మీకు తెలుసా ?

వీటి చెవులు అతి పొడవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లిజాతిలో అతిపెద్ద చెవులు, పొడవైన వెనుకకాళ్లు ఉన్న జాతికి చెందిన పిల్లి...సెర్వల్ క్యాట్. శరీర పరిమాణాన్ని బట్టి అతిపొడవైన చెవులు, కాళ్లు ఉన్న పిల్లి జాతి ఇది మాత్రమే. వీటికి శబ్దాన్ని గ్రహించే శక్తి చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే రాడార్‌ల మాదిరిగా వీటి చెవులు పనిచేస్తాయి. భూగర్భంలోని సొరంగాల్లో సంచరించే శత్రువుకదలికలను, ఆహారాన్ని పసిగట్టగలిగే గ్రాహకశక్తి వీటికి ఉంది. చిరుత తరువాత అతివేగంగా పరిగెట్టగలిగే పిల్లికూడా ఇదే. వేటలో కూడా దీనికి ఇదే సాటి. దక్షిణ, మధ్య ఆఫ్రికాలో కన్పించే ఇవి, క్యాట్ ఫ్యామిలీలో (సింహం, పులిసహా) మిగతావాటికన్నా వీటి వేట సామర్థ్యం చాలాఎక్కువ. మిగతావి వేటాడటంలో 5 నుంచి 10శాతం విజయాలే సాధిస్తే ఇది కనీసం 50శాతం విజయాలు సాధించగలుగుతుంది. గాలిలో ఉన్న పక్షులను సైతం ఎగిరి పట్టుకోగలగడం వీటికి తెలుసు. అన్నట్లు ఆరెంజ్ కలర్ లేదా ముదురు గ్రే కలర్ బొచ్చుపై ఉండే నల్లని మచ్చలు వీటి ప్రత్యేకత. తోక చివర నల్లని మచ్చ ఉంటుంది. ఈ మచ్చలు వేటికవే ప్రత్యేకం. మన వేలిముద్రల్లా అన్నమాట. అంటే ఏ రెండు పిల్లులకూ ఒకే రీతిలో మచ్చలుండవన్నమాట. ఇది మూడు అడుగుల పొడవుంటుంది.

ఎస్.కె.కె.రవళి