మీకు తెలుసా ?

కోతుల జాతిలో ఇవే అతిపెద్దవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఈ పాత తరం కోతులు చాలా ఆకర్షణీయమైన రంగులతో ఉంటాయి. కోతుల జాతిలో ఇవే అతిపెద్దవి. దాదాపు 32 అంగుళాల ఎత్తు పెరిగే వీటి ముఖం, పృష్ట్భాగం అందమైన ముదురువర్ణాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ రంగులు ఎంత ప్రస్ఫుటంగా ఉంటే అవి జతకట్టే వయసుకు వచ్చాయని అర్థం. ఎరుపు, నీలం రంగులతో ముఖంపై చారలు, ఒతె్తైన ఆలివ్‌గ్రీన్ మెరుపుతోకూడిన బొచ్చుతో ఇవి అందంగా ఉంటాయి. భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఈ రంగుల తీక్షణత పెరుగుతూంటుంది. పసుపువర్ణంతో ఉండే గెడ్డం వీటికి ప్రత్యేక ఆకర్షణ. వీటి కోరపళ్లు మిగతా కోతులతో పోలిస్తే చాలా పెద్దవిగా ఉంటాయి. దాదాపు మూడున్నర అంగుళాల మేరకు ఉండే వాటిని కేవలం ఆత్మరక్షణ కోసమే ఉపయోగిస్తాయి. తమ కుటుంబంలోని మిగతా సభ్యులను ఆనందంగా పలకరించేందుకు ఈ పళ్లను బయటకు పెట్టి నోటిని బార్లా తెరుస్తుంటాయి. క్షీరదాల్లో ఇవే అందమైనవిగా చెబుతారు.