విశాఖపట్నం

ప్రగతితో ప్రయాణిస్తాను! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయకాహళులు మిన్నుముట్టి
విజయలక్ష్మి నన్ను వరించిన నాడు
అసూయా దృక్కులు
కాటేయ చూస్తే
ఆనందంగా భరిస్తాను!
విశ్వమంతా నిండిన జ్యోత్స్నలా
యశస్సు ధరణి నిండిన నాడు
నిశీధి నన్ను చుట్టేసేలా చూస్తే
రవిలా, ప్రధభల తరిమేస్తాను.
ఆమనిని ఎరబూయు తరవులా
ఫలములు, తేనెలు పంచునపుడు
ప్రళయ ఝంఝూమారుతం వీచితే
ఇలపైని బలంగా, నిలదొక్కుకుంటాను.
నా రచనలతో సమాజాన్ని
ప్రగతి పథాన, నడిపిస్తాను
నా కవితలతో కవిత్వాన్ని
నవతరానికి మళ్లిస్తాను
ప్రగతితో ప్రయాణిస్తాను!

- పురిజాల సుధాకర్,
నరసన్నపేట, శ్రీకాకుళం-532421
ఫోన్: 7702956929.
***

మార్గాలు

పరమ పురుషుడ్ని
భక్తి మార్గం ద్వారా
చేరుకోవాలి
పరపురుష సంపద
మర్గానే్వషణలు
మానుకోవాలి!
ప్రకటిత మోసం
వ్యాపార ప్రకటనల్లోని
ఊరించే
ఆల్ ఫ్రీ ప్రకటన
తాటికాయ అక్షరాలు
కనిపించినట్టు
షరతులు చిన్నక్షరాల
సూక్ష్మక్రిములు కనిపించవు

- మాధవీ సనారా, అనకాపల్లి
సెల్ : 9440103134.
***

సాధనా ఫలం

వైకల్యం వెక్కిరించింది.. ఓటమి వాటేసుకుంది
వెకిలినవ్వులు, వెక్కిరింతలు వెర్రితలలు వేస్తున్నాయి
నిరాశా నిస్పృహలు నీలినీడలై కమ్మేశాయి
అశ్రువులు హృదయాంతరాల నుండి
నయనాల ద్వారా దూకేస్తున్నాయి
ఆకాశం తన బాహువులను చాచి పిలుస్తోంది
అయినా... విజయం సాధించాలనే కాంక్ష కరిగిపోలేదు
తపన తరిగిపోలేదు
చంద్రుడు అస్తమించినా నయనాలు విశ్రాంతి కోరడంలేదు
విజయవాంఛ విత్తు నాటింది
ధైర్యం నీరు పోసింది ఆశ చిగురించింది
కృషి ఫలించింది విజయం సొంతమయింది
వెకిలినవ్వులు, వెక్కిరింతలు
అభినందనలుగా మారాయి
అశ్రువులు ఆనందబాష్పాలయ్యాయి
దృఢసంకల్పం ముందు వైకల్యం వీగిపోయింది

- గొట్టాపు శ్రీనివాసరావు, సెల్ : 9542019064.
***

భరతమాత

ముద్దుబిడ్డలు
ఈ భారతంలో ఎందరో
ఘనకీర్తులు, వీరులు,
ధీరులు, శూరులు
కవిపుంగవులు, రత్నాలు,
మాణిక్యాలు, వజ్రాలు
ఎంత కొనియాడినా తక్కువే
త్యాగరాజ కీర్తనలు
రామదాసు భక్త్భివనలు
కృష్ణశాస్ర్తీ భావకృతులు
వేయిపడగల విశ్వనాథుడు
కవిపుంగవుడు సినారె
తెలుగు లెస్సన్న కృష్ణదేవరాయలు
శాతవాహనుల కీర్తికాంతులు
తెలుగు పౌరుషం అల్లూరి
సీస పద్య శైలి శ్రీనాథుడు
పల్నాటి బాలచంద్రుడు
శాంతధీరుడు శాతవాహనుడు
భారతమ్ము రచయిత పోతన
భువన పూజ్యుడు తిక్కన
రామకథా రచయిత్రి మొల్ల
పల్నాటి వీరవనిత నాగమ్మ
వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి
మను చరిత్రకారుడు పెద్దన
అంటరానితనం వలదన్న కందుకూరి
సమాజహితం కాంక్షించిన గురజాడ
బొబ్బిలిపులి తాండ్రపాపారాయుడు
ఖడ్గసృష్టికర్త శ్రీశ్రీ
జాతిపిత గాంధీ
దారి చూపిన నేత నెహ్రూ
తెలుగుతేజం పొట్టి శ్రీరాములు
వీరిని కన్న భరతభూమి
పుణ్యభూమి... తపోభూమి!

- జి.ఎస్.కె. సాయిబాబా,
అనకాపల్లి.
సెల్ : 9248173116.