రాష్ట్రీయం

కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్సీ ఎన్నికలే అజెండా డిసిసి అధ్యక్షులతో చర్చించి తుది నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 3: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరిని పోటీ చేయించాలనే విషయంలో జిల్లా సీనియర్ నేతలు, డిసిసి అధ్యక్షులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, సిఎల్‌పి నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సమన్వయ కమిటీ సభ్యులు, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మండ్రి గీతారెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంశాలపై మాత్రమే చర్చించామని, పూర్తిగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సభ్యుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు జిల్లా అధ్యక్షులతోను, సీనియర్ నేతలతో చర్చలు జరపాలని నిర్ణయించామన్నారు. అలాగే ముఖ్య నేతలతో సంప్రదించి మరోసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి, జిహెచ్‌ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా తాను పార్టీలోనే కొనసాగుతానని, పార్టీలో అనేక అంశాలపై ఇతర నేతలతో అభిప్రాయబేధాలు ఉన్న మాట నిజమేనన్నారు. ఇవన్నీ ప్రతి ప్రజాస్వామ్య పార్టీలో ఉంటాయన్నారు. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు
అయుత చండీయాగం నిర్వహణ పట్ల అభినందన
హైదరాబాద్, డిసెంబర్ 3: అయుత చండీయాగం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును శృంగేరి పిఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి అభినందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తూ శృంగేరి పిఠాధిపతి లేఖ రాశారు. శరన్నవరాత్రి సందర్భంలో సకల శ్రేయోప్రదమైన చండీపారాయణం చేసి దుర్గమాత ఆరాధించడం సనాతన సంప్రదాయమని శృంగేరి పిఠాధిపతి తన లేఖలో పేర్కొన్నారు. ఇంతటి మహిమగల దుర్గాసప్తశతిని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలుసుకొని చండీయాగాన్ని నిర్వహించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని శృంగేరి పిఠాధిపతి పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో చండీపారాయాణాన్ని నిర్వహించి జగన్మాత పరిపూర్ణానుగ్రహం పొందాలని భారతీ తీర్థ మహాస్వామి తన లేఖలో ఆశీర్వదించారు.

‘ఐఫా’ వేడుకలు వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 3: శుక్రవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఐఫా అవార్డుల వేడుకలను వాయిదా వేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. చెన్నై నగరంతోపాటు తమిళనాడులో చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల వందలాది మంది మరణించడంతోపాటు జనజీవనం స్తంభించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఐఫా వేడుకలను వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.

లెవెల్ క్రాసింగ్‌లన్నీ పూర్తిచేస్తాం

వేగవంతంగా పెద్దపల్లి-నిజామాబాద్ పనులు
నిధుల కేటాయింపునకు అనుగుణంగా పనులు వేగిరం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా

రామగుండం, డిసెంబర్ 3: ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించేందుకే పెండింగ్‌లో ఉన్న లెవెల్ క్రాసింగ్ లన్నింటినీ పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌ను గురువారం సాయంత్రం సందర్శించిన సందర్భంగా ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే ట్రాక్‌లైన్ నిర్మాణం పనులు దాదాపుగా పుర్తి కావచ్చాయని చెప్పారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ల పనులకు సంబంధించి భూ సేకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. రామగుండం - మణుగూర్ ట్రాక్‌లైన్ పనులకు సంబంధించి సర్వే కొనసాగుతున్నాయని, కేంద్ర రైల్వే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాల ఏర్పాటు తో పాటు వారి భద్రత విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ మాట్లాడుతూ కొత్త రైల్వే నిర్మాణం పనులకు సంబంధించి మరింత వేగవంతంగా పనులు జరిగేందుకు ఈసారి కేంద్రం నుండి బడ్జెట్‌లో ఎక్కువ మొత్తంలో నిఋలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.