మీకు మీరే డాక్టర్

క్యాన్సర్ నివారణకు పెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం వల్ల అవి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. ఆకుకూరలు, కాయగూరలు, పూల కూరలు కోమలంగా ఉంటాయి. వాటికి సరిపడినంత వేడి మీదే ఉండాలి. క్యాబేజీ అనేది లేత ఆకుల పొత్తి. చాలా కోమలమైనది. కుక్కర్లో పెట్టి వండితే అది కేన్సర్‌ను తెచ్చిపెట్టే విష పదార్థంగా మారిపోతుంది. ఇలాగే సలసల కాగే నూనెలో కూరముక్కలు వేసి, నరక లోకంలో పాపుల్ని వేయించినట్టు వేయించి, కూరముక్కల్ని వేధించి, బెండకాయ బొగ్గులు, వంకాయ బొగ్గుల మీద ఉప్పూ కారం చల్లి ఇదే కూర అని తినేవారికి కూరగాయలు అపకారం చేస్తాయి. ఆ కూరగాయనిబట్టి ఎంత వేడి అవసరమో అంత వేడి మీదే జాగ్రత్తగా వండుకుని తినేవారికి కూరల వలన ప్రీబయటిక్ ప్రయోజనాలు వొంటబడతాయి.
"Yogurt or fiber with reduced risks of various diseases including metabolic disorders, cardiovascular diseases, gastrointestinal cancers, and premature death'. ఫెరుగు, ఆహార పీచు ఇవి రెండూ అనేక మెటబాలిక్ వ్యాధులను ముఖ్యంగా గుండెజబ్బులు, పేగు కేన్సర్, చిన్న వయసులోనే మరణానికి దారితీసే అనేక పరిస్థితుల్ని నివారిస్తాయి - అని పరిశోధకులు సూచిస్తున్నారు.
పేగుల్లో ఉండే ఉపయోగకారక బాక్టీరియా ఉత్పత్తి చేసే జీవ రసాయనాలు (మెటబొలైట్స్) ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడకుండా కాపాడతాయని, తద్వారా ఊపిరితిత్తుల కేన్సర్ రాకుండా సంరక్షిస్తాయనీ, కూరల్లో ఉండే ఆహార పీచు పదార్థాలు ఊపిరితిత్తుల్ని శక్తిమంతం చేస్తాయనీ(dietary fiber intake to prevent lung cancer) ‘ఫేగుల ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం’ అనే అంశం మీద ప్రత్యేకంగా జరిగిన పరిశోధనలో నిర్ధారిస్తూ అందించిన ఒక నివేదికను మెడికల్ న్యూస్ టుడే వెబ్ పత్రిక 29 అక్టోబర్ 2019 సంచికలో ప్రచురించారు. పీచు పదార్థాలు, పెరగు పదార్థాలు ఊపిరితిత్తుల కేన్సర్‌ని నిరోధిస్తాయనేది ఈ పరిశోధన సారాంశం.
అమెరికా, యూరప్, ఆసియా దేశాలలో 1.44 మిలియన్ల ప్రజల మీద చేసిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. పెరుగు పదార్థాలనీ, పీచు పదార్థాలనీ తగినంతగా తీసుకునే వారికి ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదం 15-20 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధన సూచిస్తోంది. కేన్సర్ అనేక కారణాల వలన వస్తుంది. పీచు, పెరుగు ఈ వ్యాధి ప్రమాదాన్ని 20% నివారిస్తోందని దీని భావం. ఇది గుండె జబ్బులు, బీపీ, షుగరు లాంటి వ్యాధుల నివారణకు అదనంగా కలుగుతోన్న ప్రయోజనం.
భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తప్పకుండా ఉండేలా చూసుకోండి. అదనంగా కూరముక్కలు కలిపి తయారుచేసిన పెరుగు పచ్చడిని కూడా ఒక ఆధరవుగా పెట్టుకోండి. కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినగలిగేలా వండే విధానాలు మార్చుకోండి. మసాలాలు, చింతపండు వీటిని సాధ్యమైనంత తగ్గించి వంటకాలు తయారుచేసుకోండి. ప్రొద్దున్నపూట టిఫిన్లకు బదులుగా కూరముక్కలు చేర్చిన పెరుగు పచ్చడితో అన్నం తింటే సగం అనారోగ్యం దూరం అయినట్టే! షుగరు వ్యాధి ఉన్నవారికీ ఇది చెప్పదగిన సూచనే!
ప్రీబయటిక్, ప్రోబయటిక్ గుణాలను మనం ఆహారం ద్వారానే పొందగలుగుతాం. ప్రతీదీ డబ్బులు పారేసి మందులు కొనుక్కుని వాడేద్దాం అని చూడకూడదు. పెరుగు పీచు లేని భోజనం ఎంత ఖరీదైనది అయినా సంపూర్ణ భోజనం కాజాలదు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com