మీ వ్యూస్

వన్‌మ్యాన్ షో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జై లవకుశ’ సినిమా క్లాస్, మాస్ అందరినీ అలరిస్తూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అనిపించుకుంది. సింహాద్రి తరువాత ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో అయింది జైలవకుశ. ఆద్యంతం ఎన్‌టిఆర్ కడుపుబ్బ నవ్వించడమే గాక కంటతడి పెట్టించాడు. నవరసాలనూ అలవోకగా పోషించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు పాత్రల నటనలో ఇంతవరకూ ఎవ్వరూ చూపించలేనంత వైవిధ్యం చూపించాడు. జై క్యారెక్టర్ ద్వారా విలన్‌గా నటించే సాహసం చేసి, అద్భుతంగా నటించి, విమర్శకుల నోళ్ళు మూయించాడు. ఈ చిత్రంలో ఒక అద్భుత సందేశం ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలి. ఒకే తల్లికి పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు పెద్దలూ సమాన ప్రేమతో చూడాలి. వారి లోపాలను ఈసడించుకుంటూ వివిక్ష చూపిస్తే, అది వారి భవిష్యత్‌పై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలియజెప్పింది.

-సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం