ఉత్తర తెలంగాణ

అమ్మకానికి కీర్తి! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కీర్తి.. ఆత్మగౌరవానికి స్ఫూర్తి
ఇప్పుడు.. అమ్మకానికి ఆస్తి!
తథాస్తు దేవతలున్నంత కాలం
వరాలిచ్చేది పూజారులే!
ప్రతిభకు కొలమానాలు లేనప్పుడు
పురస్కారాలు ఏపాటి!
అడపా తడపా తెరుచుకునే పురస్కార గవాక్షాలు
గుమిగూడే జన సందోహాలు
‘బ్లాకు మార్కెట్’ దెబ్బతో కుదేలు!
ఏలినవారి దయాదాక్షిణ్యాలు
తోడేళ్ల ప్రజాస్వామ్యంలో
పారితోషికాల పరిహాసాలు
నేడు ప్రజ్వరిల్లుతున్న రాజసప్రహసనాలు!
తాకట్టుకు వ్యక్తిత్వాలు
ధరావత్తుకు బానిస బుద్ధులు
బ్రతికున్న శవాలకు అలంకరణలు!
చాపకింద నీరులా తీరుతెన్నులు
రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు
తెరవెనుక బాగోతాలు!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, సెల్.నం.7893366363
**

సుజనస్తుతి

సుప్రభాతమ్ముతో నప్రమేయస్ఫూర్తి
సుప్రతిష్టితకర్మ జొచ్చువారు
కారుణ్యతారుణ్య పారాయణానంద
పారమ్యధీరులై పరగువారు
అరవిందమకరంద గురుచందనాస్వాది
కరమందిరమ్మును గలుగువారు
గురుభక్తి వరశక్తి గతముక్తి వరశుక్తి
ధరముక్తములవోలె వరలువారు
దీనజనుల కష్టాలను దీర్చువారు
ఆర్తులకు అండగానుండి యలరువారు
గలరు లాలితహృదయులు యిలను జెలగి
వారి సౌజన్యమునకభివందనమ్ము!

- డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557
**

మలి సంధ్యలో..

మలి సంధ్యలో
బతుకు ముగిసేది ఎప్పుడో..
మధుర భావాలన్నీ నెమరేసుకోవాలి!
గత వైభవమ్మంత గుర్తుంచుకోవాలి!
వర్తమానంతో సాగిపోతుండాలి!
వారసులు ఎదగడం
సంతోషాలకు మూలం!
ఒంటరైనామని
చింతించవలదు!
ఉన్నదానితో
తృప్తిచెందాలి!
శేష జీవితమంతా
కీర్తిగా బతకాలి!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్
సెల్.నం.9912118554
**

ఆప్తులు

బదులు కోరని
బంగారు మనసుతో..
భగవంతుడు నెరిపే అగ్ని పరీక్షకు
బలికాకుండా.. భరోసాన్నిచ్చి..
మేమున్నామనే ధైర్యాన్నిచ్చి..
ఆపదలో ఆపన్న హస్తం
అందించేవారే.. నిజమైన ఆప్తులు!
అండదండలు మెండుగానిస్తూ
అహర్నిశలు వెన్నంటే ఉంటూ
కడలిలా మారిన హృదయాన్ని తడిమి
కర్కశమే లేక
కరుణ జూపించి..
కలకాలం మనసుకు..
సాంత్వన పరిచేవారే అసలైన ఆప్తులు!

- నీలగిరి అనిత
కరీంనగర్, సెల్.నం.9014894141
**

నిండు ప్రాణం

మరచిపోతున్నావు నేస్తం
మానవ జన్మ మహత్తరమైందని
లోకంలో ఏ కష్టం లేని ప్రాణి ఎవ్వరు?
రాపిడికి గురవ్వనిదే శిల శిల్పం కానట్లు
కష్టం రానిదే నీవు ప్రకాశవంతం కాలేవోయ్ నేస్తం
ఏ జీవి తనకుతాను మరణశిక్ష వేసుకోదు
మరి మానవుడవై నీవెందుకిలా
మరణశయ్యపై నిద్రించి కనుమరుగవుతున్నావు?
ఎవరి కోసమో కాదు నేస్తం నీ జీవితం
నీకై నీవు జీవించు నీ కోసమై నీవు శ్వాసించు
కూపస్థ మండూకంలా చూడకు లోకాన్ని
విశాల హృదయంతో చేరు నీ గమ్యాన్ని
ఔనన్నా కాదన్నా ఎప్పుడో ఒకప్పుడు నువు గిట్టక తప్పదు..నేస్తమా!
మరణంలో చూపించే తెగువ..
సమస్య పరిష్కారంలో చూపు నేస్తమా!
ఆంతర్యం బోధపడి తప్పక సాధిస్తావు విజయం
అజేయుడవై జీవిస్తావు చిరకాలం!!

- సంకెపల్లి కీర్తనారెడ్డి
మహబూబాబాద్, సెల్.నం.9912134309
**

ఆశ

గాలి కోసం ఉవ్వెత్తున ఎగిరి
తామరాకు మీద పడిన
చెరువులోని చేపపిల్ల
మేను చాలించిందట..
హృదయకవాటాలను
చీల్చుకొని..
బయటపడిన
అభాగ్యజీవుల
చిరుకోర్కెల సంగతిలా!

- నాగినేని లీలాప్రసాద్
మంచిర్యాల
సెల్.నం.9247335387
**

రైతు నానీలు

గింజకోసం
గింజుకోవడం
కోతకొచ్చేదాక
కొన ఊపిరే

భూమితల్లిని నమ్మి
భూరిసంపద లమ్మి
శ్రమను ధారబోసినా
ఫలితం కానని రైతు

శ్రీ దాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్
సెల్.నం.9440155240
**

కన్నీటి చెలమలు

బాధలతో బరువెక్కిన
నీ హృదయాన్ని
ఎన్ని కన్నీళ్లతో కడిగినా
బతుకులోని కష్టాలు
కడతేరవు కదా!
తపిస్తున్న మానవ హృదయం
కనీసం నిదురలోనైనా
బాధలు మరిచి పోగలిగితే..
ప్రపంచానికేం నష్టం లేదు!
నీ మనసుకూ
కొంత సాంత్వన
చేకూరుతుంది!
అంతే..
నీ కన్నీటి ఊటలు
చెదిరిపోతాయే కానీ
నీ బాధాతప్త హృదయంలో..
కన్నీటి చెలమలు
సమసిపోవు సుమా!

- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551