నిరాశ పర్చింది. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్మ్యంలో బావాజీగా నటించిన నాగయ్య పాత్ర స్వల్పమే అయినా ఆయన నటన హైలెట్. ఆయనను ఆలయ బహిష్కరణ చేసినా వెంకటేశ్వరస్వామి వచ్చి పాచికలు ఆడి వెళ్లిపోతారు. ఆలయం తెరిచి ఉండటంతో బావాజీ దొంగతనంగా ఆలయానికి వచ్చాడని గ్రామాధికారికి ఫిర్యాదు చేయడం, వారు భగవంతుడే తమ ఇంటికి వచ్చాడని చెప్పినా వినకపోవడం, ఓ బండెడు చెరుకు తెల్లారేలోగా తినాలన్న ఆంక్షతో చెరసాలలో ఉంచడం, బావాజీ అభ్యర్థనతో స్వామిఏనుగు రూపంలో వచ్చి చెరుకులు తినడం, దాన్ని కళ్లారా చూసి ఆయన్ని క్షమించమని పాదాలపై పడటం అన్న దృశ్యం పండింది. ఈ చిత్రంలో మాత్రం అనవసరమైన ఆహార్యం, పాటలు ఉండి నిరాశ కలిగించింది.
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

వార్ వండర్!
ఘాజీ సినిమా ఓ వార్ వండర్‌గా అభివర్ణించాలి. దాయాది దేశాల జలాంతర్గాముల పోరాటం కళ్లకు కట్టినట్టు చూపారు. పాటలు, ఫైట్లు లేకుండా సినిమా ఎలా తీయాలో తెలుగు పరిశ్రమకు కొత్త నడక నేర్పారు. నటీనటులు తమ శక్తికి మించి నటించారు. జలాంతర్గాములు ఇలా ఉంటాయా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపడేలా చిత్రీకరించారు. కమాండర్ల ఆదేశాలు ఎలా ఉంటాయో, వాటిని ఆచరించే మిగతావారి హావభావాలు చక్కగా చూపించారు. జలాంతర్గామిలో సాహసాలు చూస్తే ఒళ్లు గగుర్పాటు కలిగింది. ఒక విషయం మాత్రం నిజం. సహజ సైనికులుగా నటింపజేయడం దర్శకుడి గొప్పతనం.
-ఎ మోహన్‌రావు, గంపలగూడెం

బుద్ధితక్కువ అనువాదం
యమన్.. ఈ పాట వినగానే ఇదో అరబ్ దేశమనో, హిందూస్థాన్ శాస్ర్తియ రాగమనో కచ్చితంగా అనుకుంటాం. డబ్బింగ్ చేసిన వారికి విషయ పరిజ్ఞానం లేనట్టుంది. తెలుగులో డు,ము,వు,లు ప్రథమా విభక్తి. తమిళంలో రామన్ అంటారు. బెంగాలీ, ఒడియాలో రామో అవుతుంది. అకారాంత పుల్లింగ రామశబ్దః- రాముడు. యమన్ తెలుగులో యముడుగా అనువదించాల్సింది. కన్నడలో అయితే యమధర్మ అన్న సాయికుమార్‌లా అరవాలి. తమిళంలో క,ఖ,గ,ఘలకు ఒకటే అక్షరం. చ,్ఛ,జ,ఝాలకు ఒకటే అక్షరం. ప,్ఫ,బ,్భలకు ఒకటే అక్షరం. తమిళ వాళ్లకి అది అలా పలకడం హక్కు. వినే వాడి ఖర్మ. పొరుగింటి పుల్లకూర మీద భక్తితో విభక్తులు మార్చకూడదు. తెలుగులో పంది అనే నామ వాచకాన్ని అరవంలో బంతి అంటారు. బంతికి పందికి తేడా లేదు అక్కడ. అలాగే ఉంది ఈ చిత్రం.
-యశ్వంతరావు శేషగిరి, ధవళేశ్వరం

అనివార్యం
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సత్యప్రియ. ప్రతిభ ఉన్న ఎందరో తెలుగు నటీనటులు ఉన్నా వారిక అవకాశం ఇవ్వకుండా ముంబయి నుంచి దిగుమతి చేసుకోవడాన్ని నిరసించింది. అయితే టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఆకట్టుకునే ఆకృతి, అలరించే మూర్తిమత్వం, నటన కూడా ఉండాలి. తమాషా ఏమిటంటే తెలుగు చిత్రాల్లో తెలుగువారే నటించాలన్న సత్యప్రియ యాభైకి పైగా తన మాతృభాషకాని, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తెలుగు చిత్రాలు అనువదితమై చాలా రాష్ట్రాల్లో విడుదలవుతున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల నటులు నటించడం సినిమాలకు ప్లస్ అవుతుంది. దృశ్యంలో నదియా లాగ సత్యప్రియ రాణించగలదా? అరవింద్‌స్వామి లాగ విలనీ పోషించేవాళ్లు తెలుగులో ఉన్నారా? తెలుగులో ఇతర భాషా నటులు నటించడం అనివార్యం.
-డి యోగానంద్, కొవ్వాడ

చిలక పలుకులు
కొద్దిపాటి విజయాలు దక్కితే చాలు, తారలు చిలక పలుకులు, టాంటాంలు మొదలెట్టేస్తారు. ఒకటి రెండు చిత్రాలు హిట్‌కాగానే రాశిఖన్నా తాను చేసిన చిత్రాలకన్నా వదిలేసిన పాత్రలే ఎక్కువని చెప్పింది. పాత్ర నచ్చకపోతే ఎంతిచ్చినా చేయను అని డాంబికాలూ పోయింది. చాలాకాలం తెరమరుగై సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు హిట్స్‌కొట్టిన శ్రీయ సహజంగా అందంగా ఉన్నవారే తెరమీద అందంగా, నాజూగ్గా కనిపిస్తారు. అందం, నాజూకు నా జీన్స్‌లోనే ఉన్నాయని డబ్బా కొట్టింది. నేను యూనివర్సల్ హీరోయిన్‌ని అని డబ్బాలు కొడుతోంది కీర్తిసురేష్. రాజ్‌తరుణ్‌కి విజయాలు తలకెక్కి కథ బాగాలేదు. ఇక్కడ మార్చండి, అది తీసేయండి, ఇది పెట్టండి అని వాగడంతో నేను లోకల్, శతమానంభవతి చిత్రాలు చేజారిపోయాయి. ఇప్పుడు చింతించి ఏం లాభం?
-పి చంపక్, మాధవనగరం

అలనాటి సంగతి
పద్మశ్రీవారి సిరిసంపదలు చిత్రంలోని ‘ఈ పగలు రేయిగా...’ పాట చిత్రీకరిస్తున్నారు. కారులో స్టీరింగ్ ముందు కూర్చున్న నాగేశ్వరరావు పాట పాడుతూ పక్కనున్న సావిత్రిని కొంచెం దగ్గరకు తీసుకోవాలి. సావిత్రి కొంచెం ఎడంగా కూర్చున్నందున నాగేశ్వరరావు నువ్వు అంత దూరంగా కూర్చుంటే నిన్ను దగ్గరకు లాక్కోగలనా అన్నారు. సెట్‌లో ఉన్న అందరూ గొల్లున నవ్వారు. పుల్లయ్యగారు మాత్రం తనకు వచ్చిన ‘్భష’లో మిగతా అందర్నీ తిట్టిపోశారు.
-డిఎస్ శంకర్, కోనసీమ