రాజమండ్రి

బౌద్ధం అవసరాన్ని చాటిన ‘బుద్ధ జయంతి’ ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
అద్దంకి బుద్ధచంద్రదేవ్
ప్రియదర్శిని బాలవిహార్
కొత్తపేట
తూ.గో.జిల్లా
సెల్: 9989244202
పేజీలు: 60, వెల: రూ.50/-
**

అరవై ఏళ్ల నాటి రచన అచ్చుకు వచ్చి బౌద్ధ అభిమాన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న పుస్తకం ‘బుద్ధ జయంతి’. దీని రూపకర్త అద్దంకి కేశవరావు. ఆయన పరమపదించి పదకొండు సంవత్సరాలు. అయితే ఆయన సంతానం రచన యొక్క ఆవశ్యకతను గుర్తించి దీన్ని ముద్రించారు. రూపకర్తగా పేర్కొన్న అద్దంకి కేశవరావు ఉపాధ్యాయుడుగా పనిచేసిన కాలంలో విద్యార్థులచేత జరిపించిన కార్యక్రమ విశేషాల సంచిక ఇది. మొత్తం కార్యక్రమాన్ని విద్యార్థుల చేత నడిపించిన తీరు కేశవరావు గారిలోని కార్యక్రమ నిర్వహణా సామర్థ్యాన్ని తెలుపుతుంది. అలాగే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో నిరూపించిన పుస్తకం. సామాన్యంగా సభను నిర్వహించే ముందు ప్రోగ్రాం షీటు తయారుచేసుకోవడం ఆనవాయితీ. అయితే మొత్తం కార్యక్రమ విషయాలు లిఖింప చేయడం కేశవరావుగారిలోని ముందు చూపునకు నిదర్శనం. ఇక్కడొక ముఖ్య విషయం దాగుంది. కార్యక్రమాన్ని రూపొందించిందీ, పిల్లల ప్రసంగాలు, బుద్ధుని ప్రత్యేకతలు, విశేషాలు, అష్టాంగ మార్గాల ఉపదేశాలు అన్నీ ఆయన రాసినవే. ఎక్కడా ఆయన పేరు లేకుండా అదీ విశేషం. ‘ఇప్పుడీ ఈ పుస్తకం ఎందుకూ అంటే’ అని ప్రముఖ సాహితీ సేద్యకారులు విమర్శకులు డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు తన అభిప్రాయాన్ని వెల్లడించారీ ఈ పుస్తకంలో, ఇదొక రికార్డు అని. ఖచ్చితంగా ఆనాడు అద్దంకి కేశవరావు బుద్ధజయంతిని కాగితంపై నమోదు చేయకపోయుంటే మనకేమి ఈ సమాచారం తెలియకపోయేది. దాదాపు అరవై ఏళ్ల కిందటే ఒక సంచికగా ఈ పుస్తకాన్ని రూపొందించటం విశేషం. ముందుచూపుతో పది తరాల బాగు కోసం బౌద్ధం యొక్క అవసరతను తప్పక తెలియపరిచిన విషయం ఈ పుస్తకంలో దాగుంది. బుద్ధుడు పుట్టి రెండువేల అయిదు వందల ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించడం రికార్డు చేయడం చాలా గొప్ప విషయం.
‘బుద్ధ జయంతి’ పేర అద్దంకి కేశవరావు అనే ఉపాధ్యాయుడు తన పాఠశాల విద్యార్థులతో రూపొందించిన కార్యక్రమ విశేష సంచిక. దానిని పుస్తకంగా అద్దంకి వారి సంతానం అచ్చువేయడం బౌద్ధ అభిమానులకే కాదు బౌద్ధ జీవన అవలంబీకులకు సాహితీకారులకు ముఖ్యంగా తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొనదనటం అతిశయోక్తికాదు. దీనికి మరో ప్రత్యేకత ఉంది కేశవరావు స్వదస్తూరితో పుస్తకాన్ని ముద్రించడం. అంటే ఆయన అక్షరాల రాత ఎంత అందమో చూసి చదివితే ఇట్టే మీకు తెలుస్తుంది. పద్యం మీద ఆయన పట్టును ఆయనకుగల మక్కువను తెలుపుతుంది ఈ విశేష సంచిక. ఆ తర్వాత ‘బుద్ధవిజయం’ బుర్రకథను రాసిన ఆయనకు జాతీయస్థాయిలో బహుమతి లభించడంతో బుద్ధుని జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని సంపూర్ణ గౌతమబుద్ధ చరిత్రను ‘తధాగతీయము’ పేరుతో నిర్వచన పద్య కావ్యాన్ని రాయడం మొదలుపెట్టిన ఆయన రెండున్నర దశాబ్దాలపాటు తీవ్ర కృషిచేసి 4088 పద్యాలతో పూర్తిచేశారు. పద్యంపై ఆయనకున్న మమకారాన్ని తెలపటం కోసమే ఇది చెప్పాల్సి వచ్చింది. ఈ నిర్వచన పద్యకావ్యంపై పరిశోధన చేసిన డాక్టర్ దేవవరపు నీలకంఠరావు అంటారు బమ్మెర పోతన ప్రభావం అద్దంకి వారిపై ప్రగాఢంగా ఉందని. ఆయన పద లాలిత్యంలోని మధురిమకు అదే తార్కాణం. డాక్టర్ నీలకంఠరావు మరో మాట అంటారు... బుద్ధ జయంతిలోని పద్యాల్ని ఆయనే వ్రాశారనడానికి ‘తధాగతీయం’లోని పద్యాల్లోని ఎత్తుగడ, కొన్ని గమకాలు వాటిని పోలి ఉన్నాయంటారు. కనుక అద్దంకివారు ఈ పుస్తకంలోని పద్యాలు వ్యాసాలు అన్నీ రాసింది ఆయనే అయినప్పటికీ తన పేరును ఎక్కడా రాయకపోవడం పిల్లల్ని ప్రోత్సాహపర్చడం కోసం అన్నమాట.
అద్దంకివారు మంచి పరిశీలనాశీలి మరియు మంచి పరిశోధకులు. మన దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుల వివరణ, అలాకే ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన పంచశీల సిద్ధాంతాలకి మూలాన్ని బౌద్ధం నుంచే స్వీకరించారంటారు. చాలా చక్కటి ముఖచిత్రంతో మనం చూసే ఈ పుస్తకం కేశవరావు తన రాత ప్రతికి మొదటి పేజీలో అతికించిన బుద్ధుని వర్ణచిత్రం. ఈ పుస్తకం కవర్‌పేజీ డిజైన్‌ను కేశవరావు మనవరాళ్లు తుషార, డిటిపి, పేజ్‌మేకింగ్‌ను వెనె్నల తీర్చిదిద్దటం మరో హైలెట్. అనుబంధంగా ఆయన రాసిన కాలంలో ప్రముఖ చిత్రకారుడు చాపర్ వేసిన బుద్ధుని చిత్రాలు సేకరించారు. వాటికి రైటప్‌గా తధాగతీయంలోని పద్యాలు పొందుపర్చడం బాగుంది. బౌద్ధానికేమాత్రం ఆదరణ తగ్గలేదని రుజువుపర్చటానికి నవ్యాంధ్రప్రదేశ్ బౌద్ధానికి పెద్దపీట వేస్తున్న క్రమంలో అద్దంకివారి కుటుంబ సభ్యులు ఈ పుస్తకాన్ని వెలువరించడం ముదావహం.

- రవికాంత్, సెల్; 9642489244