శ్రీకాకుళం

విద్యాప్రమాణాల మెరుగుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, డిసెంబర్ 22: పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేం దుకు కృషి చేయాలని ఎంఇవో మురళీకృష్ణ కోరారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులను ఎంఇవో ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుషోత్తం, వెంకటరమణ, ఉమాశంకర్, కవిరాజు, వెంకటరమణ, సిద్థార్థలను ఈదుపురం పాఠశాలలో మంగళవారం సన్మానించారు. హెచ్‌ఎం భాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థులను మరింత ప్రావీణ్యులు కావడానికి కృషి చేయాలన్నారు.

గంగమ్మపేట ఆశ్రమ పాఠశాలకు టెన్త్ పరీక్షా కేంద్రం
వీరఘట్టం, డిసెంబర్ 22: మండలం కత్తులకవిటి పంచాయతీ గంగమ్మపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని ఐటిడిఎ పివో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. మంగళవారం పివో ఆ పాఠశాలను సందర్శించి మధ్యాహ్నభోజన పథకాన్ని పరిశీలించారు. అలాగే పాఠశాలకు రూ.2లక్షలు విలువైన ఆర్వో ప్లాంటు మంజూరైనట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హుస్సేనపురం పంచాయతీ పరిధి సందిమానుగూడ గిరిజన గ్రామంలో రూ.8.50 లక్షలు వ్యయంతో చేపట్టిన చెరువు పనులను పరిశీలించారు. అలాగే ఇలిసిపురం వద్ద బొండిగెడ్డ చెరువు అభివృద్ధికి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ చెరువు నుంచి మంగచెరువులోకి మిగులు జలాలు వెళ్లడానికి 420 మీటర్లు కాలువ ఏర్పాటుతో మరో 50 ఎకరాలు అధనంగా సాగునీరు అందుతుందని ఇంజనీరింగ్ అధికారులు పివోకు వివరించారు. ఈయన వెంట సీతంపేట ఎస్‌ఎంఐ ఇ ఇ కె.వి రమణ, డి ఇ ఇ ఉషారాణి, ఎఇ నగేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

ఈ ఏడాది లెవీ లక్ష్యం 5లక్షల మెట్రిక్ టన్నులు
ఆమదాలవలస, డిసెంబర్ 22: ఈ ఏడాది లెవీ సీజన్‌లో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లెవీకి సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మార్కెట్ కమిటి ఆవరణంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ వరి దిగుబడి జిల్లా ఆశాజనకంగానే ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది లెవీ సేకరణ పెంచినట్టు ఆయన తెలిపారు. ధాన్యం మద్దతు ధర కల్పించి విక్రయాల్లో రవాణా సౌకర్యం కూడా ప్రభుత్వ భరిస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో 109 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిపై సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం చేయకపోవడం వల్ల ఈ కేంద్రాలు వెలవెలబోతున్నాయని ఆయన అసంతృప్తివ్యక్తంచేస్తూ ఇక్కడి ఏపివో సుశీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాళారీలు రైతులను మోసం చేయకుండా మద్ధతు ధర కల్పించి సరైన తూకవావేసి రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు.

గుణపాఠం!
నరసన్నపేట, డిసెంబర్ 22: రాజ్యాంగాన్ని అనుసరించి భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చిందని, అయితే నేటి తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఖూనీ చేస్తోందని, వైసిపి జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేని శాసన సభ ఏడాది పాటు ఎన్నడూ లేని విధంగా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. మహిళల అభివృద్ధికి దోహదపడతామన్న టిడిపి ప్రభుత్వం మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇటీవల అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం, పెంచిన జీతాలు చెల్లించాలంటూ ధర్నాలు నిర్వహిస్తే వారిపై పోలీసులు దాడి చేయడం విచారకరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను తుంగలోకి తొక్కుతున్న ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నిలచెట్టకుండా మాటలతోనే కోటలు దాటుతుందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. బెల్ట్‌షాపులు ఎత్తివేస్తామని, మహిళా సంఘాల రుణాలుమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటి నెరవేర్చలేకపోయారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం సరైన పాలన అందించాలని లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్, కరిమి రాజేశ్వరరావు, మురళీధర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.