రాజమండ్రి

దీపం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం
నిశీధిలో వికసించే వెలుగుల
చిరునవ్వుల పువ్వు
చీకటి కాలాన్ని మోస్తున్న
ప్రమిద హృదయం నిండా
తైల కాంతులు
అనుక్షణం క్షణక్షణం ఉదయం కోసం
తిమిరంతో సమరం
శూన్యంలో చురకత్తితో
గత అనుభవాల జ్ఞాపకాలతో
దీపావళి మతాబుల వెలుగుల్లో
కళ్లుపెట్టి గుడిసెలోకి చూస్తే
ఆకలి చమురులో
నిరాశల జ్యోతి వెలుగుతోంది
పేదల కలలన్నీ
కాలం అలల్లో కలిసిపోయి
కన్నీటి విషాదం
చెరగని ముద్రలా నిద్రపోతోంది
పడిలేవని కెరటం
పేదవాడి జీవితం
బాధాతప్త జీవితాలు
దీపానికి రూపాలన్నీ తెలుసు

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి: 9247577501
**

‘్ఫర్ సేల్’

సెంటు భూమి
కోటి ‘సెంట్ల’ని దాటేసింది
నీటి నిల్వలు
ప్లాస్టిక్ మూటలైపోయాయి
నివురుగప్పిన నిప్పు
అగ్గిపుల్ల తలగా మారింది
స్వచ్ఛమైన గాలి
సిలిండర్ల పాలైపోయింది
హద్దుల్లో చిక్కిన గగనం
సిషిద్ధమైపోయింది
పంచభూతాల
పంచనామా ఇది
దేవుడు ‘ఫ్రీ’గా ఇస్తే
మనిషి ‘ప్రియం’ చేసేశాడు.

- కౌలూరి ప్రసాదరావు
వేళ్లచింతలగూడెం (పోస్టు)
ప.గో.జిల్లా - 534316,
సెల్: 7382907677
**

తెలుగు భాష

ఏమని వర్ణించగలను
నా తెలుగుభాష యొక్క గొప్పతనాన్ని
అమ్మ లాలిపాటలోని మాధుర్యం
మకరందములోని తీయదనం
పాలలోని స్వచ్ఛదనం
మల్లెపూవులోని తెల్లదనం
ముత్యములు అనే మాటలతో నిండిన సముద్రం
హరివిల్లు ఎరగని మనోహర వర్ణము
పుష్పముల కన్నా మంచి సువాసనతో పరిమళించే
సముద్రము కన్నా లోతైనది
రత్నముల కన్నా అమూల్యమైనది
నా తెలుగు భాష

- డి శ్రావణి
కాకినాడ,
సెల్: 7731849060
**

నిలబడదామా

మీరు అక్షరాలను కవితగా కూర్చేవేళ
నేను దీనుల కన్నీటిని తుడవ చూస్తాను
మీరు మనసును మధించి కవిత రాసేవేళ
నేను రోగుల కన్నులలో ఆనందమై నిలుస్తాను
మీరు వేదికలపై కవితాగానం చేసే వేళ
నాలోకి నేను తొంగి చూస్తూ
నన్ను నేనే వెతుక్కుంటాను
మీరు కవులుగా భుజకీర్తులు తగిలించుకున్న వేళ
నేను మనిషిని అని దృఢంగా చెప్పుకుంటాను
సందేహం లేదు మీరు గొప్పవారు
మీరు మర్యాదస్తులు మహానుభావులు
అయ్యా! ప్రాణినైన కారణాన ఒక సందేహం
మీరు ఎప్పుడూ చెబుతూనే ఉంటారా
మీ భుజాలను మీరే చరచుకుంటారా
కాగితంపై రాసేదే కవిత కాదు
అన్నలారా, మనసు అనే కాగితంపై
సాయం చెయ్యడం కవిత కావాలి
కవిత చెప్పడం కాదు
కవితలమే మనమైపోవాలి
అన్నలారా అయ్యలారా
అందమైన పది మాటలు పొందిగ్గా అమర్చి
ఎదుటి వారి చప్పట్ల కోసమే ఎదురు చూద్దామా
పేదల ఆకలి దప్పికలను తీర్చే దుప్పట్లమై నిలుద్దామా...

- శివలెంక ప్రసాదరావు, సెల్ : 9949252558.
**
ప్రణయ తుణీరాలు

ఇక్కడే చూస్తున్నాను ఎన్నాళ్ల నుండో
కనిపెడుతున్నాను కనుచూపులతో
నీ నడక, నీ నడవడిక, అందుకేనేమో
ప్రణయ కావ్యాలు రాస్తున్నారు
పడతుల మీద కవులు
నన్ను కదిలించాయి మనసు మెదిలించాయి
నీ పలుకులు, వలపుల స్వరాలు నీ రూపం
నీ మందహాసం నా గుండె తాకే
ప్రణయ తుణీరాలు, మేను తాకే స్పర్శలు
అదిగో ఆ నవ్వే నన్ను కవ్వించింది
పెనవేయాలని, హృదయానికి అద్దాలని
ఆగలేక నేను అది గమనించనా?
అన్నీ వదలి, ఆఖరు మెట్టెక్కి దూకనా?
ఇది పిరికితనం, ఆలోచన లేని,
అనాగరికం, తన్ను తాను,
తమాయించని, తామసతనం
కౌగలించబోయాను తెల్లారింది!

- పోతనపల్లి పాపయ్య (పాపరాజు),
సెల్ : 9392289409