మీ వ్యూస్

సినిమా వాల్‌పోస్టర్లపై నిషేధం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్లు సినిమా థియేటర్ల వారిని సినిమా వాల్‌పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల గోడలపై అంటించడం నిషేధించారు. కొన్ని పట్టణ ప్రాంతాలలో ఈ నిషేధం అమలువలన సినిమా ప్రేక్షకులకు ఏ సినిమా ఏ థియేటర్‌లో ఆడుతుందో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఎందువలన అంటే గోడలు పాడుచేస్తున్నారని, అసభ్య శృంగార భంగిమల వలన మహిళల అభ్యంతరాలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు చెబున్నారు. ప్రేక్షకుల అసౌకర్యం కారణంగా కలెక్షన్స్ తగ్గుతున్నాయని వారి వాదన. అనుమతి లేని ప్రభుత్వ ఆఫీసులు వదిలేస్తే అభ్యంతరాలు లేని ప్రైవేట్ వ్యక్తుల గోడలపై కూడా ప్రభుత్వ నిషేధాలు ఎందు కు? ముఖ్యంగా ఊళ్ళ ల్లో సినిమాలు ఆడుతున్న సమాచారం తెలుసుకోవటానికి వాల్‌పోస్టర్ల సంప్రదాయం ఉండాల్సిందే! కాని వాల్‌పోస్టర్ల ప్రింటింగ్‌పై అసభ్యానికి తావులేని విధంగా నిర్దిష్టమైన ఆంక్షలతో అనుమతి ఇస్తే ప్రేక్షకుల అసౌకర్యం తీరుతుంది. కొన్ని పట్టణాలలో వాల్‌పోస్టర్లను అంటించడం పూర్తిగా మానివేశారు. సినిమాల సెన్సారింగ్‌లో కంట్రోల్ లేకుండా ఎలా వేసినా సర్ట్ఫికెట్స్ ఇస్తున్నారు. అలాగే వాల్‌పోస్టర్ల ముద్రణలో కూడా ఆంక్షలు విధిస్తూ నిర్దిష్టంగా పాటించేలా చేస్తూ సర్ట్ఫికెట్స్ ఇవ్వాలి. ముఖ్య కూడళ్ళలో ప్రకటన బోర్డుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. ఈ ప్రకటన బోర్డులపై రుసుము వేస్తారని, అది వారికి భారంగా అవుతుందనేది ఓ వాదన. ఏది ఏమైనా ఉభయులకు అవగాహన ఉంటే ఇబ్బంది లేదు. ప్రేక్షకులకు ఏ హాలులో ఏ సినిమా ఆడుతుందో తెలుసుకోవడం కూడా అవసరమే! కాదంటారా?
-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి