నెల్లూరు

నీతోనే నేను (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోన్ రింగవుతూ ఉంది. మెలకువ వచ్చి లేచి ఫోన్ తీసి చూసాడు ఆనందరావు. టైమ్ 4 గంటలు చూపుతోంది. ఫోన్ చేసింది ఆనందరావు అమ్మగారు తులశమ్మ అద్దెకు వుండే ఇంటి ఓనరు రాజారాము. కంగారేసింది ఆనందరావుకి. ఇంత పొద్దునే్న ఫోన్ చేశాడంటే ఏదో సమస్య అయ్యే ఉంటుంది అనుకొని మళ్లీ కాల్ చేస్తాడేమో అని ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నాడు.
ఆనందరావు పడే టెన్షనంతా వసంత గమనిస్తూనే ఉంది. ‘్ఫన్ ఎక్కడినుండి?’ అని అడిగింది.
‘రాజారాం గారు చేశారు’ అని చెప్పాడు.
‘అట్టయితే మీ అమ్మ పొయ్యే ఉంటుంది’ చటుక్కున అనింది వసంత. బాధగా చూసాడు ఆనందరావు.
‘అలా అనొద్దు వసంతా. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె మన మీద ఆధారపడకుండా తన పాట్లేవో తను పడుతోంది’ గొణిగాడు ఆనందరావు.
వసంతకు ఒళ్లు మండిపోయింది.
‘చూడండి ఏమైనా సరే మీ అమ్మ అంటే నాకు అసహ్యం. తెల్లగా జుట్టు పెట్టుకొని, ముసలితనంతో వికారంగా కనిపించే ఆమెని చూస్తే నాకు అన్నం కూడా సయించదు. ఆమెను చూస్తూనే నాకు నచ్చదు. ఆమెకు నేను సేవలు చేయను. ఈ ఇల్లు నా పేరు మీద బ్యాంకులోను తీసుకొని కట్టించింది. ఈ ఇంట్లో ప్రతీ భాగం నాకు ప్రాణమే.
ఆమె వచ్చి ఆ బాత్‌రూమ్‌లో అవీ గలీజు చేస్తే నేను తట్టుకోలేను. పిల్లలకు కూడా ఆమె అంటే గిట్టదు. వాళ్లు శుభ్రతకు ఎంతో ప్రాణమిస్తారు. ఆమె మట్టికాళ్లతో ఇల్లంతా నడుస్తుంది. పరుపులపై అలాగే పడుకుంటుంది. ఆమె ఉనికిని నేనసలు భరించలేను. ఆమెను తీసుకొస్తే నేను భరించలేను వసంత గుక్క తిప్పుకోకుండా వాగుతూనే ఉంది.
ఆనందరావుకు మతిపోతోంది. విషయం ఏంటో ఇంకా తెలియనే లేదు. ఆమె ధోరణికి అతను లోలోపల కుమిలిపోతున్నాడు.
ఫోన్ రింగయ్యింది. ఆనందరావు టక్కున తీశాడు. ‘మీ అమ్మగారికి నలతగా ఉంది. మీరు వచ్చి వెంటనే మీ అమ్మగారిని తీసుకెళ్లండి. ఆమె మిమ్మల్ని చూడాలంటున్నది. వెంటనే రండి’ అని రాజారాం అటునుండి చెప్పాడు. ‘ఆమె సామానంతా సర్దేశాను. మీరు ఒక్క గంటలోగా రాకపోతే వీధిలోకి గెంటి సామాను బయటేస్తాను’ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు రాజారం.
ఆనందరావుకి టెన్షన్ మొదలయ్యింది. వసంత అటు తిరిగి పడుకొని అంతా వింటూనే ఉంది. ఆనందరావు ఆమె కాళ్లు పట్టుకున్నాడు.
‘వసంతా నీకు దణ్ణం పెడతాను. మా అమ్మను ఇంటికి తీసుకొస్తాను. చిన్నరూంలో ఆమెను ఉంచుతాను. ఆమె సర్వీసంతా నేను చేస్తాను. నీకు, పిల్లలకు ఏ కష్టం కలిగించను. వృద్ధురాలిని కనికరించు. కఠినంగా ఉండొద్దు. ఆలోచించు.. ఆమెను ఎక్కడికి తీసికెళ్లను? మనమే చూసుకోకపోతే ఎవరు చూస్తారు. ఇన్నాళ్లు ఆమె మనకు భారం కాకుండా దూరంగా ఆమె బతుకు ఆమె బతికింది. కానీ ఈరోజు ఆరోగ్యం బాగలేదు. మనకన్నా ఇంటి ఓనరే నయం. ఇన్నాళ్లు ఆశ్రయమన్నా ఇచ్చాడు.
వసంత నాగుపాములా లేచింది. ‘ఏంటి నీ వ్యవహారం? నువ్వుగాని మీ అమ్మను ఇంటికి తెచ్చావంటే, నా పిల్లలు, నేను ఉరేసుకొని చస్తాము. ఆమె రావడానికి వీల్లేదు’ ముసుగేసుకొని పడుకుంది వసంత.
ఆనందరావు కళ్లలో నుంచి రక్తం కారినంత పనయ్యింది. భగవంతుడా నేనేం చేసేది. ఎక్కడికి తీసుకెళ్లేది? ఈ పరిస్థితుల్లో ఎవరు రానిస్తారు? నా భార్య ఎందుకు నన్నిలా భయపెడుతోంది కళ్లనీళ్లు కారిపోతుంటే తుడుచుకుంటూ బయటకు నడిచాడు ఆనందరావు.
***
అమ్మను చూడగానే బావురుమన్నాడు ఆనందరావు. కొడుకును చూడగానే ఆ తల్లి కళ్లల్లో నుండి వెచ్చటి కన్నీళ్లు వచ్చాయి. ‘ఏడవకు నాయనా అందమైన ఇళ్లల్లో నాలాంటి వారికి చోటుండదు. మంచి పక్కలపై పడుకొనే అవకాశముండదు. ముఖ్యంగా పిల్లల మనసుల్లో స్థానముండటం లేదు. ఇక ఇళ్లల్లో ఏం ఉంటుంది చెప్పు. ఒంటరి కాపురాల్లో తల్లిదండ్రులకు స్థానం లేదు నాయనా. నన్ను ఇంట్లోకి తీసికెళ్లలేవని నాకు తెలుసు. నీకే గౌరవం లేని ఇంట్లో నాకేస్థానముంటుంది చెప్పు. ఈ సామాన్లు ఎవరికైనా ఇచ్చేయ్. నన్ను ఏదో ఒక చెట్టు కింద కూర్చోబెట్టు. నా ప్రాణాలు పోతాయోమోనని ఇంటి ఓనరు భయపడుతున్నాడు. అతన్ని బాధపెట్టడం నాకిష్టం లేదు’
ఆనందరావు తప్పని పరిస్థితుల్లో అమ్మని రిక్షా ఎక్కించాడు. తనూ సర్దుకొని కూర్చొన్నాడు. సాయంత్రం దాకా అమ్మని ఎక్కడైనా ఉంచడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరగా ఊరి చివరకొచ్చారు.
అక్కడ ఈ మధ్యనే అందరూ కలసి కైలాసభూమి అని ఆ ఊరి శ్మశానాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. చనిపోయిన వారికి చక్కగా అంత్యక్రియలు జరగాలని సకల సదుపాయాలు ఏర్పాటుచేశారు. పచ్చని చెట్లతో చక్కని పూలమొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం.
ఆనందరావు ఒక చెట్టు కింద బెంచీపై అమ్మను కూర్చోబెట్టి తానూ ఆమె ఒళ్లో పడుకున్నాడు.
ఆమె చేయి అతని తల నిమురుతూ ఉంది.
‘అమ్మా ఈ అసమర్థ కొడుకుని మన్నించమ్మా. తల్లిని శ్మశానంలో వదిలి వెళ్లాడన్న అపనిందను నేను భరించలేనమ్మా. కానీ నిన్ను మోసే శక్తి కూడా నాకు లేదమ్మా. అందుకే ఈ అరుగుపై నేనూ నీతోనే ఉంటాను. రేపు నా స్థానం కూడా ఇక్కడే కదమ్మా. కన్నతల్లికి కడుపునిండా తిండిపెట్టి ఆమెను ప్రేమగా చూసుకోలేని ఈ బ్రతుకు నాకొద్దమ్మా. ఇన్నాళ్లు నీవు కనీసం ప్రాణాలతో ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా ఉన్నావులే అని కాలం గడిపాను. కానీ ఈ పరిస్థితుల్లో ఒంటరిగా నిన్ను వదలిపోలేనమ్మా’ అతను మాట్లాడుతూనే ఆగిపోయాడు. ఆ తల్లి ఊపిరి కూడా ఆ బిడ్డతోనే కలిసిపోయింది.

- ఎ.రేవతి, వెంకటాచలం చరవాణి : 9985452498