మీకు మీరే డాక్టర్

ఆహార ఔషధాలు -3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉల్లికాడల కూర
ఉల్లికాడలు, ఆకుల్ని పులుసు కూరల్లో కలగలుపుగా వండుతుంటారు. ఆకుకూరలు, కాయగూరలతో వండే కూరల్లో కూడా సుగంధం కోసం ఉల్లికాడలను తరిగి కలిపి వండుతుంటారు. మూత్రవ్యాధుల్లో ఇది మంచిది. వేడి వలన బాధపడే వారికి ఇది మంచి ఔషధం. కఫం ఎక్కువగా పడే వ్యాధుల్లో కూడా ఉల్లికాడలు మేలు చేస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర శరీరావయవాలు నీరు పట్టి వాచిపోయిన వ్యాధుల్లో ఉల్లికాడలు నీరు లాగేసేందుకు సహకరిస్తాయి. మల మూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. అన్ని వాత వ్యాధుల్లోనూ ఉల్లికాడ తప్పక తినవలసిన ఔషధంగా భావించాలి. పేగుల్లో వచ్చే వ్యాధుల్లో కూడా ఇవి మేలు చేస్తాయి. కానీ, పులుసు అధికంగా కలిపి ఉల్లికాడల్ని వండితే పేగులకు పులుపు చెడు చేసే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఉల్లికాడల్ని పులుపు లేకుండా ఇతర ఉపాయాల ద్వారా ఆహార పదార్థంగా వండుకోవాలి. జీర్ణశక్తిని పెంచి, అరుచిని పోగొట్టే వాటిలో ఉల్లికాడలు ముఖ్యమైనవి. ఆహారానికి రుచిని పెంచుతాయి.
కాకరాకుతో పచ్చడి,
పులుసుకూర
కాకరాకుల్ని తరిగి ఇతర సంబారాలు కలిపి పులుసుకూరగా చేసుకుని తినవచ్చు. లేదా పచ్చడి చేసుకోవచ్చు. లేత కాకరకాయ ఎంత మేలు చేస్తుందో లేత కాకరాకు కూడా అంతే మేలు చేస్తుంది. కాకర కాయలకున్న గుణాలన్నీ కాకర ఆకులకూ ఉన్నాయి. కొద్దిపాటి చేదు రుచి కలిగిన లేత కాకరాకులు లేత కాకరాకులు టీబీ లాంటి క్షీణింపచేసే వ్యాధుల్లో ఔషధంగా పని చేస్తాయి. బిట్టర్ టానిక్ అనే మాటకు కాకరాకే ముఖ్య ఉదాహరణ. దాన్ని పులుపు, అతిగా మసాలాలు లేకుండా ఉపాయంగా వండుకోగలిగితే కడుపులో ఎసిడిటీని, గ్యాసునీ, కడుపు ఉబ్బరాన్నీ పేగుపూతని కూడా తగ్గించి, జీర్ణకోశాన్ని శక్తిమంతం చేస్తాయి. అన్ని లివరు వ్యాధుల్లోనూ కాకరాకులతో ఏదైనా వంటకం వండి పెడితే లివరు శక్తిమంతం అయి వ్యాధి త్వరగా తగ్గుతుంది. మధుమేహ రోగులు కాకరకాయలు, కాకరాకుల్ని కూడా తరచూ వండుకుని తింటూ ఉంటే షుగరు వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. కడుపులో పెరిగే నులి పురుగులు వెళ్లగొట్టే ఔషధంగా కాకరాకులు పని చేస్తాయి. వీర్యంలో వేడి పెరిగేలా చేస్తుంది కాబట్టి వీర్య కణాలు తక్కువగా ఉన్నవారు కాకరాకుల్ని తినకుండా ఉంటే మంచిది. తక్కిన అన్ని వ్యాధుల్లోనూ ఇది ఔషధం.
కాబేజీ కూర, పప్పు, పచ్చడి
దీన్ని కోసుకూర అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. చలవచేసే వాటిలో ముఖ్యమైన ద్రవ్యం ఇది. పలుచని ఆకుల గుత్తి ఇది. తరచూ కాబేజీ తినేవారికి కమ్మగా నిద్ర పడుతుంది. రక్తవృద్ధి కలుగుతుంది. బుర్ర వేడెక్కిపోతోందనే వారికి చలవ నిస్తుంది. అతిగా మద్యపానం చేసేవారు సమానంగా కాబేజీని కూడా తీసుకుంటూ ఉంటే ఆల్కహాల్ చెడు ప్రభావం శరీరం మీద పడకుండా ఉంటుంది. క్షయ వ్యాధిలోనూ, శుష్కింపచేసే ఇతర వ్యాధుల్లోనూ కాబేజీ కూర ఔషధంగా పని చేస్తుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. ఆహారం తేలికగా అరిగేలా చేస్తుంది. జ్వరం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు నిర్భయంగా పెట్టదగిన ఆహారం. కాబేజీని సన్నగా తరిగి లేదా మిక్సీ పట్టి నీళ్లలో వేసి రసంపొడి కలిపి రసం కాచుకుని రోజూ అన్నంలో తీసుకుంటూ ఉంటే పైన చెప్పిన సుగుణాలన్నీ దక్కుతాయి. జీర్ణశక్తి బలంగా లేని కొందరికి కాబేజీ గ్యాసుని, విరేచనాలను కలిగించవచ్చు. రక్తాన్ని గడ్డ కట్టించే కె విటమిన్‌తో దీని విరోధం ఏర్పడవచ్చు. థైరాయిడ్ లోపం ఉన్నవారిక్కూడా ఇది కొంత అపకారం చేయవచ్చు. అలాంటప్పుడు కాబేజీని పరిమితంగా తీసుకోవటం మంచిది.
గోరింటాకులతో చాయ్, చారు
గోరింటాకుల్ని రుబ్బి అరికాళ్లకు, అరిచేతులకూ పెట్టుకుంటే ఎర్రగా పండుతాయి. ఈ ఒక్క ప్రయోజనమే ప్రజలకు తెలుసు. గోరింటాకును పెట్టుకుంటే స్పర్శామాత్రంగానే శరీరంలోని వేడిని, అరికాళ్లు అరిచేతుల్లో మంటల్నీ, వాతపు నొప్పుల్నీ, వాపుల్ని కూడా తగ్గించే గుణం వీటికుంది. ఈ ఆకుల్ని కూర పప్పు పచ్చడి వగైరా వండుకోవటానికి అనుకూలంగా ఉండవు. ఆకుల్ని ఎండబెట్టి గ్రీన్ టీ మాదిరిగా రోజూ రెండు లేక మూడు కప్పుల టీ త్రాగుతుంటే వేడి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. కడుపులో పైత్యం (ఎసిడిటీ) తగ్గుతుంది. కడుపులో నులిపురుగులు తగ్గుతాయి. బొల్లి, ఎగ్జీమా లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు గోరింటాకు గ్రీన్ టీని ప్రతిరోజూ త్రాగుతుంటే వ్యాధిలో మార్పు త్వరగా వస్తుంది. ఎలెర్జీ వ్యాధులు ముఖ్యంగా ఉబ్బసం, ఇతర చర్మ వ్యాధులున్న వారికి ఇది దివ్యౌషధమే! కోరింత దగ్గు వచ్చిన పిల్లలకు ఇతర ఔషధాలతోపాటు గోరింటాకు గ్రీన్ చాయ్ త్రాగించవచ్చు. దీని పచ్చి ఆకుని రసం తీసి అందులో రసం పొడి చేసి తాలింపు పెట్టి కమ్మని చారు కాచుకుని తాగవచ్చు కూడా! ఎలెర్జీ ఉన్న వ్యక్తులకు ఇది ఎలర్జీ తీవ్రతను తగ్గిస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. జుత్తు పెరిగేందుకు, మృదువుగా ఉండేందుకూ సహకరిస్తుంది.
చక్రవర్తి కూరతో పప్పు, కూర, పచ్చడి
చక్రవర్తి మొక్క పొలంగట్ల మీద, నీటి కుంటలున్న చోట, పాడుబడిన ఇళ్ల పెరళ్లలోనూ, మైదానాల్లోనూ పెరిగే మొక్క. దీన్ని ఇంగ్లీషులో జ్దీజఆళ ద్య్యిఒళ చ్య్యిఆ మొక్క అని పిలుస్తారు. బాతు పాదం ఆకారంలో దీని ఆకులు తొడిమ వైపు గుండ్రంగా, వెడల్పుగా ఉండి, లోపలికి నొక్కుకుని ముందు వైపు సన్నగా పొడవుగా ఉంటాయి. అందుకని ఆ పేరు వచ్చింది.
ళ్దళశ్యఔ్యజూజఖౄ ఘఇఖౄ దీని వృక్ష నామం. దీనికి తెలుగులో పప్పుకూర అని, తమిళంలో పరప్పు కిరై అనీ పేరు. ఇప్పటి రోజుల్లో పాలకూరని వండుకున్నట్టే ఒకప్పుడు చక్రవర్తి కూరని కూడా బాగా వండుకునేవారని దీని పేరుని బట్టి తెలుస్తోంది. సంస్కృతంలో వాస్తుక, చక్రవాస్తుక అనే పేర్లు తెలుగు, కన్నడ భాషల్లో చక్రవర్తి కూర అనే పేరుకు కారణం. ఇది అజీర్తిని పోగొట్టే మహత్తర ఔషధం. ఆహార జీర్ణం కాక కలిగే అన్ని ఇబ్బందులనూ ఇది నివారిస్తుంది. ఆహార పదార్థాల్లో విష దోషాలను పోగొడుతుంది. కడుపులో నులిపురుగుల్ని చంపుతుంది. అమీబియాసిస్ వ్యాధి ఉన్న వ్యక్తులు దీన్ని తరచూ వండుకుని తింటూ ఉంటే వ్యాధి త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వ్యాధిపైన ఇది బాగా పని చేస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. చర్మవ్యాధుల్లో కూడా మేలు చేస్తుంది. మొలలు, ఇతర మలద్వారానికి సంబంధించిన వ్యాధుల్లో ఇది బాగా పని చేస్తుంది. పాలకూర చలవ చేస్తుంది. కానీ, చక్రవర్తి కూర కొద్దిగా వేడి చేస్తుంది. అందుకని ఎక్కువగా మసాలాలు, చింతపండు వగైరా కలపకుండా, పాలకూర లాంటి చలవ చేసే ఆకుకూరలతో కలిపి వండుకుంటే మంచిది.
చేమంతి ఆకుల చాయ్
చేమంతి ఆకులు కడుపులోకి తీసుకోదగినవే! మొలలు, ఇతర మూల వ్యాధులు, గడ్డలు, ఉబ్బు వ్యాధులు తగ్గటానికి ఈ ఆకులు తోడ్పడతాయి. చేమంతి ఆకుల్ని ఎండబెట్టి పైపైన దంచి, సమానంగా టీ పొడి కలిపి ప్రతిరోజూ గ్రీన్ టీ కాచుకుని త్రాగవచ్చు. రుచి కోసం అల్లం, పుదీనా లాంటివి కూడా చేర్చుకోవచ్చు. కడుపులో నులిపురుగుల్ని పోగొడతాయి. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. లేత చేమంతి ఆకుల్ని సన్నగా తరిగి పులుసు కూరగా చేసుకుంటారు కూడా!

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com