మీ వ్యూస్

ఉట్టిపడేలా తీర్చిదిద్దారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండమ్మ కథకు మూలం షేక్‌స్పియర్ ‘టేమింగ్ ఆఫ్ ద ష్రూ’ అన్న ఆంగ్ల కథకు స్వేచ్ఛానువాదం ‘బహదూర్ గండ’ పేరుతో ‘బీచి’ అన్న కన్నడ ప్రసిద్ధ హాస్య రచయిత చేసినారు. ఆ కథ ఆధారంగా ‘గుండమ్మ కథ’ను విజయావారు మన తెలుగుతనం ఉట్టిపడేలా తీర్చిదిద్దినారు. దానినే మళ్లీ కన్నడిగులు ‘నంజుండ కల్యాణ’ పేరుతో రీమేక్ కొట్టినారు. మళ్లీ డబ్బింగ్ లేదా రీమేక్‌తో తెలుగులోకి తెచ్చారు. విఠలాచార్యగారి ‘మనెతుంబిద హెణ్ణు’ మాత్రం కాదని చెప్పగలను. ఎందుకంటే ఆ సినిమా నేను చూచినాను. బీచిగారి నవల చదివినాను. ఇక ఆత్రేయగారి పాటలన్నీ కాకపోయినా చాలావరకూ అలా కాకతాళీయంగా వెలువడ్డ అంశమో, పదాలో, వాక్యాలతోనే ప్రారంభం అయ్యాయని చెబుతూ ఉంటారు సినీ పండితులు.
-ఆయి కమలమ్మ, వనస్థలిపురం