దక్షిన తెలంగాణ

సెల్యూట్( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ కుమార్ తన మిత్రుడి పెళ్లికి కరీంనగర్ వెళ్లాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి బంధుమిత్రులు అధిక సంఖ్యలో వచ్చి పెళ్లి జంటను ఆశీర్వదించారు. చిన్న చప్పుడు, పెద్ద చప్పుడు మాత్రమే కాకుండా పెళ్లికి జాజ్ బ్యాండ్ మరియు పైప్ బ్యాండ్‌ను తెప్పించారు.
ప్రక్కన వేడి వేడి భోజనాలు, సంప్రదాయబద్ధంగా అరిటాకులు వేసి వడ్డిస్తున్నారు. సమయం మధ్యాహ్నం రెండు కావస్తుంది. ఒకరిద్దరు తప్ప పెళ్లికి వచ్చిన వాళ్లంతా భోజనాలు చేశారు.
విజయ్ కుమార్ భోజనానికై కూర్చున్నాడు. వడ్డించే వాళ్లందరిది ఒకే రకమైన డ్రెస్. స్కూల్ పిల్లల్లా వున్నారు? విజయ్ కుమార్ ప్రక్కన కూర్చున్న వ్యక్తిని పలకరిస్తూ.. ఏంటి క్యాటరింగ్ సప్లై చేసేవాళ్లంతా ఒకేలా స్కూల్ యూనిఫాంలో వున్నారు!
‘మీకు తెలియదా సార్! వీళ్లు స్కూల్, కాలేజీ పిల్లలు. ముందుగానే సెలవు రోజుల్లో క్యాటరింగ్ వెండర్ వాళ్లతో సప్లై చేయడానికి పని ఒప్పందం కుదుర్చుకుంటారు. సెలవు రోజున ఊరకే వుండి సమయం వృథా చేసుకోరు! పెళ్లిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్‌లకు వెళ్తారు. వీళ్లంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు’ అన్నాడు.
వచ్చిన డబ్బుల్ని కూడబెట్టుకొని రూము కిరాయి, చదువుల ఖర్చులు పోను మిగిలిన డబ్బులతో అమ్మ నాన్నలకు బట్టలు తీసుకుంటారు. వీలు చిక్కినప్పుడల్లా వీళ్లు అనాధ, వృద్ధాశ్రమాల్ని సందర్శించి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలు చేపడుతుంటారు. శ్రమదానం చేయడానికీ వెనుకంజవేయరు.
కూర్చున్న విజయ్ కుమార్ లేచి, పిల్లల దగ్గరికే వెళ్లి మీరు చాలా బుద్ధిమంతులు. వయసులో చిన్నవాళ్లైనా మనసులో పెద్దవాళ్లు, గొప్పవాళ్లు అంటూ అభినందించాడు.
సమయాన్ని వృథా చేయకుండా, సిగ్గుపడకుండా పనులు చేస్తూ మీ లక్ష్యాల విజయం కోసం అడుగులు వేస్తూ మీ కాళ్లపై మీరు నిలబడుతూ మానవత్వసత్యంతో జీవిస్తూ.. అమ్మా, నాన్నలకు చేదోడు వాదోడుగా వుంటున్న మీకు సెల్యూట్. దేశం గర్వించే ముద్దుబిడ్డలు. తులసి, వృంధ మొక్కల్లాంటి వారు మీరు. రేపటి అసలు సిసలైన భావి భారత పౌరులు’ అంటూ పేరు పేరున ఒక్కొక్కరిని మెచ్చుకున్నాడు.

- పెరుక రాజు, నీలగిరి, తమిళనాడు సెల్.నం.9443091384

**
పుస్తక సమీక్ష
**
మానవీయ దృక్పథంతో ‘సత్యానే్వషణ’!

పేజీలు: 112 వెల: 250/-
శ్రీమతి మల్లవరపు విజయ,
కేరాఫ్ డి.్భమన్న,
నిజామాబాద్ ఆర్టీసి షాపింగ్ కాంప్లెక్స్, షాప్ నం.24,
నిజామాబాద్-503001
సెల్.నం.9989326248

దేవుని పట్ల భయభక్తులు చూపటం మనుషులకు మకుటం లాంటిదని భావించే రచయిత్రి శ్రీమతి మల్లవరపు విజయ మానవీయ దృక్పథంతో ‘సత్యానే్వషణ’ ఆధ్యాత్మిక గ్రంథాన్ని వెలువరించారు. మనకు శాంతిని, ఆరోగ్య సౌభాగ్యాలను ప్రసాదించేది మనం భగవంతుని పట్ల శ్రద్ధ్భాక్తులేనని గాఢంగా విశ్వసించే విజయగారు ఈ గ్రంథంలో.. దేవుని పట్ల మనం అణకువగా వుండాలని కాంక్షిస్తూ 91 సూక్తులను పొందుపరిచారు.
మంచిని సాధించాలంటే జ్ఞానిగా జీవించాలనీ, కీడుల నుండి రక్షింపబడుటకు భగవంతుని స్తుతించాలనీ, సదా మనల్ని కాపాడేవాడు ఆ దేవుడేనని, ఆయన ఆశీర్వాద బలంతోనే మనకు అన్నీ సమకూరుతాయని తమ వ్యాసాల్లో విజయగారు చక్కగా ఆవిష్కరించారు.
సత్యప్రకాశమే ముక్తి అని తేల్చి చెబుతూ..ప్రకృతి సౌందర్యాన్ని ప్రసాదించిన భగవంతునికి రుణపడి వున్నామని విడమరిచి చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనుస్సు మొదలగు వాటిని మనల్ని అలరించడానికి భగవంతుడు ప్రసాదించిన వరాలు అనీ..అవి క్రమం తప్పకుండా తమ విధులు నిర్వహిస్తాయని పేర్కొన్న తీరు బాగుంది. ఈశ్వరుడు తాను చేసిన మహాకార్యాలన్నింటికీ.. ఒక క్రమపద్ధతిని నిర్ణయించాడనీ..జ్ఞానానికి ఆధారం ప్రణవమేననీ..అందుకే భగవంతుని పట్ల భయ భక్తులతో మసలుకోవాలని రచయిత్రి గుర్తుచేశారు. ఓర్పు సంయమనం దైవభక్తి మనకు ఆభరణాలవ్వాలనీ.. పెద్దల పట్ల ఆదర భావంతో ఉంటూ వారి సూక్తులు పాటించాలని హితవు పలికారు. దాన ధర్మాలు చేయడంలో అల క్ష్యం అసలే చేయరాదనీ.. సత్ప్రవర్తనా సౌశీల్యంతో జీవనం కొనసాగించాలని ఆమె సూచించారు. జ్ఞానాన్ని ప్రసాదించే గురువుపట్ల ఆరాధ్యభావం కలిగి ఉండాలనీ.. భాషా సౌశీల్యంతో విరాజిల్లాలని తెలిపారు. కామ కాంచనాలు అనర్థ హేతువులని గ్రహించాలనీ..వెలకట్ట లేని స్నేహంతో చెట్టాపట్టాలు వేస్తూ.. జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలని కోరారు. హృదయ వైశాల్యమున్నవాడే జ్ఞాని అనీ..జ్ఞానం వెలకట్టలేని భూషణమనీ.. వివేక వైశాల్యంతో ముందుకు సాగడమే నిత్యకృత్యం కావాలని కాంక్షించడం అభినందనీయం! స్ర్తి, పురుష ప్రవర్తన (్భర్యాభర్తలుగా) అనురాగంతో పెనవేసుకోవాలనీ.. ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం.. సన్నగిల్లకుండా సత్ప్రవర్తనతో బంధాన్ని బలపరచుకోవాలని కోరడం బాగుంది. అహంకారాన్ని త్యజిం చి.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ.. డాబు ను విడనాడి ఒకరికొకరు జీవితాంతం తోడుండాలని ఆకాంక్షించారు. దుష్టులకు దూరంగా ఉంటూ.. అవకాశవాదులను నమ్మకుండా.. సౌశీల్య జ్ఞానంతో ముందుకు పయనించాలని హితవు పలికారు.
ఒక్కొక్కప్పుడు మాట కంటే వౌనమే మేలనీ.. దూషణ సంభాషణలకు తావివ్వకుండా సహృదయంతో మెలగాలని కోరారు. కలహాలు వినాశహేతువులని భావించి, అందరితో సఖ్యతగా వుండాలనీ..్ధర్మిక పథంలో నడిచి మనం మాణిక్యాలుగా వెలుగొందాలని సూచించారు.
సంపదలున్నా గర్వాన్ని ఎప్పుడూ ప్రకటించకూడదనీ.. అన్యాయార్జితాలకు అర్తులు చాచకూడదనీ.. సనాతన ప్రవక్తల సౌశీల్యాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో అడుగులేయాలని హితవు పలికారు.
ఇలా.. గ్రంథం నిండా ఎన్నో హితోక్తులు.. మనలో సదాచారాన్ని అలవర్చేందుకు మరెన్నో సూక్తులను తలపించేలా మంచి మాటలను గుర్తుచేసిన శ్రీమతి మల్లవరపు విజయగారికి అభినందన చందనాలు సమర్పిద్దాం.. ఈ గ్రంథంలోని అంశాలు అన్ని వయసుల వారికి ఉపయుక్తంగా వున్నాయి. ఆధ్యాత్మిక భావంతో సాగే ఈ గ్రంథం ప్రతి గ్రంథాలయంలో, పాఠశాలలో ఉండదగింది..అయితే ఈ గ్రంథానికి నిర్ణయించిన మూల్యము ఎక్కువేనన్న భావన పాఠకుల్లో కలిగే అవకాశముంది!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544
**
సాహిత్య సమాచారం
**
భండారి కథా పురస్కారాలకు
విద్యార్థులనుండి ఎంట్రీలు ఆహ్వానం

కరీంనగర్ భండారి కథా పురస్కార కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నగేష్ స్మారక భండారి కథా పురస్కారాల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్థినీ విద్యార్థుల నుండి ‘కుటుంబ సంబంధాలు - ప్రేమ సంబంధాలు’ అన్న అంశంపై కథలను ఆహ్వానిస్తున్నట్లు కమిటీ కన్వీనర్ డా. బి.వి.ఎన్.స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. కథలను నాలుగు ఎ4 పేజీలకు మించకుండా రాసి, హామీపత్రం, స్టడీ సర్టిఫికెట్ జతపరిచి ఫిబ్రవరి 15వ తేదీలోగా డా. బి.వి.ఎన్.స్వామి, కన్వీనర్, ఇం.నెం.9-6-161, రాంనగర్, కరీంనగర్ - 505 001 చిరునామాకు పంపించాలని కోరారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా వరుసగా రూ.5000, రూ.3000, రూ.1000 చొప్పున, మరో ఇద్దరికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9247817732 ఫోన్‌లో సంప్రదించవచ్చు.