మీకు మీరే డాక్టర్

మెటబాలిక్ వ్యాధులు - నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: మేం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అయినా స్థూలకాయం తగ్గటంలేదు. కారణం ఏమై ఉంటుందంటారు?
-లక్ష్మీ సామ్రాజ్యం (విద్యాధరపురం)
*
జ: శక్తిని నిల్వ వుంచటానికి ట్రైగ్లిజరైడ్స్ అనే ప్రత్యేకమైన కొవ్వు ధాతువుని శరీరం ఉపయోగిస్తుంది. ఇది లిపిడ్ మెటబాలిజం అనే జీవన క్రియకు సంబంధించిన విషయం.
ఆయుర్వేద శాస్త్రంలో ఈ లిపిడ్ మెటబాలిజాన్ని ‘మెదోధాత్వగ్ని పాకం’ అనే ప్రక్రియగా చెప్తారు. మేదోధాతువు అంటే కొవ్వు. దీన్ని శరీరానికి ఈ మేదోధాతు అగ్ని మందగించినప్పుడు ఆమం ఏర్పడుతుంది. అజీర్తి చేసినప్పుడు ఏర్పడే అరిగీ అరగని ఆహారాన్ని ‘ఆమం’ అంటారు. అలానే, కొవ్వు ధాతువు శరీరానికి వొంటబట్టకుండా మిగిలిపోయిన ఈ ‘ఆమ కొవ్వు ధాతువు’ నాణ్యతలేని కొవ్వు. శరీరానికి హానికారకం అవుతుంది.
కొవ్వు ధాతువుకు సంబంధించిన ఈ జీవన క్రియ (లిపిడ్ మెటబాలిజం)లో సమతుల్యత లోపించడం వలన కొవ్వు కణాలు లివరు లోపల పేరుకు పోతాయి. అలాంటి కాలేయాన్ని ‘్ఫటీలివర్’ అంటారు. ఇలా మేదో ధాత్వగ్నిపాకం విఫలం అయినప్పుడు కార్టిజాల్ అనే గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరిగినట్టు శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ కార్టిజోల్ హార్మోను కాలేయాన్ని కొవ్వుతో నింపుతోంది. కార్టిజోన్ల వాడకం వలన ట్రైగ్లిజరాయిడ్స్ శరీరంలో పెరగటానికి కారణం ఇదే. ఆస్తమా, కీళ్లవాతం, ఎగ్జిమా ఇతర ఎలర్జీ వ్యాధుల్లో కార్టికో స్టిరాయిడ్స్ అపరిమితంగా వాడుతున్నప్పుడు ఈ పరిస్థితులు పెరుగుతాయని, లిపిడ్ మెటబాలిజం దెబ్బతినటానికి ఇదే కారణం అని జెర్మన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్తవ్రేత్త డా.స్టీఫెన్ హెర్జిగ్ ప్రకటించారు.
కొవ్వుతో కాలేయం నిండిపోవటం అనేది జీవన క్రియలకు సంబంధించిన షుగరు వ్యాధి, స్థూలకాయం, రక్తపోటు లాంటి అనేక వ్యాధులకు తలుపులు తెరిచినట్టవుతుంది. ఈ వ్యాధుల సమూహాన్ని ‘మెటబాలిక్ సిండ్రోమ్’ అంటారు.
ఆహారం ద్వారా శరీరం తీసుకునే కేలరీలలోంచి, శ్రమ ద్వారా శరీరం ఖర్చు చేసే కేలరీలను తీసేయగా శరీరంలో శేషంగా మిగిలిన కేలరీలు రక్తంలోనూ, వదులుగా ఉండే కొవ్వు భాగాల్లోనూ, లివరులోనూ పేరుకుపోతాయి.
వదులుగా ఉండే కొవ్వు కణాలలో కేలరీలు చేరటం వలన ఆ కొవ్వు కణాలు వాటి పరిమాణాన్ని మించి ఉబ్బుతాయి. అందువలన వదులుగా ఉండే కొవ్వు పొరలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ అంటే పొట్ట, పిరుదులు, డొక్కలు, రొమ్ములు ఇవన్నీ లావుగా తయారై స్థూలకాయం ఏర్పడుతుంది. దీన్ని చరకుడు ‘బహ్వబద్ధా మేదాః’ అంటూ ఒక సూత్రంలో వివరించాడు. బద్ధం అంటే బాగా బిగుతుగా ఉండటం. ‘బహు అబద్ధం’ అంటే, బాగా లూజుగా ఉండే మేదస్సు (కొవ్వు)లో చేరి స్థూలకాయాన్ని తెస్తున్నాయని చెప్పాడు.
మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ లేకపోవటాన, తీసుకునే కేలరీల సంఖ్య పెరిగి, ఖర్చయ్యే కేలరీల సంఖ్య తగ్గిపోయి బాల్యంలోనే స్థూలకాయానికి పునాదులు పడుతున్నాయి. జీవన వ్యవస్థ ఇదే రీతిలో కొనసాగటం వలన మనిషి స్థూలకాయానికి ఎర అవుతున్నాడు.
ఓ యాభై ఏళ్ల క్రితానికి వెళితే ఆనాటి తెలుగు ప్రజలకు తినాలని వ్యామోహం కలిగించే పీచుమిఠాయి, పూస మిఠాయి, నువ్వు జీడీలు, పప్పు చెక్కలూ ఇలాంటి ఆహార పదార్థాలు ఉండేవి. రోజులు మారాయి. వాటిని ఇప్పటి పసిపిల్లలకు చూపిస్తే ఛీ కొడతారు. అవేం తిళ్లూ అంటారు. బర్గర్ల పర్వతాలూ, పిజ్జాల దొంతరలు, కేకుల గుట్టలు, స్టారు చాక్లెట్ల కొండలూ, రస్నాల వాగులూ ఈనాటి తరానికి అవే ప్రకృతి సంపద. అవి తినటమే నాగరికత అనీ వాటిని తినటమే గొప్ప అనీ, పీచుమిఠాయిల్లాంటివి అలగా జనం తినేవనీ ఒక అభిప్రాయం ఇప్పటి పిల్లల్లో బలంగా నాటుకు పోయి ఉంది.
పిజ్జా ( ఇ్ఘరీళజూ ఔజళ యచి నిఆ్ఘజ్ఘశ యూజజశ ష్యశఒజఒఆజశ యఛి ఘ ఒ్ద్ఘ్యతీ ఇళ్ఘజూ జరీళ షూఖఒఆ) ని టమోటా సాసుతోనో, వెన్నతోనో, ఏదైనా నూనె పదార్థంతోనో నంజుకు తింటారు. అన్నానికి బదులుగా తినేవన్నీ డైటింగుకు ఉపయోగపడేవేననే ఒక బలమైన అభిప్రాయం చాలా మందిలో ఉంది. హోటల్లో బట్టర్ నాన్‌లూ, స్పైసీ కర్రీలు తెప్పించుకుని తింటూ ఒక పెద్దాయన ‘రాత్రిపూట తేలిగ్గా తినటం నాకు అలవాటండీ’ అని తన డైటింగు రహస్యం చెప్తున్నప్పుడు మనుషులు ఎంత త్వరగా భ్రమలకు లోనౌతారా అనిపిస్తుంది.
కేలరీలన్నింటినీ లాకరులో పెట్టినట్టు తెచ్చి భద్రంగా దాచటం వలన, శరీర వినియోగానికి కావలసిన శక్తి కోసం కేలరీలు పరిమితంగా వెడతాయి. శక్తి హీనత ఏర్పడి, ఎంత తిన్నా నీరసం తగ్గటం లేదనిపిస్తుంది. దాంతో అదనపు కేలరీల కోసం మెదడులోని నాడీ కేంద్రాలు ఆకలిని ప్రేరేపిస్తాయి. తిండి ధ్యాస పెరిగిపోతుంది. వెర్రి ఆకలి ఏర్పడుతుంది. కొవ్వులో లాక్ అయిపోయిన కేలరీలు ఒకవైపు స్థూలకాయాన్ని పెంచుకుంటూ పోతుంటే, మరోవైపు నీరసం పెరిగిపోతుంటుంది. అటు ఊబ శరీరమూ, ఇటు ఆకలీ రెండూ ఒకదాన్నొకటి పెంచుకుంటూ పోతాయి. శరీర నిర్మాణ క్రియలు (మెటబాలిజం) దానివలన నిలిచిపోతాయి.
కేలరీలు దాక్కునేందుకు శరీరంలో కొవ్వు లేకుండా చేస్తేనే ఊబకాయం తగ్గుతుంది కానీ, కొవ్వును పెంచుకుంటూ, కేవలం వరి అన్నాన్ని మానేయటం వలన ఒరిగేదేమీ ఉండదన్నమాట. ఒరిగేదైతే గోధుమ రొట్టెల్ని మాత్రమే తినేవారిలో స్థూలకాయం ఉండకూడదు కదా..? వారిలోనే ఎక్కువగా ఉంటోందనేది ముఖ్య విషయం.
ఇలా కొవ్వులో కేలరీలు బందీ కావటానికి జీవ రసాయన కారణాలు, జెనెటిక్ కారణాలు చాలా ఉన్నాయి. శరీర శ్రమ, భోజనం చెయ్యగానే నిద్ర, మానసిక ఆందోళనలు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగకపోవటం వాటికి తోడౌతాయి. షుగరు రోగులకు ఇన్సులిన్ ఇస్తున్నపుడు వాళ్లు బరువు పెరగటాన్ని, ఇన్సులిన్ తగినంత లేనప్పుడు బరువు తగ్గటాన్నీ మనం గమనించవచ్చు. ఇన్సులిన్ ఇస్తున్న కొద్దీ కేలరీలు ఖర్చయిపోయి ఆకలి డిమాండ్ ఏర్పడుతుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com