మీకు మీరే డాక్టర్

అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: అల్లం గురించి వివరాలు చెప్పండి. ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదో తెలియజేయండి. ఆరోగ్యానికి అల్లాన్ని వాడుకోవలసిన విధానం తెలుపగలరు.

-జె.వి.బి.శర్మ (ఖమ్మం)

==========================================================
జ: అల్లం ఘాటయిన ఆహార ద్రవ్యం. ఘాటయినవన్నీ వేడిచేసే స్వభావాన్ని సహజంగా కలిగి ఉంటాయి. కాబట్టి వేడి శరీర తత్వం ఉన్నవారికి అల్లం విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది.
అటు మాంసాహారానికి, ఇటు శాకాహారానికి అల్లం అనుకూలంగా ఉంటుంది. ఆయా ఆహార పదార్థాలు తేలికగా అరిగేందుకు తోడ్పడుతుంది. ఆహార పదార్థాలు వికటించి విష దోషాలు శరీరంలో వ్యాపించకుండా ఇది రక్షణ నిస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం రోగులకూ, వాతరోగులకూ, సొరియాసిస్ రోగులకూ ఇది దివ్యౌషధం.
ఔషధంగా ఉపయోగపడే ఆహార ద్రవ్యాలలో అల్లం మొదటగా చెప్పదగింది. ఎందుకంటే, దాని వాడకం అనునిత్యం ఉంటుంది. కాబట్టి! కృష్ణదేవరాయల కాలానికి శాకాహారపు కూరల్లో రుచి కోసం మిరియాలు, అల్లం ఎక్కువగా వాడేవారు. అల్లం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అల్లం చింతపండు లాంటి మిశ్రమాలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. అప్పటికింకా మిరపకాయలు తెలీవు ప్రజలకు.
రోజుకు ఒక వెల్లుల్ని గర్భాన్ని, ఒక అర అంగుళం అల్లం ముక్కనీ తింటే అల్లం, వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలన్నీ మనకు దక్కుతాయి. ఈ పరిమితిని మనం దాటి వాడేస్తున్నాం. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు ఇలా ప్రతీ ఆహార పదార్థంలోనూ అల్లం వెల్లుల్ని మిశ్రమాన్ని కలిపి వండటం అనేది సాధారణం అయ్యింది. మూడు పూటలా కలిపి ఒక వ్యక్తి వివిధ ఆహార పదార్థాల ద్వారా రోజుకు ఎంత వెల్లుల్ని తింటున్నాడు..? ఎంత అల్లం తింటున్నారు? అని లెక్కలు వేసి చూడండి. రోజుకు ఒక గర్భం వెల్లుల్ని సరిపోయే వ్యక్తులు చాలామంది రోజుకు ఒక వెల్లుల్లి పాయ మొత్తం తింటున్నారు. వెల్లులికి అల్లాన్ని తోబుట్టువుని చేసి, రెండింటినీ కలిపి పేష్టులా చేసి విపరీతంగా వాడుతున్నారు. ఇది అనారోగ్య హేతువౌతుంది.
మనం ఇంతింతగా అల్లం వెల్లుల్లిని తింటే, అవి అతిమాత్ర (ఓవర్ డోస్) అయి వికటిస్తాయి. బలం ఇస్తోంది కదా అని బి కాంప్లెక్స్ మాత్రలు ఒక డజను మింగితే ఏమవుతుందో అల్లాన్ని వెల్లుల్లినీ అతిగా తింటే అదే అవుతుంది. శరీరంలోంచి ఇతరులు భరించలేనంత గవులు కంపు రావటానికి వెల్లుల్లి కారణం అవుతుంది. అల్లం విషయంలోనూ ఈ అతి ధోరణిని నియంత్రించుకుంటే, పరిమితంగా తీసుకుంటే అల్లమే ఔషధంలా పని చేస్తుంది.
అల్లాన్ని చిన్ని ముక్కలుగా తరిగి బూందీలాగా వేయించి, కరివేపాకు వగైరా కలిపి ‘చావో’ అనే వంటకాన్ని చైనా వారు ఇష్టంగా చేసుకుంటారు. మనం తరవాణిని చేసుకున్నట్టే కొరియన్లు బార్లీ పిండిని అల్లం ముక్కలు వేసి పులవబెట్టి తయారుచేసుకుంటారు. అల్లం ఊరగాయ పచ్చడిని జపనీయులు ‘బెనిషోగా’ అంటారు. కూరగాయలు అల్లం సలాదుని ‘గిన్థో’ అంటారు. జింజర్ బ్రెడ్లు, జింజర్ బిళ్లలు, బిస్కట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవే!
మయన్మార్‌లో జీడిపప్పు, కొబ్బరి వగైరా అల్లాని దంచి, ఒక వస్త్రంలో ఉంచి గట్టిగా పిండితే అల్లం రసం వస్తుంది. ఈ అల్లం రసంలో తగినన్ని పాలు పోసి ఉడికించి తేనె కలిపి, టీ లాగా తాగే అలవాటు చాలా దేశాల వారికి ఉంది.
ఫాస్ఫరస్, కాల్షియం ప్రొటీన్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. నొప్పి, జ్వరం తగ్గించే గుణాలు అల్లం రసానికి కలగటానికి అందులో జింజిరోన్, షోయగల్ అనే రసాయనాలు ఉండటం కారణం. పేగులను వేగంగా కదిలించి, విరేచనం అయ్యేలా చేస్తాయి. వాతాన్ని, కఫాన్నీ తగ్గిస్తాయి. కానీ, బాగా వేడి చేస్తుంది. అందుకని వేడి శరీర తత్వం ఉన్నవాళ్లు, కడుపులో మంట ఉన్నవాళ్లూ అల్లాన్ని జాగ్రత్తగా వాడాలి. మసాలాలలో అల్లం, వెల్లుల్లి, లవంగం ఇవి ఎక్కువగా కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. అందుకని వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి.
అల్లం రక్త దోషాలను పోగొడుతుంది. బలవీర్యాలను వృద్ధి చేస్తుంది. మిరప కారం చంపుతుంది. దేహకాంతిని కూడా మిరపకారం తగ్గిస్తుంది. అల్లం వృద్ధి నొందిస్తుంది. అదీ అల్లానికీ మిరపకారానికీ తేడా!
అల్లం + బెల్లం కలిపి నూరి, పిప్పర్మెంట్ బిళ్లల పరిమాణంలో బిళ్లలు కట్టి ఆరనిచ్చి సీసాలో పోసుకొని, ఒక్కొక్క బిళ్ల చొప్పున రెండు లేక మూడుసార్లు తింటూ ఉంటే అరచేతిలో చెమటలు పట్టడం, పొట్టు రాలటం తగ్గుతాయి. సొరియాసిస్ వ్యాధిలో ఇది మంచి ఉపాయం!
కోడిగుడ్డు సొనలో అల్లం రసం, కొద్దిగా పాలు కలిపి త్రాగవచ్చు. అల్లం ఆమ్లెట్ కూడా మంచిదే!
నిమ్మరసంలో అల్లం ముక్కలు నానబెట్టిన దాన్ని అల్లం మురబ్బా అంటారు. ఇలా ప్రతి రాత్రీ నానబెట్టి పగలు ఎండబెడుతూ అల్లం ముక్కలు నిమ్మరసాన్ని బాగా పీల్చుకొనేలా చేస్తారు. అల్లం మురబ్బాని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. రుచిని కలిగిస్తుంది. వికారం తగ్గుతుంది. విరేచన బద్ధతకు ఇది మంచి ఔషధం.
సునాముఖి, అల్లం, పుదీనా, తులసి ఆకులు, కొద్దిగా టీ పొడి లేదా గ్రీన్ టీ పొడి కలిపి చిక్కగా టీ కాచుకుని తాగితే, జీర్ణాశయ వ్యవస్థ బలసంపన్నం అవుతుంది.
రోజూ మొదటి ముద్దగా అల్లం ఉప్పు మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో రోజూ తినే అలవాటున్న వారికి శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలసంపన్నం అవుతుంది.
తరచూ దగ్గు, జలుబూ ఆయాసం ఉన్నవారు రోజూ మొదటి ముద్దగా అల్లం ఉప్పు మిశ్రమాన్ని తినడం, అల్లం టీ తాగడం వలన ఎలర్జీ తీవ్రత తగ్గుతుంది. గుండె జబ్బుల్లో రక్తాన్ని పలుచబరిచే మందులు వాడ్తున్న వారు అల్లం రసం కూడా తాగుతుంటే మేలు చేస్తుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు ఈ మూడూ రక్తాన్ని పలుచన చేసేందుకు సహకరిస్తాయి. అలాగని అతిగా తింటే అపకారం చేస్తాయి.
స్థూలకాయం, కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ తగ్గటానికి అల్లం సహకరిస్తుంది. అల్లాన్ని దంచి రసం తీసి, ఒక పూటంతా నిల్వ ఉంచి, పైన తేరిన పలుచని ద్రవాన్ని మాత్రమే తీసుకోవాలి. అడుగున పేరుకున్న పిండిలాంటి పదార్థాన్ని వదిలేయాలి. ఈ రసంలో తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు.
జలుబు, పడిశెభారం, గొంతులో పుండుగా ఉండటం లాంటి బాధలున్నప్పుడు, అల్లం, పుదీనా తులసి ఆకుల రసం కానీ, చిక్కని కషాయం గానీ, లేదా ఈ మూడింటితో టీ గానీ తాగుతుంటే బాధలు త్వరగా ఉపశమిస్తాయి. రోజూ రెండు లేక మూడుసార్లు త్రాగవచ్చు.
అల్లం వలన కొందరికి మలబద్దత పోయి, విరేచనం ఫ్రీగా అవుతుంది. కొన్ని శరీర తత్వాలకు విపరీతంగా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అందుకని పరిమితంగా మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ సరిపడినంత మోతాదును ఎంపిక చేసుకోవాలి.
కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పి ఉన్నవాళ్లకు అల్లం దివ్యౌషధం. దాన్ని జాగ్రత్తగా ఒక ఔషధం మాదిరిగా వాడుకుంటే మేలు చేస్తుంది.
అల్లం నానో కణాలను తీసి పేగులలో వచ్చే వాపుల మీద కూడా ప్రయోగించి చూస్తున్నారు. వాపు తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ఔషధ సేవన చేసేవారికి పేగుల్లో కేన్సర్ ప్రమాదం రాకుండా ఉంటుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి. వరీలలో వచ్చే కేన్సర్ వ్యాధిలో కేన్సర్ కణాలను అల్లం చంపుతోన్నట్టు కనుగొన్నారు. ప్రోస్టేట్ కేన్సర్ వ్యాధి మీద అల్లం రసం ప్రయోగం పని చేస్తుందని ఆధునిక శాస్తవ్రేత్తలు చెప్తున్నారు.
కండరాల నొప్పులు, కండరాలు పట్టేసినట్టుగా ఉండటం, నులిపెట్టినట్టు నొప్పి, రాత్రిపూట పిక్కలు పట్టేసి నొప్పులు కలగటం, తిమ్మిర్లు, మొద్దుబారటం లాంటి లక్షణాలున్న వారు రోజూ అల్లం రసం తాగుతుంటే నరాల వ్యాధుల్లో మేలు చేస్తుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com