మీ వ్యూస్

నిరసనలు పెచ్చుమీరతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిం సెన్సారింగ్‌ని నిరసిస్తూ సెన్సార్ బోర్డుని ఎత్తేసి దర్శక నిర్మాతలకు స్వయం నియంత్రణ హక్కు ఇవ్వాలని పెద్ద తలకాయలు అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాయ. స్వయం నియంత్రణ అంటూ మీడియా ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నదో చూస్తూనే ఉన్నాం. భారతీయులు అసలు నియంత్రణనే పట్టించుకోరు. పైగా స్వీయ నియంత్రణా? బూతు చిత్రాలు అనగానే కొందరు దర్శకులు జ్ఞాప కం వస్తారు. సెన్సారు బోర్డు లేకపోతే వాళ్లు విజృంభిస్తారు. అర్జున్‌రెడ్డి చిత్రం విడుదల కాగానే సెన్సార్ బోర్డుకి పాడె కట్టి ఊరేగించి భస్మం చేశారు విజయవాడ మహిళలు. సెన్సార్ బోర్డు లేకపోతే మహిళల నిరసనలు పెచ్చుమీరతాయి. అమ్మాయిల్ని వేధించే ఆకతాయిలు పెరుగుతారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి.
-లంబకర్ణ, రాజేంద్రనగర్
ప్రకాశించింది
వెనె్నల ప్రకాశించింది. వచ్చిన వెనె్నలలో ‘ఇప్పుడిదే ట్రెండ్’ కరెంట్ అఫైర్ న్యూస్ వివరణ బాగావుంది. రాధా సఖీయం వ్యాసంలో వాణిశ్రీ సినీ కెరీర్ కొంత తెలుసుకునే అవకాశం కలిగింది. ఆత్రేయ వర్ధంతి సందర్భంగా మాతృగీతాల వ్యాసం సందర్భానుసారం సాగింది. నాకు నచ్చిన సినిమా, పాట షరా మామూలే. చక్రవర్తిమీద ‘పాట కంకి మురిసింది’ అన్న పదాలు కొత్తగా వున్నాయి. ఇంతవరకు ఆయనపై ఒక్క వ్యాసం కూడా రాలేదు. వెనె్నలలోనే మొదటగా వచ్చింది. కొమ్మినేని అప్పారావు నిజంగా చక్రవర్తే.
-పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
తండ్రి ఆశయాన్ని
నీరుకారుస్తున్నాడా?
తన తండ్రి ఆశయాన్ని నాగార్జున నీరుకారుస్తున్నాడా? అలాగే అనిపిస్తోంది. సంవత్సరానికి ఒకరు చొప్పున సినీ లెజెండ్స్‌కి ఎఎన్నార్ అవార్డు ఇవ్వాలని ఆయన ఆశయం. 2013లో శ్రీదేవికివ్వాలని ప్రకటించిన తర్వాత ఆయన జబ్బు పడి మరణించగా శ్రీదేవికి కాక, అమితాబ్ బచ్చన్‌కి అవార్డు ఇచ్చాడు నాగార్జున. ఆ తర్వాత రెండేళ్లు ఎవరికీ అవార్డు ఇవ్వలేదు. హఠాత్తుగా మేల్కొన్నట్లు ఈమధ్య 2017 సంవత్సరపు అవార్డు రాజవౌళికి ప్రకటించి రెండు ఏళ్లు అవార్డు ఎందుకివ్వలేదో చెప్పలేదు. ఆ ప్రకటన సభలో అవార్డు గురించి ప్రస్తావించకుండా యాక్టింగ్ స్కూలు గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇవన్నీ చూస్తే ఎఎన్నార్ అవార్డుకి నాగార్జున గండికొట్టినట్టే అనిపిస్తోంది.
-ప్రసన్న, పేర్రాజుపేట
కవ్వించలేదు!
కథలో రాజకుమారి ఏమాత్రం కవ్వించలేకపోగా కథనం అర్థంకాక నీరసంగా సాగింది. సినిమాలో రోహిత్ పాత్రకాని, నాగకన్య పాత్రకాని నవ్యతగా లేదు. బాగా ఒళ్లు చేసి రోహిత్, కంపలాంటి గడ్డంతో నాగశౌర్య బాగాలేరు. నమితాప్రసాద్ ఫర్వాలేదు. నందిత అయితే బాగుండేది. ఇళయరాజా ఏ పాట చేసేరేమోగాని ఒక్క పాట కూడా హిట్ కాలేదు. మొదటినుండీ నారా రోహిత్ తన చిత్రాలలో మంచి కామెడీ లేకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో అతనికే తెలియాలి. ఒకే మాదిరి పాత్రలలో రోహిత్‌ని హీరోగా ఎన్ని సినిమాలని చూస్తాం చెప్పండి! రోహిత్ సీరియస్‌నెస్ తగ్గించి వినోద తరహా పాత్రలు చేస్తూ స్టెప్స్ నేర్చుకుంటే అభిమానులు పెరుగుతారు.
-పి.ఎల్ సుజాత, అద్దంకి
ప్రతిభ సూపర్!
‘పైసా వసూల్’ చిత్రంలో పూరి జగన్నాథ్ దర్శక ప్రతిభ సూపర్! బాలకృష్ణ నటనలో మార్పులేదు. ఫొటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంది. చిత్రం కథ పాత సీసాలో కొత్త సారాయిలా వుంది. పాటల్లో వసూలు పాట బావుంది.
-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
చివరి రోజుల్లో ...
తెలుగు సినీ జగత్తులో ప్రముఖ నటులుగా వెలుగు వెలిగి కీర్తి పతాకాల్ని అందుకుని చివరి దశలో ఆర్థికంగా చితికిపోయి కుటుంబం గడవటమే కష్టంగా మారిన నటులు ఉన్నారు. అలనాటి పద్మశ్రీ చిత్తూరి నాగయ్య హీరోగా, గాయకుడిగా, నిర్మాతగా వెలుగొంది చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అలాగే ముందుతరం హాస్యనటులలో ప్రముఖుడైన కస్తూరి శివరాం ఈనాటి తరంవారికి ఇతని పేరు కూడా తెలియకపోవచ్చు. కొన్ని వ్యసనాలకు బానిసై ఉన్నత స్థానంలో వున్న అతను అధఃపాతాళానికి వెళ్లాడు. కడు దయనీయమైన మరణాన్ని పొందాడు. జానపద పౌరాణిక చిత్రాలలో హీరోకు ధీటుగా సమ ఉజ్జీగా వెలుగొందిన రాజనాల సైతం కుటుంబ కారణాలవల్ల ఆర్థికంగా చితికిపోయి చివరిదశలో చిన్నా చితకా వేషాలు వేయడం జరిగింది. హాస్యనటి గిరిజ సైతం తన భర్త మూలంగా ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక ఒడిదుడుకులకు లోనై చివరికి గయ్యాళి పాత్రలు వేయాల్సి వచ్చింది. అలనాటి అందాల నటుడు, ఆర్థిక పుష్టిగల వ్యక్తిగా ఉన్నా తాగుడు వంటి వ్యసనాలకు బానిస అయ్యి తన కెరియర్‌ను తానే నాశనం చేసుకున్నాడు. తేనెమనసులు వంటి సినిమాతో హీరోగా ప్రవేశించిన రాంమోహన్ వంటి నటుడు సైతం కొన్ని సినిమాలకే పరిమితమై చివరకు ఒక షాపులో పనిచేసినట్లు తెలుస్తోంది. జానపద హీరోగా వెలుగొంది ఇతర రాష్ట్రాలలో ఇమేజిని సంపాదించుకున్న కాంతారావు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి సరిగ్గా ఆడక ఆర్థిక ఊబిలో చిక్కుకొని చిన్న చిన్న పాత్రలకు పరిమితమయ్యారు. మరో ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం అనేక మంచి చిత్రాలను నిర్మించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి కొందరి మోసానికి బలై ఆర్థికంగా దెబ్బతిన్నారు. ప్రముఖ నటి కన్నాంబ సైతం చివరి రోజుల్లో దయనీయమైన మరణాన్ని చవిచూసినట్లు పత్రికల్లో వార్తలను బట్టి తెలుస్తోంది. పై నటులలో కొందరు గుప్తదానాలు చేసి ఎందరికో ఆర్థికంగా అండదండలుగా నిలిచి వారు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. నేటి తరంలో అందుకు భిన్నంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అన్నిటా సహాయ సహకారాలు అందిస్తూనే తమ కెరియర్‌ను కాపాడుకుంటున్నారు.
-అయినం రఘురామారావు, ఖమ్మం