విజయవాడ

అచ్చ తెలుగు కవితల పోటీ (వేదిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రజానటుడు’ కర్నాటి లక్ష్మీనరసయ్య నేతృత్వంలో 1965లో ఆవిర్భవించి గత ఏభై ఏళ్ళుగా అన్ని కళా రంగాలను ప్రోత్సహిస్తూ సేవ చేస్తున్న ఆంధ్ర నాటక కళాసమితి ఈ సంవత్సరం (2017) దేశ విదేశాల్లోని తెలుగు రాష్ట్రాల స్ర్తి, పురుషులను కవితల పోటీకి ఆహ్వానిస్తోంది. విజేతలకు సముచిత బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.1116 అందించనున్నారు. గాంధీ మహాత్ముణ్ణి, గాంధీ సిద్ధాంతాలను ఉద్దేశించి గేయ, వచన కవితలు పంపాలని కోరారు. రచనలో ఎక్కడా పరభాషా పదాలు ఉండకూడదు. యాభై సంవత్సరాల్లోపు వయసున్న కవులు మాత్రమే ధ్రువపత్రం (ఆధార్) సహా రచనలు పంపాలి. కవిత పది నుండి ఇరవై అయిదు పుటల వరకు ఉండవచ్చు. మొదటి పుటపై కవితా శీర్షిక, కవి పేరు మాత్రమే రాయాలని సూచించారు. పోటీకి పంపే రచనలు అముద్రితాలై వుండాలని, ఇది స్వీయరచన అనే ధ్రువీకరణ పత్రం జతపరచాలని తెలిపారు. 2017 జనవరి 31లోగా చేరిన రచనలే పరిశీలిస్తామని, న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని వివరించారు. కవితలను ‘ఆంధ్రనాటక కళాసమితి, ప్రసూన నిలయం, 21-11-68ఎ, 1వ లైను, రైల్వే సొసైటీ కాలనీ, విజయవాడ- 520011, ఇ మెయిల్: npjavvaji yahoo.co.in చిరునామాకు పంపాల్సిందిగా నిర్వాహకులు సూచించారు.
**
చిన్న కథ

నా ఘోష వినేదెవరు?
నేను మొదట ‘క్యాష్’ ప్రోగ్రాంలో సుమ చేతి నుండి విజయం సాధించిన రచయిత్రి ‘హంసధ్వని’ చేతికి చేరగానే ముద్దులతో తడిచిపోయాను. ఇంటికి చేరిన తరువాత పైనున్న నన్ను దేవుని గదిలో ‘విష్ణు సహస్రనామాలు’ పుస్తకంలో వుంచి, మిగిలింది బ్యాంక్‌లో వేసిందామె. దేవుని గదిలో అగరుధూపాలు పీలుస్తూ కర్పూర నీరాజనాలందుకుంటున్న ఆ దేవదేవుని సన్నిధిన ఆరు నెలలు గడిపాను. ఢిల్లీ నుంచి వచ్చిన ఆమె అత్తగారు ఆ పుస్తకాన్ని హాల్లోకి తెచ్చి తెరవగానే కిందపడి ఫ్యాన్ గాలికి ఎగురుకుంటూ బెడ్‌రూంలో డబుల్ కాట్ కిందికి చేరాను. పనిమనుషులు ఇల్లు తుడిచే కార్యక్రమంలో సర్ఫ్ నీరు పడి రూపం మారిన నేను ఒకరోజు చెత్తతో పాటు మున్సిపాలిటీ వారి చెత్తబండిలోకి చేరాను. ఊరి చివర డంప్‌కి చేరి ఆ దుర్గంధంలో నాలుగు రోజులున్నాను. ఎండి ఎండి, గాలికి ఎగురుకుంటూ పోయి సైడు కాలువలో పడ్డాను. కాలవలో చెత్త తీసేవాడు నన్ను దాన్నుంచి బయటపడేశాడు. చిత్రంగా ఇన్ని కష్టాలుపడ్డా నేను చిరగలేదు. రూపుమారిన నన్ను రోడ్డున వెళ్లే ఎవరూ గుర్తించలేదు. చివరికి నేనే ఒక మనిషిని పిలిచాను. అతడు నావంక ఆశ్చర్యంగా చూశాడు. నా దురవస్థ చెప్పాను. ‘నన్ను బాగుచేస్తే నీకు ఉపయోగపడతాను కదా’ అన్నాను. ఇంటికి తీసుకెళ్లి కష్టపడి నాకు పూర్వరూపం తెప్పించాడు. అప్పుడు నా విలువ అందరికీ తెలిసింది. 500 రూపాయల నోటంటే మాటలా! నేనిలా విజయగర్వంతో సంబరపడ్డానో, లేదో పాడుకాలం దాపురించింది. కేంద్రంలోని పెద్దాయన రద్దు ప్రకటనతో ఇంత బతుకూ బతికిన నేను చెల్లని చిల్లు నాణెం కన్నా హీనంగా మారిపోయాను. నా ప్రయాణం గంగానది హిమాద్రి నుండి భువికి, అక్కడ నుండి పాతాళానికి పోకుండా కాపాడిన మనిషికే ముఖం చూపించలేక పెనం మీది నుంచి పొయ్యలో పడిన చందాన విలవిల్లాడుతున్న నేను, ఎవరికి చెప్పుకోను నా కష్టాన్ని?!
- వేమూరి రాధాకృష్ణ, విజయవాడ.

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net