విశాఖపట్నం

గౌరవం( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముహూర్తానికి టైం అవుతోంది సుజీ’’ తయారవడం పూర్తి అవగానే భార్యికి వినిపించేలా అన్నాను గట్టిగా.
నిజానికి అప్పటికే అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అయిందనే చెప్పాలి.
నేను అలా అన్న వెంటనే నా భార్య సుజీ నుండి వెంటనే సమాధానం రాలేదు. దానికి కారణం నాకు తెలుసు.
ఆడవాళ్ల ముస్తాబు అంత త్వరగా తెమలదు కదా.
అందుకే మళ్లీ రెట్టించలేదు నేను ఆమెకి కోపం వస్తుందని.
సరిగ్గా రెండు నిముషాల తర్వాత మా ఆవిడ సుజీ మాట వినిపించింది నాకు ‘‘నేను రెడీ’’ అంటూ.
నిజానికి ఆ మాత్రం తయారు కావడం అంటే స్పీడుగానే తయారైనట్లు లెక్క. ఎందుకంటే నా భార్య బయటికి వెళ్లేటప్పుడు ఎలా లేదన్నా అరగంటకి తక్కువలో తయారు కాదు.
అందుకే నాకు ఆనందం వేసింది.
అందంగా ముస్తాబైన నా భార్య నా ఎదురుగా వచ్చి ‘‘ ఏమండీ’’ అంది ముద్దులొలకబోస్తూ.
‘‘ ఏమిటోయ్?’’ అన్నాను నేను.
‘‘మనం ఈ రోజు బయటికి స్కూటర్ మీద వెళదామండీ’’ నా షర్టు బటన్స్ సరిచేస్తూ అంది.
నాకు విచిత్రం అనిపించింది. అయినా బయటికి ఆ ఫీలింగ్ తెలియనివ్వకుండా ‘‘ఎందుకోయ్?’’ అన్నాను.
తను వెంటనే చెప్పడానికి తటపటాయించింది.
‘‘చెప్పవోయ్ సుజీ. మనం కారులో ఎందుకు వెళ్లకూడదు? స్కూటర్ మీద ఎందుకు వెళ్లాలి?’’ ప్రశ్నించాను నేను.
‘‘మరి పెళ్లికూతురు వాళ్లు అంతగా డబ్బులు లేనివాళ్లండి. వాళ్లది మధ్య తరగతి కుటుంబం. మనం కారులో వెళితే వాళ్ల దగ్గర మనమేదో ఫోజు కొడుతున్నామని అనుకుంటారని’’
ఆమె అలా అనగానే నేను ఆలోచనల్లో పడ్డాను.
కొంచెం సేపు అయిన తర్వాత ‘‘పెళ్లికొడుకు వాళ్లు చాలా మందివాళ్లు సుజీ. అదీ కాకుండా మనకి కొంచెం దూరపు బంధువులు కూడా. వాళ్లని మనింట్లో ఏ ఫంక్షన్లకీ పిలవలేదు. అయినా సరే వాళ్లు మన ఇల్లు వెదుక్కుని మరీ వచ్చారు. మనల్ని ప్రేమగా పిలిచారు. ఎందుకో తెలుసా? మేము పేదవాళ్లమే అయినా మాక్కూడా పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసమే. వాళ్ల సరదాని, ఆకాంక్షను కొట్టిపారేయడం ఎందుకు? అందుకే మనం కారులోనే వెళదాం’’ అంటూ శ్రీమతికి వివరించాను.
నేను చెప్పింది అర్ధమైనట్లుంది నా భార్య సుజీ చిరునవ్వుతో ‘‘అలాగేనండీ’’ అంటూ సమ్మతం తెలిపింది.
ఇద్దరం బయటికి నడిచాం.

- వసంతకుమార్ సూరిశెట్టి, నెల్లిమర్ల-535217.
**

కుక్క మూతి పిందెలు( కథ)

అదో ప్రభుత్వ కళాశాల. రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానిని సుమారు పాతికేళ్ల కిందటి కట్టారు. ఈలోగా అక్కడ మెల్లగా మరికొన్ని కాలేజీలు వచ్చాయి. దాదాపు అయిదేళ్ల కాలంలో ముందుగా రెండు, తర్వాత రెండు, ఆఖర్న మరో రెండు కళాశాలలు మెయిన్ రోడ్డు మీద వెలిసాయి.
బలాబలాల ప్రదర్శన జరుగుతోంది గత నాలుగేళ్లుగా.
జంబ్లింగ్ ద్వారా ప్రైవేట్ కళాశాలల్లో రాసే ప్రభుత్వ విద్యార్థుల రిజల్ట్స్ తగ్గుతూ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు మాత్రం మంచి మార్కులతో చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.
క్రమంగా ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
స్కాలర్‌షిప్‌లు ఎక్కువగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకే ఇవ్వాలని, టెక్ట్స్‌బుక్స్ ద్వారా జవాబులు వెదికి రాసే విధానం అమలు చేయాలని, ఫెయిల్ అయితే డిటెన్షన్ విధానం ఫాలో కావాలని, విద్యార్థులకు టాయిలెట్స్ వంటి సౌకర్యాలు పెంచాలని రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. ప్రైవేట్ కళాశాలల వాళ్లు బంధుత్వాల్ని కెలికి, ఇతర ఆశలు చూపి కాస్తంత తెలివైన వారిని ఏరుకుపోతున్నారు. దీనికి కొందరు స్థానిక ఉపాధ్యాయుల సహాయ సహకారాలు లభిస్తున్నాయని, ఎవరూ అక్కర్లేని వారుగానీ, పేదవారు గానీ ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవుతున్నారని వదంతులున్నాయి. చాలా వరకు అది నిజం కూడా. రేషనలైజేషన్ ప్రక్రియలో ఆ కళాశాల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రైవేట్ కళాశాలల పోటీ ఫలితాలలె ఉంటాయో చూడాలి మరి.
- శ్రీనివాసభారతి,
శ్రీకాకుళం.
**

గ్రంథ పరిచయం
**
పదవిరించి

ప్రాప్తిస్థానం
ముదిగొండ శ్రీరామశాస్ర్తీ,
8-1-213 ఎ, ప్రశాంత్‌నగర్,
ఖానాపురం హవేలీ, ఖమ్మం-507002.
వెల రూ. 80.
పద్యరచన కనుమరుగుతున్న నేటి కాలంలో ఒక పద్యకావ్యాన్ని రచించడం సాహసమే. అందునా పదకవితా పితామహుడు అన్నమాచార్య జీవిత చరిత్రను పద్యకావ్యంగా మలచడం భావుకుడైన కవికే సాధ్యం. ఆ సాహసి ముదిగొండ శ్రీరామశాస్ర్తీ. బహుశాస్త్ర కోవిదుడైన తండ్రి వారసత్వాన్ని అందుకున్న శాస్ర్తీ కలం నుండి జాలువారిన కావ్యం పదవిరించి. 32 వేల పదాలతో స్వామిని అర్చించిన మహాభక్తుడు. అన్నమయ్య భక్తి జీవాత్మ పరమాత్మలను సమన్వయం చేసే మధురభక్తి. తన ఆత్మను పరమాత్మకు నివేదించుకుని భగవత్ సాక్షాత్కారం పొందిన భక్తాగ్రగణ్యుడు. ఈ కోవలోనివారే గోపికలు, ఆశ్వారులు, గోదా, మీరాబాయి, క్షేత్రయ్య, జయదేవుడు మున్నగువారు. అట్టి అలౌకిక భక్తిని శ్రీరామశాస్ర్తీ తన కావ్యంలో ప్రదర్శించారు.
శ్రీరామశాస్ర్తీ కావ్యవిధానం ప్రాచీన కవుల ఒరవడిలో నడిచింది. ఇది పద్య గద్యాత్మకమైనది. హృద్యమైన పద్య రచనా శైలి పూర్వ కవులను, ముఖ్యంగా పోతనామాత్యుని స్ఫురణకు తెస్తుంది. పదాలను పాదాలకు ఎంచుకోవడంలో, అలంకారాలను అద్దడంలో కవికి గల కూర్పు, నేర్పు ప్రతిబింబించి కావ్యానికి పదవిరించి అనే పేరుకు సార్థకతను ఆపాదించినట్లు అయింది. లలితమైన సంస్కృతాంధ్ర శబ్దాలను వాడినా నిఘంటువులు అవసరం లేదు. తెలుగు పద్యాలకు ప్రయోగించే ఛందోరీతులన్నీ కవి సందర్భానుసారంగా ఉపయోగించడం పాఠకులకు ద్రాక్షరసాస్వాదనమే అవుతుంది. పుష్యంతాలు, సూక్తి ముక్తావళులు వీనులకు విందునందిస్తాయి. కవి కావ్య లక్షణాలన్నీ ఒంట బట్టించుకున్నవారు. ఆయన మిత్రులు ప్రసాద్‌బాబు అన్నట్లు ఆయన ‘నిక్కపు కవి’యే. పదవిరించి కావ్యంలో అవతారికతో పాటు మూడు ఆశ్వాసాలున్నాయి. అవతారిక విభాగంలో 58 పద్యాలున్నాయి. ఇవి ఇష్టదేవతా స్తుతి, పూర్వ కవులకు వందన సమర్పణము, కృతికర్త వంశవర్ణనకు సంబంధించినవి. ప్రథమాశ్వాసంలో 115 పద్యాలున్నాయి. దీనిలో భారతదేశ ప్రశస్థి, తెలుగు ధరిత్రి వైభవము, తాళ్లపాక గ్రామ వంశీయుల వృత్తాంతము, అన్నమయ్య పుట్టుక, బాల్యము, అన్నమయ్య తిరుమల యాత్రా విశేషాలు ప్రధానాంశాలు. ముఖ్యంగా అన్నమయ్య బాల్యచేష్టలు పాఠకులను అలరిస్తాయి. జేజెయనగా నతులను జేయునుండు, వరదుగని నేగ చప్పట్లు చరచునుండు (పే 57) పంక్తులను చదువుతున్నప్పుడు శ్రీహరి భక్తుడు ప్రహ్లాదుడు పాఠకుల మదిలో మెదులుతాడు. తిరుమల యాత్రా సందర్భం వన దేవతలను దర్శిస్తాడు. తొండమాను చక్రవర్తిని హృదయంలో నిలుపుకున్నాడు. కురువనంచి భక్తికి మోకరిల్లాడు.
రెండవ ఆశ్వాసం 106 పద్యాలతో విస్తరించి ఉంది. ప్రధానంగా తిరుమల క్షేత్ర దర్శనం, తీర్థదర్శనం, వేంకటేశ్వరుని సాక్షాత్కారం ప్రతి పద్యంలో భక్తి ప్రవాహం పొంగి పొరలుతుంది. ముఖ్యంగా మహాకవి కాళిదాసు అంబిక అనుగ్రహం పొందగానే అసువుగా అంబికను స్తుతించినట్లు వేంకటేశ్వరుని సాక్షాత్కారం లభించగానే అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ పలికిన దండకము స్వామి భక్తులకు అపూర్వ కానుక. తిరుమల నుండి తాళ్లపాకకు తిరిగి వచ్చిన అన్నమయ్య తల్లిదండ్రుల కోరికపై వివాహం చేసుకున్నా భక్తిమార్గాన్ని వదిలిపెట్టలేదు.
మూడవ ఆశ్వాసంలో 105 పద్యాలున్నాయి. ఇది తాళ్లపాకకు వెలుపల గల తీర్థక్షేత్రాల దర్శనం, అప్పటికే అన్నమయ్య భక్త్యావేశంతో చెప్పిన పద కవితలు ప్రాచుర్యం పొంది కీర్తి నలుదిశలా పాకింది. సాళ్వనృసింహ రాయల ఆస్థానానికి చేరింది. రాయలు అన్నమయ్యను సాదర సత్కారాలతో ఆహ్వానిస్తాడు. అన్నమయ్య ముఖతా పద్యకవితలను ఆస్వాదించి తన రాజ్యంలో నివసించవలసిందిగా అర్ధిస్తూ పెనుగొండను బహూకరిస్తాడు. రాయలలో అహంకారం పెరిగి వేంకటేశ్వరుని వలనే తనని కీర్తిస్తూ కీర్తనలు రాయమని ఆజ్ఞాపిస్తాడు. రాయల కోరికను తిరస్కరించిన అన్నమయ్యను చెరసాల పాలు చేస్తాడు.
ఈ సందర్భంలో సింగభూపాలునికి భాగవతం అంకితం ఇవ్వడానికి నిరాకరించిన పోతనామాత్యుడు గుర్తుకు వస్తాడు. ఇలా ఎన్నో దృష్టాంతాలు కావ్యంలో మనకు కనిపిస్తాయి. ఈ కావ్యం యాదృచ్ఛికంగా రాసిన కావ్యం కాదు. శ్రీ వేంకటేశుని అనుగ్రహబలంతో, తనలోని గల భక్త్భివావేశంతో మలచినది. పాఠకుల హృదయాలను భక్త్భివనతో నింపేది. శ్రీరామశాస్ర్తీ మరిన్ని కావ్యాలు సృష్టించడానికి సప్తగిరీశ్వరుడు ఆయనకు భక్తియుక్తులను ప్రసాదించాలని ప్రార్థిద్దాం.

- ఎ . సీతారామారావు,
19-3-10,
లక్కపందిరివీధి,
విజయనగరం-534002.
సెల్ : 8978799864.