విజయవాడ

చురకలంటని వాతలు! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
స్పృహ సాహితీ సంస్థ,
పద్మా కాలనీ, నల్లకుంట,
హైదరాబాద్.
రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో లభ్యం.
**

‘రాతలు వాతలు’ పేరు వింటే ఏదో ఒక విషయం మీద ఎవరో ఒకరికి వాతలు ఉంటాయి అని అర్థం అవుతుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా, ప్రవృత్తి రీత్యా రచనలు, జర్నలిజం, సామాజిక ఉ ద్యమకారునిగా పనిచేసే ఎన్ తిర్మల్ కలం నుండి వచ్చిన విమర్శల వ్యాసావళి రాతలు - వాతలు. ఇందులో మొత్తం 27 వ్యాసాలు ఉన్నాయి. ఇందులోని ప్రతి వ్యాసంలోనూ ఏదో ఒక విమర్శను చూపారు రచయిత. కానీ రచయిత ఎంచుకున్న అంశాలను చదువుతుంటే, చాలవాటిలో విమర్శలు కనబడక పేలవంగా ఉన్నాయి. రచయిత చెప్పదలుచుకున్నది పూర్తిస్థాయిలో చెప్పలేదని అనిపిస్తోంది. పుస్తకంలో కొన్ని వ్యాసాలు చాలా చిన్నవి రాసారు. కొన్ని వ్యాసాలు చాలా పెద్దవిగా విశదీకరించి రాశారు. చిన్న వ్యాసాలను కొంచెం విశదీకరించి వాటిలో విమర్శలు చూపి ఉంటే చాలా బాగుండేది.
చిన్నదైన ‘అందం అమ్మబడును’ అనే వ్యాసంలో ప్రపంచ సుందరి పోటీలు జరిగే పద్ధతి గురించి, విశ్వసుందరి ఆదాయం గురించి చిన్న కథా రూపంలో చెప్పారు. ఇది విమర్శనాత్మక వ్యాసమే అయినా చెప్పిన విధానం పాఠకులు ఆశించిన స్థాయిలో లేదనిపిస్తోంది. వ్యాసాన్ని సరళంగా రాసి ఉంటే బాగుండేది. ‘పిండాకూడు’ అనే వ్యాసంలో బతికుండగా కడుపుకి కూడా పెట్టని కొడుకులు, కోడళ్లు చనిపోతే కర్మకాండల పేరుతో ఎన్నో వంటలతో అందరికీ భోజనాలు పెట్టడం అన్నది మంచి సామాజిక విమర్శ. అలాగే ‘నత్తగుల్ల ప్రజాసామ్యం’ అనే వ్యాసంలో పోటా చట్టం దారితప్పటం గురించి విమర్శ బాగున్నా దీనితోపాటు అనేక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. వాటి గురించి కొంచెం విశదీకరించి ఉంటే వాతలు బాగుండేవి. ప్రజల్ని మూఢత్వం ‘మురికి’లో ముంచుతున్న పాలకులు అన్న వ్యాసం గోదావరి పుష్కరాలకు సంబంధించినది. ఇందులో పుష్కరం గురించిన కథను కట్టుకథగా అభివర్ణించారు రచయిత. ప్రజల మనోభావాలు వేరు, ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యలను వేరుగా చూడాలి. అంతేగాని రెంటినీ ఒకే గాటన కట్టి రాయటం వల్ల వ్యాసం ఉద్దేశ్యం పాఠకులకు అర్థంకాదు. ఏదిఏమైనా రచయిత తీసుకున్న అంశాలు ఎంతో విలువైనవి అయినప్పటికీ వాటిని వ్యాసాలుగా మలచటంలో, విమర్శలు గుప్పించటంలో కొంత శ్రద్ధను కనబరిచి వుంటే అద్భుతంగా ఉండేవి. మొత్తమీద ఈ పుస్తకం సమస్యలపై అవగాహన కలిగిస్తుంది.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net