విశాఖపట్నం

అభ్యుదయమే ఆకాంక్షగా... సిరివెనె్నల స్వరం( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తు చేస్తాయి ఆమె కవితలు. సమాజ పోకడలు, అందులోని అసమానతల గురించి ఆ కవితలు సందేశమిస్తాయి. హెచ్చరిస్తాయి కూడా. ప్రస్తుతం మనుషుల తిరోగమన స్థితిపై ఆ కవితలు కొన్నిచోట్ల ఆక్రోశిస్తాయి. సిరి లాభాల కలం నుండి జాలువారిన ‘సిరివెనె్నల స్వరం’ కవితా సంపుటిలోని కవితలు నేటి సమాజానికి అద్దం పడతాయి. గర్భంలోని శిశువు భ్రూణహత్యకు గురవబోతుందని తెలిసి ‘నేను ఆడపిల్లని నన్ను చంపకండి ప్లీజ్’ అని బతిమాలుతూ చేసే ఆర్తనాదం చదువరుల కళ్లు చెమ్మగిల్లింపజేస్తాయి. ‘్భరతమాత’ కవితలో అపరంజి బొమ్మలను అంగడిబొమ్మలు చేస్తున్నారని, కూలి కోసం వెళ్లిన అబలలను చెరిచి వారి పసిపిల్లల్ని వారి చేతుల మీదుగానే చెత్తకుప్పల పాల్జేస్తున్నారని కవయిత్రి ఆవేదనను వ్యక్తం చేస్తారు. కన్నతల్లి వంటి భరత ఖండానే్న ముక్కలు చేస్తున్న వంచకుల చేతిలో నలిగిన నేను ‘నిన్ను ఊపిరి పోసుకోనివ్వలేను... నన్ను క్షమించు తల్లీ అంటారు కవయిత్రి ఒక కవితలో. పసితనం నుండి పడుచుదనం వరకు స్వప్నంగా అయినా తిరిగి రావాలని కోరుకుంటున్న వైనం ‘మధురం’ కవితలో హృద్యంగా చెప్పారు కవయిత్రి.
అలాగే స్ర్తిలు ఓ వరంలా భావించే మాతృత్వం కొందరి వల్ల కళ తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ‘అమ్మ మాత్రమే ఇవ్వగలిగే అమృతం’ అనే కవితలో వ్యక్తం చేశారు. అందం తరిగిపోతుందని జన్మనిచ్చిన పిల్లలకు కూడా అమ్మపాలు పట్టని మాతృమూర్తుల వైనాన్ని కవయిత్రి వ్యక్తీకరించిన తీరు ఆవేదనకు గురి చేస్తుంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య గతంలో చూసిన అనుబంధాలు, ఆప్యాయతలు నేడేవి అని ప్రశ్నిస్తూ కవయిత్రి వెలువరించిన ‘అనురాగబంధం’ కవిత అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంకా డాడీ, నీ ప్రేమకు గుర్తుగా, అమ్మా నాన్నల ప్రాణాలు, మహిళా శిరోమణులు, అవని తడిలో అతివ, నవతరపు నారీమణి, భార్య వంటి కవితలు పాఠకులను ఆకట్టుకునేలా రాశారు. ఈ కవితా సంపుటిలో ఆర్భాటం లేదు, ఉన్నది ఉన్నట్లు మనసులను రంజింపజేసేలా ఉన్నాయి.
ఎందరో ఆడపిల్లలు కపటప్రేమ, కల్మష ప్రేమలను నిజమైనవిగా నమ్మి కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ, అనురాగాలను తృణప్రాయంగా వదిలివేసి శలభాల్లా మాడిపోతున్న వైనాన్ని తెలివిగా, కళ్లు విప్పి గమనించమని పలు కవితల్లో కవయిత్రి హెచ్చరించారు. అనురాగాల కోసం తపిస్తూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి కవయిత్రి తాపత్రయపడడం కనిపిస్తుంది. సమాజం పట్ల నిబద్ధత, ప్రేమ వ్యక్తమవుతుంది. సంపుటిలోని కవితలన్నింటినీ చదివితే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.

- పుష్పగుర్రాల,
ఇస్మాయిల్‌కాలనీ,
రాజ్యలక్ష్మీ థియేటర్ దగ్గర,
విజయనగరం-2.

**
ఆరుద్ర దారిలో సినారా
మనసుకు హాయినందించిన శ్రీశ్రీ పదాలు

తెలంగాణలో సినారె, శ్రీకాకుళంలో కారా, విశాఖలో సనారా పేరు వినని వారుండరు. అయిదు దశాబ్దాల సీనియర్ కవి మాధవీ సనారా. రానాస ప్రచురణలు (అనకాపల్లి) ద్వారా ఇప్పటి వరకు తన స్వీయ రచనలు 17 పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం పొందిన సనారా తన 18వ పుస్తకంగా దీనిని ప్రచురించారు. సాహిత్యంలో కొత్త ఒరవడి ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకు సనారా కనిపిస్తారు. ఆరుద్ర కూనలమ్మ పదాలకు ఆకర్షితులై అదే బాణీలో ఇందులోని కవితలను ఆయన రాశారు. శ్రీశ్రీపై పదాల పద సంపదను మనకందించారు.
ఇక పుస్తక సమీక్ష విషయానికి వస్తే శ్రీశ్రీ జీవితాన్ని మన కళ్ల ముందు అక్షరీకరించారు కవి. చివరి పాద రెండు శ్రీలోడు అంటూ 117 పద్యాలను అక్షర వెలుగుల ద్వారా అందించారు.
గొప్ప పాటలవాడు
గొప్ప మాటల వాడు
గొప్ప రాతలవాడు
రెండు శ్రీలోడు అంటారు కవి. నిజమే జగమెరిగిన సత్యం ఇది. ఇక 27వ పద్యంలో కవి ఇలా అంటారు. అతను నడిచిన బాట/సామ్యవాదపు తోట/పాలకులతో వేట / రెండు శ్రీలోడు అంటారు. ఇది యదార్ధం. మరో పద్యంలో ఆయన శ్రీశ్రీ గురించి ఇలా రాశారు. కవిలోక సూరీడు కైత రాజ్యపు రేడు శ్రీలున్న పేదోడు రెండు శ్రీలోడు అంటూ అద్భుతమైన వర్ణన చేస్తారు. అలాగే 39లో ఇలా అంటారు విప్లవాలే బాట విప్లవమ్మే నోట క్రాంతి పైనే పాట రెండు శ్రీలోడు అని చెబుతారు. అలాగే 45వ పాటలో ఇలా చెబుతారు. అతని కవితే స్ఫూర్తి అతని మూర్తే మూర్తి అతని కీర్తే కీర్తి రెండు శ్రీలోడు అని వ్యక్తం చేస్తారు. 75వ పద్యం ద్వారా అతను తెలియని వారు తెలుగు వాళ్లలో లేరు ఉంటే తెలుగు వారు కాదు రెండు శ్రీలోడు అంటారు. ఇక ముగింపుగా 110వ పద్యంలో ఈ శతాబ్దం నాది అన్న సాహసవాది దోచేనందరి మది రెండు శ్రీలోడు అని చెబుతారు. ప్రతి పాదం చదువుతుంటే శ్రీశ్రీనే అద్దంలో చూస్తున్నట్లు ఉంటుంది. శ్రీశ్రీకి శ్రీశ్రీ పదాలంటూ అక్షర నివాళి అర్పించిన సనారా పాఠకుల మది దోచుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.

- మహ్మద్ రఫీ (ఈవేమన),
శ్రీకాకుళం.
సెల్ : 7893451307.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.