దక్షిన తెలంగాణ

సామాజిక చైతన్యానికి కవిత్వం దోహదపడాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఎం. వి. నరసింహారెడ్డి
: చిరునామా :
ఎం. వి. నరసింహారెడ్డి
కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల
జగిత్యాల జిల్లా
సెల్.నం.9849110922
**
కవిత్వం సామాజిక చైతన్యానికి దోహదపడాలని ప్రముఖ వేద పరిశోధకులు సీనియర్ కవి, రచయిత ఎం.వి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. గత ఐదు దశాబ్ధాలుగా సాహిత్య సృజన చేస్తున్న రెడ్డి గారు నలుబది గ్రంథాలను వెలువరించారు. హాస్య బ్రహ్మగా భాసిల్లే ఆయన హాస్యంపై పలు గ్రంథాలు రాశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన ఆయన వృత్తిరీత్యా విద్యాశాఖలో మండల విద్యాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారాలను అందుకున్నారు. తాను స్వయంగా వందలాది కవులూ, రచయితలకు పురస్కారాలతో సత్కరించారు. ‘మెరుపు’ ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ముఖాముఖి నిర్వహించింది.

ఆ మీ నేపథ్యం చెబుతారా?
కరీంనగర్ జిల్లాలో వృత్తిరీత్యా నేను విద్యాశాఖలో మండల విద్యాధికారిగా ఉద్యోగ విరమణ చేశాను.

ఆ మీరు ఎన్నో ఏట రచనలు ప్రారంభించారు?
నా ఇరవయ్యవ ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించాను. మొట్టమొదట 20వ ఏటనే ‘ప్రేమ జీవుల ఆదర్శ త్యాగాలు’ నవల రాశాను. ఆ రోజుల్లో అది బహుళ ప్రాచుర్యం పొందింది.

ఆ మీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
నేను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పటి మా కళాశాల ప్రిన్సిపాల్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రేరణతో 1961-62 ప్రాంతంలో రచనల పట్ల ఆసక్తి కలిగింది.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
జన చైతన్యానికి దోహదపడేదే కవిత్వం అని నా అభిప్రాయం. అయితే కవిత్వం పూర్తి వచనంలో కాకుండా ప్రతీకలు, వర్ణనలు, పోలికలతో నర్మగర్భంగా రాస్తేనే అది కవిత్వమవుతుంది.

ఆవేద రచనపై మీకు అనురక్తి కలగడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
కవి జె.బాపురెడ్డి గారి ప్రోత్సాహంతో వేద పరిశోధన, వేదాల అనువాదం చేయడం ప్రారంభించాను.

ఆ బోధన, రచనా వ్యాసాంగం రెండింటిలో మీకు తృప్తినిచ్చింది ఏమిటి?
బోధకునిగా ఎంత తృప్తిపొందానో రచనా వ్యాసాంగంతోనూ అంతే తృప్తి పొందాను.

ఆ మీకు నచ్చిన కవి ఎవరు?
నాకు నచ్చిన కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి.

ఆ‘తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం’ అనే సంస్థను స్థాపించారుకదా.. దాని ద్వారా మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?
సాహిత్య సంబంధ వివిధ ప్రక్రియల్లో కొత్త కవులు, రచయితలకు శిక్షణనివ్వడానికి కార్యశాలలు నిర్వహిస్తున్నాం.. సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న కవులు, రచయితలు సుమారు మూడు వందల మందిని మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేసి పురస్కారాలతో సత్కరించాము. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాగానే.. ఓ యాభై మంది ఉత్తమ కవులు, రచయితల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి శాతవాహన విశ్వవిద్యాలయంతో కలిసి మా సంస్థ ద్వారా సాహితీ పురస్కారాలు అందజేశాము.

ఆ మీకు లభించిన పురస్కారాలేమిటి?
‘వేద పరిశోధన’పై తెలంగాణ రాష్టస్థ్రాయి పురస్కారాన్ని సిఎం చేతుల మీదుగా ప్రభుత్వం ద్వారా అందుకున్నాను. హాస్య రచనలో ‘శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి విసి గారి చేతుల మీదుగా ‘కీర్తి పురస్కారాన్ని’ పొందాను. అంతేకాకుండా బోధనా రంగంలో నా సేవలను గుర్తించి 1991 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిఎం చేతుల మీదుగా ‘ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారాన్ని రాష్టస్థ్రాయిలో పొందాను. ఇవే కాక..అనేక సంస్థల నుండి వందలాది సన్మాన సత్కారాలను అందుకున్నాను.

ఆకొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి?
కొత్తగా కలం పట్టేవారు మొదట సాహితీ ప్రక్రియల పట్ల అవగాహన పెంచుకోవాలి. అందుకోసం విస్తృత అధ్యయనం చేయాలి.

ఆ మీరు వెలువరించిన గ్రంథాల్లో మీకు నచ్చింది ఏమిటి?
నేను 40 వరకు గ్రంథాలు వివిధ ప్రక్రియల్లో వెలువరించాను. బాగా నచ్చినవి వేదాలకు సంబంధించిన అనువాద గ్రంథాలేనని చెప్పగలను.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏమి చేయాలి?
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించబడాలి. మరుగున పడ్డ సాహిత్యాన్ని ఇంతకాలం నిరాదరణకు గురైన కవులు, రచయితల్ని ప్రోత్సహించాలి. వారి రచనలు వెలుగులోకి తేవడానికి ప్రచురణ కోసం లేదా ప్రకటించిన గ్రంథాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.

ఇంటర్వ్యూ : దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
***
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net