మీ వ్యూస్

అదీ సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదీ సంగతి
కొత్తదనం కథలు, వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తున్నాడని సంతోషిస్తున్న సమయంలో -రాథ చిత్రంతో శర్మానంద్ ఆడియన్స్‌ని పూర్తిగా నిరుత్సాహపర్చాడు. కమర్షియల్ ఫార్మాట్‌లోకి తెచ్చేస్తే చెప్పిన కథనే మళ్లీ చెప్పినా జనం చూసేస్తారనుకోవడం కల్ల. మంచి చిత్రాల్లో మంచి పాత్రల ఎంచుకుంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శర్వా, శతమానంభవతి చిత్రంతో చాలామెట్లే ఎక్కేశాడు. తాజాగా చేసిన రాథతో అన్నీ మెట్లూ కిందికి దిగజారిపోయాడు. చూస్తున్నారు కనుక ఏదైనా చేసెయ్యొచ్చు అనుకునే కుర్ర హీరోలకు -ఆడియన్స్ తీర్పులతోనైనా కనువిప్పు కలగాలి. హీరోలు.. సినిమా హిట్టు కావాలని కోరుకుంటే సరిపోదు, హిట్టు ఇవ్వగలిగే కథను ఒప్పిగ్గా ఎంచుకోవాలి. అందుకు ఒకింత కసురత్తు చేయాలి.
-పాలి గంగాధర్, కొత్తకోట
అప్పుడే తీసేవారు
భారీ బడ్జెట్లు, గ్రాఫిక్స్‌లాంటి ఆధునిక సినిమా సాంకేతిక సంపత్తిని అప్పటి దర్శకులకే అందుబాటులో ఉండివుంటే ‘బాహుబలి’ని మించిన సినిమాలు ఏళ్లకిందటే వచ్చివుండేవి. ఎలాంటి సదుపాయాలు లేని స్వర్ణయుగ కాలంలోనే కథతో రక్తికట్టించి ‘ట్రిక్స్’పై శ్రమించి హెచ్‌ఎం రెడ్డి, విఠలాచార్యలాంటి దర్శకులు అప్పుడే అద్భుతాలు అందించారు. ఇలా మాట్లాడుకోవడం రాజవౌళి తీసిన బాహుబలిని విమర్శించడానికి కాదు, ఆ సినిమా గురించి అతిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న చర్చను సమర్థించడానికే.
డొక్కా దత్తడు, దొర్తిపాడు
అలాంటివాళ్లేరీ?
కథలో దమ్ముండాలి. రసజ్ఞ ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కని సంగీతమూ దానికి తోడవ్వాలి. ఈ రెండూ ఉంటే -ఆర్థికం, ఆర్భాటాల గోల లేకుండానే సినిమా హిట్టవ్వడం ఖాయం. ఈ విషయాన్ని కె విశ్వనాథ్ లాంటి దర్శకులు ఎప్పుడో నిరూపించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌కు దక్కినంత మాత్రానే ఆయన మాత్రమే అలాంటి చిత్రాలు చేయగలిగారని చెప్పడం కాదు, అలాంటి సినిమాలు అందించిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారని చెప్పడానికి విశ్వనాథ్‌ను భాగం చేయడమే. ఆ విషయాన్ని ఆయనే సౌమ్యంగా అంగీకరించటం విశ్వనాథ్ సంస్కారం. విశ్వనాథ్‌కు అవార్డు ప్రకటించడమంటే, అలాంటి గొప్ప దర్శకులు మరింతగా పరిశ్రమ నుంచి రావాలని కోరుకోవడమే. కానీ, ఆ ప్రయత్నాలు పరిశ్రమ నుంచి జరుగుతున్నాయా? అన్నదే సందేహం.
ఎస్‌ఎస్ రాజు, వనస్థలిపురం
ఏముందని?
బాహుబలికి డబ్బు చేసింది వ్యాసంలో నిజాయితీ కనిపించింది. చక్కటి కథనాన్ని సవివరంగా అందించిన వెనె్నలకు అభినందనలు. అసలు బాహుబలిలో ఏముంది? అన్న ఒక్క ప్రశ్నతో ‘అతి’కి అడ్డుకట్టవేసినట్టే అయ్యింది. కేవలం ప్రచారార్భాటం, ప్రేక్షకుల్లో అర్థంలేని మానియాను పుట్టించడమే సినిమా ప్రామాణికం అనుకుంటే, బాహుబలిని మించిన బాహుబలులు తెలుగు పరిశ్రమలో చాలామందే ఉన్నారు. ఆ సినిమాలన్నింటినీ ‘ఆహా ఓహో’ అనలేకపోయామెందుకు? ఐదేళ్లపాటు అతికష్టంగా నిర్మించిన భారీ చిత్రంగా బాహుబలిని చెప్పుకోవచ్చేమోగానీ, గొప్ప చిత్రంగా చెప్పుకోలేం. లేనిపోని ముద్రవేసేస్తే -ఏదోకరోజు తెలుగు పరిశ్రమ తలదించుకోవాల్సి వస్తుంది.
ఎస్ మొహిద్దీన్, పొన్నూరు
ఆమె మనసు వెన్న!
ఆనాటి నటి సూర్యకాంతం మొదట చంద్రలేఖ చిత్రంలో నాట్య కళాకారిణిగా ప్రవేశం చేసి, తదుపరి అనేక చిత్రాల్లో గయ్యాళి అత్త పాత్రలతో ప్రేక్షకుల మనస్సులో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. గయ్యాళి అత్తలను సూర్యకాంతంతో పోల్చేంత సహజంగా నటించే సూర్యకాంతమ్మ తన నిజ జీవితంలో ఓర్పు, సహనం, దానశీలిగా నిలిచిన ఆదర్శవంతమైన మహిళ! ఆమె షూటింగ్ విరామ సమయంలో తినుబండారాలు తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టే ఉదార స్వభావంగల స్ర్తిమూర్తి! ఓసారి ఆమె వేసిన పాత్ర ప్రకారం చిత్తూరు నాగయ్యను తిట్లు శాపనార్థాలు పెట్టాలి. అయతే, షూటింగ్ అయిపోయన తరువాత సూర్యకాంతం నాగయ్య కాళ్లమీదపడి భోరున ఏడ్చిందట! వూహించుకుంటేనే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయ. అందుకే ఆమె మనసు వెన్నతో సమానం!
- కెవిపి, కందుకూరు
ప్రజ్ఞాశీలురు..
అడుగుపెట్టిన రంగంలోనేకాక, ఆసక్తికలిగిన రంగాల్లోనూ రాణించిన వాళ్లు సినీ పరిశ్రమలో కోకొల్లలు. కళావాచస్పతిగా పేరుగాంచిన కొంగర జగ్గయ్య ‘గీతాంజలి’ పేరిట కవితా సంకలనాన్ని వెలువరించారు. అటు విలనీగా, ఇటు ఉదాత్తమైన పాత్రలతో మెప్పించిన గొల్లపూడి మారుతీరావు కథ, మాటల రచయితగా తనదైన ముద్రవేశారు. అనేక పత్రికల్లో వ్యాసాలు రాయడమేకాకుండా, కవిగా ఆధ్యాత్మిక పాటలు రచించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన రంగనాథ్, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో జీవితసారాన్ని కవితలుగా అందించారు. శతమతుల భానుమతి ‘అత్తగారి కథలు’ పేరిట అద్భుతమైన పుస్తకానే్న తెచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ ఆమధ్య ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్లుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభుదేవా, లారెన్స్ రాఘవ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చిన ప్రకాష్‌రాజ్ లాంటివాళ్లు దర్శకత్వంతో తనదైన ముద్రవేస్తున్నారు. ఈమధ్య స్టార్ హీరోలు పాటలు పాడేస్తుంటే, ఇంకొందరు తమ గొంతును అరువిస్తూ డబ్బింగ్ ఆర్టిస్టులనూ మించిపోతున్నారు. అలనాటి నటుల నుంచి ఈతరం వరకూ బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నదెందరో.
ఎ రఘురాం, ఖమ్మం
వస్తున్నాయ.. పోతున్నాయ?
సినిమాలు వస్తున్నాయ. అంతేవేగంగా థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయ. గత నెలల కాలంలో వారానికి రెండు మూడు చొప్పున ఓ మాదిరి సినిమాలు 50కి పైనే వచ్చినా, బావుంది అని చెప్పుకోడానికి ఐదు కూడా మిగల్లేదు. సినిమాకు అలవాటుపడిపోయన ప్రేక్షకుడు ఆశగా థియేటర్లకు పరిగెత్తడం, నిరాశతో ఇంటికి చేరుకోవడమే కనిపిస్తోంది. ఒకటో రెండో మంచి సినిమాలు వస్తుంటే, వాటిని పట్టుకునే ఇదీ తెలుగు ప్రరిశ్రమ ఘనత అంటూ భుజాలు చరుచుకుంటున్నాం. ప్చ్!
జివి కమల, తాడేపల్లిగూడెం