మీకు తెలుసా ?

సార్టింగ్ హాట్.. ఓ సాలె పురుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచాన్ని ఊపేసిన హారీపోటర్ కథల పరంపర చాలామందికి తెలుసు. ఇంద్రజాలం, మాయలూ మర్మాలు నేర్పే నాలుగు పాఠశాలల సముదాయం హాగ్‌వర్ట్. దీనిని కనిపెట్టిన వారిలో గోద్రిక్ గ్రైఫిండొర్ ఒకరు. మనదేశంలో ఈ మధ్యే కనిపెట్టిన ఓ సాలెపురుగుకు హారీ పోటర్ నవలల్లో అందర్నీ ఆకట్టుకునే సార్టింగ్ హాట్ పోలికలున్నాయి. అందుకే ఆ నవలల్లో కీలకమైన గ్రైఫిండొర్ పేరును ఈ సాలెపురుగుకు పెట్టారు. హాగ్‌వర్ట్‌లోని నాలుగు స్కూళ్లలో ప్రవేశం కోరే విద్యార్థులను పరీక్షించి, మాట్లాడి ఏ స్కూలుకు ఎవరు పనికివస్తారో తేల్చిచెప్పే బాధ్యతలు నిర్వహించే పని ఓ టోపీ చేస్తుంది. దానిని సార్టింగ్ హాట్ అని పిలుస్తారు. అది గ్రైఫిండోర్ సొంతం. ఆ టోపీ మాదిరిగా కనిపిస్తుండటంతో ఆ కొత్త జాతి సాలెపురుగులకు ‘ఎరియోవిక్సియా గ్రైఫిండొర్’ అన్న పేరు పెట్టినట్లు పరిశోధకులు జావెద్ అహ్మద్, రాజశ్రీకలప్, సముఖ జవగళ్ పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఈ శాస్తవ్రేత్తలు కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో రెండేళ్లుగా పరిశోధనలు చేస్తూ వీటిని కనిపెట్టారు. హారీపోటర్ నవలల్లో సార్టింగ్ హాట్, గ్రైఫిండోర్ పాత్రలు జనాదరణ పొందాయి. ఈ కొత్తసాలెపురుగు ప్రపంచానికి తొందరగా తెలియాలంటే ఆ పేరు పెడితే బాగుంటుందనుకున్నామని వారు చెప్పారు. హారీపోటర్ నవలా రచయిత్రి జె.కె.రౌలింగ్ అయితే తన రచనల్లోని పాత్ర పేరు ఓ జీవికి పెట్టడాన్ని అభినందించారు కూడా.

- ఎస్.కె.కె. రవళి