శ్రీ మేఘ స్టూడియో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలో పలువురు దర్శక నిర్మాతలతో పరిచయాలు వున్న సాంకేతిక నిపుణుడు వి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎడిటింగ్, గ్రాఫిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో సకల సౌకర్యాలు ఉన్న ‘శ్రీ మేఘ స్టూడియో’ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావుమాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎడిటింగ్, గ్రాఫిక్స్‌లను అనుసంధానం చేస్తూ ఈ స్టూడియో రూపుదిద్దుకుందని, ఎంతో చరిత్ర వున్న తెలుగు చిత్ర పరిశ్రమలో అనుభవం వున్న తాను ఈ ఆధునిక హంగులతో స్టూడియోని ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుత స్టూడియోలో ‘వాడు వీడు ఓ కల్పన’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నామని, అందరికీ అందుబాటులో వుండేలా ఈ స్టూడియోను తీర్చిదిద్దుతున్నామని, అభివృద్ధి పధంలో సాగాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. కార్యక్రమంలో సుమన్, శివ, మేఘశ్రీ, సతీష్ కొండ్రెడ్డి, నవీన్‌యాదవ్, పద్మిని, మహికె మహేష్ తదితరులు పాల్గొన్నారు.