సంజీవని

ఆహార సంస్కృతి - ఆరోగ్యం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: మన పూర్వులు తిన్న వంటకాలకూ ఇప్పుడు మనం తింటున్న వంటకాలకూ చాలా తేడా ఉంది. ఏది సరైనదో వివరిస్తారా?
-జె.డి.ప్రసాదరావు, గన్నవరం
జ: మన పూర్వులు ఆరోగ్యదాయకంగా తిన్న ఆహార పదార్థాలన్నీ మన ఆహార సంస్కృతికి సంబంధించిన విషయాలు. మన ఆహార సంస్కృతి మన దేశీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందుతుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. మన సంస్కృతే మనల్ని నడిపిస్తోంది.
సంస్కృతి గురించి మాట్లాడటాన్ని మతవ్ఢ్యౌంగా భావించే రోజులు పోయాయి. మనిషి జీవితాన్ని నాణ్యమైన రీతిలో నడిపించేది సంస్కృతి అనే కొత్త నిర్వచనం ఇపుడు శాస్తవ్రేత్తల మస్తిష్కంలో అనేక కొత్త ఆలోచనలకు కారణం అవుతోంది. ప్రపంచ సంస్కృతులను ధ్వంసం చేయటమే ధ్యేయంగా ప్రపంచ వ్యవహారాలు నడుపుతున్న అమెరికాలోనే ప్రాచీనమైన ప్రతి జాతికీ ఒక సంస్కృతి ఉంటుందనీ, దానికి అనుగుణంగా నడుచుకోవటం ఆరోగ్యకరమనే ఆలోచననలు మొదలయ్యాయి. ఈ ఆలోచనలను చేస్తోంది సామాజిక వేత్తలో సాహితీవేత్తలో కాదు, సాక్షాత్తూ వైద్య శాస్తవ్రేత్తలు
ప్రతి వ్యక్తీ తన జాతీయతను, జాతీయ సంస్కృతిని తెలుసుకుని దాన్ని పాటించేలా నిస్సందేహంగా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల చేసిన ఒక పరిశోధనలో తేలింది. పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ పత్రిక తాజా సంచిక (10 ఆగస్టు 2016)లో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. ‘‘అమెరికాలో కూడా ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని గౌరవించే వారి ఆహారంలో పళ్ళు, కూరగాయలు, చిట్టు-తవుడు తియ్యని ధాన్యాలు, సంతృప్త కొవ్వు పదార్థాలు, తేలికపాటి మాంసకృత్తులు, గుడ్లు వగైరా ప్రధానంగా ఉంటాయి’’ అని ఈ పరిశోధనలో వెల్లడైంది.
సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సంస్థ అమెరికన్ సామాజిక వ్యవస్థమీద ఈ అధ్యయనం చేసింది. ఆహారం మీద అదుపు లేకపోవటమే స్థూలకాయం, బీపీ, షుగరు వ్యాధులు వెల్లువెత్తుతున్నాయని, సంస్కృతి ఈ అదుపునే కాదు, మార్గదర్శకత్వాన్ని కూడా ఇస్తోందని ఈ నివేదిక చెప్తోంది. అమెరికా లాంటి అత్యాధునిక నాగరిక దేశంలో 14-18 శాతం మంది మాత్రమే పళ్ళు, కూరగాయలతో కూడిన ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఈ నివేదిక చెప్తోంది. అమెరికన్ సంస్కృతిని తెలుసుకుని పాటించగలిగితే గానీ ఆరోగ్యదాయక ఆహారం సాధ్యంకాదు’’ అనేది ఈ నివేదిక సారాంశం. ఇండియన్లు, జపానీయులు తమ సంస్కృతిని ప్రేమిస్తారనీ, సంస్కృతికి తగ్గ ఆహారాన్ని సేవిస్తారని కూడా ఈ నివేదిక చెప్తోంది. అమెరికన్ సంస్కృతిలో ఇష్టారాజ్యంగా తినే అవకాశం ఉండటమే ఈ అపకారానికి కారణం. ‘నిశ ఆ్దళ శ్రీ.డ., ద్ఘ్పజశ ష్ద్యజషళ ఘశజూ ష్యశఆ్య ఘశజూ ఇళజశ జశజూళఔళశజూళశఆ ఘూళ పళూక జౄఔ్యఆ్ఘశఆ’’ అని ఈ నివేధిక తేల్చింది.
ఇండిపెండెన్స్ (వ్యక్తిగత స్వేచ్ఛ) కన్నా ఇంటర్ డిపెండెన్స్ (అందరూ కలిసి ఒకరికోసం ఒకరుగా బతకడం) అనేది జపానీ వ్యవస్థలో కనిపిస్తుంది. కుటుంబంలో అందరూ సమానంగా పంచుకుని తినేప్పుడు ఆరోగ్యదాయకమైన అంశాలకు ప్రాధాన్యత సహజంగా ఉంటుంది. సామాజిక బంధం, మానవ సంబంధాలనేవి కోల్పోయిన వ్యవస్థ ఆరోగ్యదాయకమైన అంశాలన్నీ కోల్పోవటమే జరుగుతుందనే హెచ్చరిక కూడా ఈ నివేదికలో ఉంది.
ఇదంతా వాస్తవంలోకి రావాలంటే వ్యక్తుల్లో సాంస్కృతిక స్పృహ (కల్చరల్ ఫిట్) ఉండాలి. సంస్కృతి అంటే మత ఛాందసం కాదు. సంస్కృతి అంటే నాణ్యమైన జీవన విధానం. మనిషి నడవడిని అతను జన్మించిన సంస్కృతి ప్రభావితం చేస్తుంది. అది ఆరోగ్యదాయకమైన జీవన విధానాన్ని ప్రేరేపిస్తుంది. ఆరోగ్యదాయకమైన ఆహారం, ఆరోగ్యదాయకమైన ప్రవర్తనలను సంస్కృతి అందిస్తుంది. సాంప్రదాయకమైన సంగీతం, సాహిత్యం, నాట్యం వగైరా జీవ భౌతిక పరమైనవి (బయలాజికల్) కావు. సంస్కృతి పరంగా సంక్రమించే విద్యలు కళలు. అవి పరారుూకరణం చెందకుండా దేశీయంగా వర్ధిల్లినపుడు సమాజ ఆరోగ్యం కూడా వర్థిల్లుతుంది.
ఈ సిద్ధాంతానుసారం తెలుగువారి వరకూ ఆలోచిస్తే, మన ఆహారంలో మన సంస్కృతిని కాదని, పరాయి సంస్కృతిని తెచ్చిపెట్టుకున్న అనారోగ్యకరమైన అంశాలు చాలా ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.
1. మనది వౌలికంగా ముప్పొద్దుల భోజన సంస్కృతి. కానీ, మనం ఉదయంపూట మెతుకు తగలకూడదనే సిద్ధాంతాన్ని ఎరువు తెచ్చుకున్నాం. ఎపుడో పండగకో, పబ్బానికో ఒకసారి సరదాగా తినవలసిన పిండివంటలను రోజూ అల్పాహారం అనే భ్రమలో కావాలని తింటున్నాం. ఇది మన సంస్కృతికి వ్యతిరేకమైన అనారోగ్యదాయకమైన అంశం. పోతనగారు బాలకృష్ణుడు గోపబాలురతో గుండ్రంగా పద్మాకారంలో కూర్చుని తిన్నది పెరుగన్నమే కానీ, రెండిడ్లీ సాంబారు కాదు! చలిదనం అంటే పెరుగన్నం. నిన్నటి పాచిపోయిన అన్నం అనేది దుర్మార్గమైన అర్థం. ఉదయానే్న పెరుగన్నం లేదా చల్ల అన్నం తినటం మన సంస్కృతి.
2.మన వంటింట్లోకి మిరపకాయలు 15-16 శతాబ్దాల కాలంలో ప్రవేశించాయి. అంతవరకూ కారానికి వాడకున్న మిరియాలు వగైరా తెలుగు నేలనుంచి పూర్తిగా నిష్క్రమించాయి. మిరపకాయల రాకతో వంటింట్లోకి చింతపండు కూడా ప్రవేశించింది. అల్లం వెల్లుల్లి అతి వాడకానికి ఈ మిరపకాయలు చింతపండు దోహదపడ్డాయి. దాంతో గత 2, 3 వందల ఏళ్ళ కాలంలో మన వంటకాలు మన సంస్కృతి కట్టును దాటిపోయాయి. ఇప్పటితరం ఇదే మన సంస్కృతి అనే భ్రమలో జీవిస్తున్నారు.
3.చైనా నూడుల్సు, ఇటాలియన్ పిజ్జాలు ఇతర జంకు ఆహారాలంటే యువతరంలో వ్యామోహం ఎక్కువైంది. పెద్దలు కూడా పిల్లల్ని పిజ్జా సంస్కృతిలోంచి బయటకు తేలేకపోతున్నారు. అలాగని పెద్దలు ఇంట్లో వండుతున్న బజ్జీలు, పునుగులు, పూరీలు వగైరా కూడా ఈ జంకు ఆహార పదార్థాలేననే సంగతి మరిచిపోతున్నాం.
4.ఏం తిన్నా తప్పేనా? అనే ప్రశ్నకు సమాధానం ఉంది. మన పూర్వులు బట్టర్‌నాన్లు, బర్గర్లు తిన్నారు. 14వ శతాబ్ది నాటి శ్రీనాథుడు ఉదహరించిన వంటకాల పట్టికలో ఇప్పటి నార్తిండియన్ ఫుడ్ ఐటెంలు అన్నీ ఉన్నాయి. కానీ వాటిని రోజూ తినలేదు. పండగలప్పుడు, వివాహాది శుభకార్యాలప్పుడు మాత్రమే తిన్నారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించకపోతే సంస్కృతికి అపచారం చేయటమే అవుతుంది. అది మనకు మనమే అపకారం చేసుకోవటం కిందకు వస్తుంది.
5.సంస్కృతిని అర్థం చేసుకోవటం అవసరం. ఉగాది పచ్చడి తినటం మత ఛాందసం అనేవాడు మూర్ఖిష్టే అవుతాడు.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com