మీ వ్యూస్

ఐటమ్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటమ్ సాంగ్ అనగానే బూతు పాట అని భావిస్తారు. ఫలానా హీరోయిన్ ఈ పాటలో నటిస్తుందంటే ఆ సినిమా కోసం ఎదురు చూస్తారు. భారీ పారితోషికం కోసం హీరోయిన్లు కూడా ఈ పాటలు చేయడానికి ఎగబడుతున్నారు. ఐటమ్ సాంగ్ అంటే చీప్ భావన వుంది కాబట్టి హీరోయిన్లు వాటిని ప్రత్యేక గీతాలు అని గొప్పలు పోతున్నారు. లేని గౌరవం ఆ పాటలకు ఆపాదిస్తున్నారు. తమ న్నా ఓ అడుగు ముం దుకేసి ఐటమ్ సాంగ్‌లో చేయడమంటే హీరోయిన్‌కు ఓ ప్రత్యేక గౌరవం దక్కినట్టే అని సెలవిచ్చింది. ఆహా! మహాతల్లి! హీరోయిన్ అనగానే గ్లామర్ అని, ఆమె గ్లామర్ కోసమే ఆ పాట కేటాయించడం అంటే ప్రత్యేక గౌరవం కాదా అని ఆమె ఉద్దేశం. ఓహో! భళి భళి!!
-కె.హితీక్ష, రమణయ్యపేట
చేసింది తప్పే!
ఇటీవల ఓ సినీ విశే్లషకుడు ప్రముఖ నటు డు రాజకీయ అరంగేట్రం చేయడంపై తీవ్ర పదజాలంతో అవాకులు చవాకులు చేసా డు. ఆ విశే్లషకుడు చేసిన తప్పే అది. అందుకు ప్రతిగా వారి అభిమానులు క్షమాపణలు చెప్పమనడమే సబబే. కొ న్ని వందల మంది అభిమానులు స్పందించి తీవ్రమైన బూతు పదజాలంతో ఆ విశే్లషకుడు కుటుంబాన్ని తిట్టడం అనేది భావ్యమైన అంశం కాదు. ఇది మీ నాయకుడికి మచ్చ తెచ్చే విధంగా వుంటుంది. ఏమైనా ఉంటే క్షమాపణ కోరాలి. అందుకు అనేక మార్గాలున్నాయి. ఉదాహరణకు శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగ నిరశన శాంతియుతంగ చేయవచ్చు. అభిమానం దురభిమానంగా మారకూడదు. ఆ విశే్లషకుడి విమర్శలను సినీ పరిశ్రమలోని ప్రముఖులుకూడా తప్పుపట్టారు. రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులకు ప్రతిపక్షాలనుండి విమర్శలు వస్తునే వుంటాయి. అందుకు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలి కానీ తిట్ల పురాణం తీయరాదు. ఆ హీరో శాంతియుతంగా వున్నా అభిమానులు మాత్రం హీరో బాటలో నడవలేదు.
-ఎఆర్‌ఆర్‌ఆర్, ఖమ్మం
హవ్వా...జక్కన్నకా?
ప్రపంచంలో ఏ హీరో మా మూలుస్థాయినుండి వచ్చి దాదాపు 70 సంవత్సరాలు నటుడుగా రాణించడం మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్కినేని అవార్డును ఇస్తూ ఈ సంవత్సరం రాజవౌళికి ఇవ్వడం బాగోలేదు. కేవలం పది చిత్రాలు చేసిన ఆయన చిత్రాల్లో కొట్టుకోవడం చావడం తప్ప ఏమీ చూపలేదు. ఎందరో మహానుభావులున్నారు. రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, తమిళంలో మణిరత్నం, భారతీరాజా, మళయాళంలో మోహన్‌లాల్, హిందీలో అనుపమ్ ఖేర్, మన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇలా ఎందరో మహానుభావులుంటే కేవలం గ్రాఫిక్స్, సెట్టింగులు, మాయాజాలంతో సినిమాలు తీసే రాజవౌళికి ఇవ్వడం భావ్యంగా లేదు. ఇందులో ఎఎన్‌ఆర్ అవార్డు కమిటీకి సొంత లాభం కూడా కొంత వుండవచ్చునేమో! వచ్చే సంవత్సరంలోనైనా నిష్ణాతులకు ఇస్తారని ఆశిస్తున్నా.
-పెద్ది విజయేంద్రరావు, సికింద్రాబాద్-61
సింగిల్ లైన్ సినిమాలు
కొన్ని కొన్ని సినిమాలు చించి పడేసిన సిగరెట్ అట్టముక్కలపై రాసుకున్న సింగిల్ లైన్‌నుండి పుడతాయి. ఓ దర్శకుడు బీచ్‌లో టీ తాగుతూ ఉన్నట్టుండి ఏదో ఐడియా వస్తే ఓ లైన్ రాసుకుంటాడు. ఏది దొరక్కపోతే సిగరెట్ అట్టను చించి రాసుకుంటాడు. ఆ ఒక్క సింగిల్ లైనే అద్భుత కావ్యంగా ఆ తరువాత రూపుదిద్దుకుంటుంది. హీరోకి కథ చెబుతాడు. నచ్చిన హీరో దర్శకుడిని అభినందించి ఓకే కేరీఆన్ అంటాడు. ఇలా ఎన్నో వందల కోట్ల రూపాయలతో ఆ ఓక్క సింగిల్ లైన్ సినిమాలు వచ్చాయి. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన సినిమాను భూత అద్దం పెట్టి పరికించినా ఆ రాసుకున్న సింగిల్ లైన్ ఏ సన్నివేశంలో పొదిగాడో తెలియదు. కేవలం ఒక్క లైన్‌తో సినిమా ప్రారంభించి ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి హీరోహీరోయిన్ల ఇమేజ్‌ని బట్టి సన్నివేశాలు మార్చుకుంటూపోతే నిజమైన కథ ఉంటుందా, లేక తెల్లారే డబ్బా సద్దుకునే సినిమా తయారవుతుందా?
-వాసిరాజు రామకృష్ణ, వజ్జిరెడ్డిపాలెం
వీరికేది గుర్తింపు?
దర్శకుడు కె.విశ్వనాధ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఆ తరవాత అనేక స్వచ్ఛంద సంస్థలు చిత్ర పరిశ్రమ కూడా సన్మానం చేసి అభినందించాయి. ఇది చాలా సంతోషదాయకం. ఆయన దర్శకత్వంలో వ చ్చిన ఆణిముత్యాల్లాం టి చిత్రాల్లో సిరిసిరిమువ్వ, సిరివెనె్నల చిత్రాలు కూడా వున్నాయి. గీతాకృష్ణా కం బైన్స్ నిర్మాతలు ఎన్.్భస్కరరెడ్డి, యు.చినవీర్‌రాజులు వేటూ రి సుందరరామమూ ర్తి, సిరివెనె్నల సీతారామశాస్ర్తీలాంటి మంచి రచయితలను పరిచయం చేసి గొప్ప చిత్రాలు నిర్మించారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోరుూలెవరు అన్నట్టు ఈ నిర్మాతలను ఎవరు గుర్తించరా?
-ఎస్.ఆర్.ఎస్.కొల్లూరి, అమలాపురం
తగునా ఇది?
సినీ చాన్సులు సన్నగిల్లడంతో ఇళయరాజాకు తెలుగు వాళ్లు జ్ఞాపకం వచ్చారు. తన పాటలను ఎంతగానో ఆదరించారు కనుక వారిపై గౌరవంతో కూడిన వాత్సల్యం ఉందంటున్నారు. ఈ పొగడ్తలు ఎందుకంటే ఆయన నవంబర్ 5న గచ్చిబౌలిలో 80మంది సంగీతకారులతో ఓ విభావరి నిర్వహిస్తాడట! టికెట్ల అమ్మకం ప్రచారానికి వచ్చారు. బాలు ఎన్నో కచేరీలలో ఇళయరాజా పాటలు పాడి వాటిలో సంగీత సాహిత్యాన్ని పొగిడి ఇళయరాజాని బూస్ట్ చేసాడు. అయినా తన అనుమతి లేకుండా తన పాటలు పాడినందుకు లాయర్ నోటీసు పంపించాడు ఇళయరాజా. తెలుగోళ్లు ఆయనపై గౌరవ వాత్సల్యాలు చూపితే గాయకుడైన తెలుగు వాడిని కోర్టుకు లాగుతున్నాడు ఈ మహానుభావుడు. గొప్పోడు కదూ!
-కె.గునే్నష్, కొవ్వాడ
అర్ధం ఏమిటి?
కొత్త సినిమా రిలీజ్ ముందు హీరో హీరోయిన్ లేదా దర్శకుడి ఇంటర్వ్యూలు ప్రచురించడం కొత్త ట్రెండ్. ఇలాంటి ఇంటర్వ్యూలలో మేడమీద అబ్బాయి హీరో నరేష్ మాట్లాడుతూ ఫ్లాప్ సినిమాలో ఎవరూ నటించరు అన్నాడు. అలా అనడంలో అర్ధం ఏమిటి? చి త్రం నిర్మిస్తున్నప్పుడు అందరూ హిట్ కోసమే ప్రయత్నిస్తారు. హిట్ అవుతుందనే నమ్ముతారు. విడుదలయ్యాకే బండారం బైటపడుతుంది. తన సినిమా హిట్ అవుతుందనే నరేష్ ఆ సినిమాలో నటించాడట. కానీ అది కాస్తా తేలిపోయింది. ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు కదా? మరి అతని మాటకు అర్ధం ఏమిటి?
-పి.శాండిల్య, కాకినాడ