మీ వ్యూస్

కాపీ సహజమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబి పేరుతో దర్శకత్వం (జైలవకుశ) వహించిన కె.ఎస్.రవీంద్ర రాసిన కథగా మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా టైటిల్స్ చూపించారు. కాని ఆ కథ థీమ్, కొన్ని సన్నివేశాలు తను రాసిన నవల ‘నా మనసు కోరింది నినే్న’లోనివి అంటూ కాపీ రైట్ చట్టం కింద ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్‌లపై రచయిత్రి శ్యామలారాణి కేసు పెట్టింది. నోటీసు అందిన తర్వాత స్పందిస్తామని దిల్‌రాజు ప్రతినిధులన్నారు. చిత్రసీమలో కాపీ లు సహజమే. చిరంజీవి 150వ చిత్రం, త్రివిక్రమ్ ‘అ ఆ’ చిత్రాలు కాపీలే. ఆ నిర్మాతలు సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడూ అలాగే జరగవచ్చు. అయితే శ్యామలారాణి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. చిత్రం రిలీజ్ అయిన ఆరేళ్లకు కేసు పెట్టడం ఏమిటో అర్థం కాదు.

-శాంతి సమీర, వాకలపూడి