మీకు తెలుసా ?

చెట్లపై జీవించే కంగారూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్టపై సంచీ, పొట్టి చేతుల్లాంటి ముందుకాళ్లు, భారీగా ఉండే పెద్దకాళ్లతో కన్పించే కంగారూలు అందరికీ తెలిసినవే. కానీ ఒకరకం కంగారూలు చెట్లపై మాత్రమే జీవిస్తాయి. అడపాదడపా నేలపైకి వచ్చినా చెట్లపై ఉండటానికే ఇష్టపడతాయి. కాస్త ఎరుపు, జేగురు కలిసినట్లుగా, అసలు కంగారూలు, లీమర్‌ల పోలికలతో ఇవి కన్పిస్తాయి. వీటికి పొడవైన తోక ఉంటుంది. అసలు కంగారూల మాదిరిగా పొట్టపై సంచీ ఉంటుంది. చెట్లపై ఉండే ఇవి 60 అడుగుల ఎత్తునుంచి నేలపైకి దూకినా వీటికి ఏమీకాదు. దీని శరీర నిర్మాణం అలా ఉంటుంది మరి. వీటి పిల్లలు తల్లినే అంటిపెట్టుకుని ఉంటాయి. దాదాపు 18 నెలల వయసు వచ్చేవరకు అంతే. ఆస్ట్రేలియా, పపువున్యూగినియా, పపువు ప్రాంతాల్లో మాత్రమే ఇవి కన్పిస్తాయి.

ఎస్.కె.కె.రవళి