మీ వ్యూస్

ఎగిరిన ‘స్పైడర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శక దిగ్గజం ఎస్.జె.సూర్య సైకో విలన్‌గా నటించిన ‘స్పైడర్’ చిత్రం మాస్ ప్రేక్షకులకే కాక మేధావులు, క్లాసికల్ వారికి విపరీతంగా నచ్చింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు చేసిన ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర బాగా పండింది. భైరవ పాత్రలో సైకో కిల్లర్‌గా ఎదుటివాడు చస్తే సంబరపడే పాత్రలో ఎస్.జె.సూర్య నటన హీరోను బీట్ చేసింది. సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ ద్వారా హాస్పిటల్ బ్లాస్ట్ దృశ్యాలు టెన్షన్‌కు గురి చేసాయి. చిత్రంలో మహేశ్ బాబు వేసిన శివ పాత్రలో లీనమైపోయాడు. ఫోన్‌కాల్ టాప్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారికి మహేశ్‌బాబు వేసిన పాత్ర గుణపాఠంగా మారుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రంలో మహేశ్‌బాబు కామెడీ, డాన్సులు, ఫైట్లు కాక సరికొత్త కథను నమ్ముకుని ఈ చిత్రంలో నటించడం పట్ల మహేశ్‌బాబుని అభినందించాల్సిందే.

-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి