మీ వ్యూస్

ప్రతినాయిక పాత్రలలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక పాత్రలతో పాటు ప్రతినాయిక పాత్రలను వేసి మెప్పించిన ఎందరో ప్రముఖ నటీమణులు ఉన్నారు. భానుమతి ప్రతినాయిక పాత్ర ఉన్న తెనాలి రామకృష్ణుడు, పల్నాటియుద్ధం, పెద్దరికం వంటి పాత్రలలో అలరిపంజేశారు. తొలినాళ్ళలో అంజలీదేవి కీలుగుర్రం వంటి సినిమాల్లో నటించారు. ప్రముఖనటి సావిత్రి అభిమానం సినిమాలో ప్రతినాయిక పాత్ర ఉన్న పాత్రను పోషించారు. అలాగే వాణిశ్రీ బొబ్బిలిరాజా, అల్లరి అల్లుడు, భద్రాద్రి రాముడు సినిమాలలో, లక్ష్మి లాహిరి లాహిరి లాహిరి సినిమాలో, జయచిత్ర అబ్బాయిగారు, ఘరానా అల్లుడు వంటి చిత్రాలలో అలరింపజేశారు. నిర్మలమ్మ సైతం సీతారామరాజు, నిజస్వరూపాలు చిత్రాలలో నటించారు. రాజసులోచన మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, చిన్నకోడలు వంటి చిత్రాలలో నటించారు. అలాగే విజయలలిత, జ్యోతిలక్ష్మి వంటివారు కూడా ఈ కోవలో ఉన్నారు. నగ్మా అల్లరి రాముడు సినిమాలో, జయప్రద మహారథి నటించారు. అలాగే మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి, ఇంకా ఎందరో నటీమణులు ప్రతినాయిక పాత్రలే కాక అన్ని పాత్రలకు న్యాయం చేశారు. ఈ తరంలో ఇప్పుడిప్పుడే కొందరు ప్రతినాయిక పాత్రల షేడ్స్ ఉన్నవాటిలో నటిస్తున్నారని చెప్పవచ్చు. అందులో నదియా వంటివారు కొందరు.
-అయనం రఘురామారావు, ఖమ్మం