దక్షిన తెలంగాణ

వర్తమాన సాహిత్యం వైవిధ్యభరితం ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
**

కవిత్వంలో భావలయ, సినిమాలో దృశ్యలయ రెండూ తనను ఆకర్షిస్తాయని అభిప్రాయపడే ప్రముఖ కవి, రచయిత, సినీ విమర్శకులు వారాల ఆనంద్ కరీంనగర్‌కు చెందినవారు. ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలో గ్రంథపాలకునిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయనకు అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడం, అనేక సినీ ఫెస్టివల్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆవిర్భావం.. సోసైటికి ఫిల్మ్‌భవన్ నిర్మించడంలో ఆయన ప్రధాన భూమికను పోషించారు. తాను సినీ వ్యాసాలే కాక.. వివిధ ప్రక్రియల్లో పలు గ్రంథాలను వెలువరించారు. కవి, రచయిత సినీ విమర్శకునిగా అందరి మన్ననను పొందుతున్న ఆయనతో మెరుపు ముచ్చటించింది. ఆయనతో జరిపిన ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే పాఠకులకు అందిస్తున్నాం...

ఆ సాహిత్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు? సినిమా పట్ల అభిమానం ఎందుకు పెరిగింది? రెండింటి మధ్య సారూప్యాలు, భేదాల గురించి చెప్పండి?
సాహిత్యం ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక కోపం, వేదన, దుఃఖం ఇలా ఒకటేమిటి మొత్తంగా మనిషి శ్వాస తీసుకున్నంత సహజంగా తనను తాను వ్యక్తీకరించుకునే రూపమే సృజన. అది కవిత్వం, పాట, వచనం, సంగీతం, పెయింటింగ్, సంగీతం సినిమా ఏదయినా సృజనే. ఒక్కొక్కరు తమకు వ్యక్తీకరణకోసం ఒక్కో రూపాన్ని ఎంచుకుంటారు. వాటిల్లో రూప భేదమే తప్ప వేరే కాదు. అందులోనూ అత్యంత ప్రాచీనమయిన సాహిత్యం, ఆధునికమయిన సినిమా రెండూ నాణానికి రెండు ముఖాల్లాంటివి. నాకయితే రెండింటిలో పెద్ద భేదం కనిపించదు. ఈ కవిత్వంలో లయ, సినిమాలో దృశ్యలయ రెండు నన్ను అమితంగా ఆకర్షిస్తాయి.

ఆ మీ రచనల వివరాలు చెప్పండి?
మొదట వేములవాడ నటరాజ కళానికేతన్ వెలువరించిన ‘నవత’ పత్రికతో రచన ఆరంభమయింది. తరువాత చిత్రిక, జీవగడ్డ లాంటి పత్రికల్లో రచనలు సాగాయి. ముఖ్యంగా జీవగడ్డ నా దృక్పథాన్ని విస్తృతపరిచింది. తర్వాత 1981లో జింబో, అలిశెట్టి ప్రభాకర్, వజ్జాల శివకుమార్, పి.ఎస్.రవీంద్రలతో కలిసి ‘లయ’ కవితాసంకలనం వెలువడింది. ఆ తర్వాత కార్యక్షేత్రం సినిమా వైపు మరలింది. ‘మానేరు తీరం’, నవ్యచిత్రవైతాళికులు, బాల చిత్రాలు, చిల్డ్రన్ సినిమా, సినీ సుమారు, 24ఫ్రేమ్స్, మనిషిలోపల, మానేరు గలగల, బంగారు తెలంగాణలో చలనచిత్రం, మెరుపు సిగ్నేచర్ ఆఫ్ లవ్ (అనువాదం) తదితరాలు వెలువడ్డాయి.

ఆ వర్తమాన సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
వర్తమాన సాహిత్యం గొప్ప వైవిధ్యాన్ని విలక్షణతని సంతరించుకుంది అనడంలో సందేహం లేదుకానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పాట పాత్ర గొప్పది. వచనం చాలా వరకు వెనకబడింది. కవిత్వం చాలానే వచ్చింది. కానీ భాషపైననే కవులు ధ్యాస పెట్టడం జరుగుతోంది.

ఆ నూతన తరం సాహిత్య సృజనలోకి రావాలంటే ముఖ్యంగా ఏం చేయాలి?
కొత్త తరంలో వినూత్నంగా ఆలోచించడంతో పాటు విలక్షణంగా తమను తాము వ్యక్తం చేసుకునే తత్వం వుంది. ఆధునిక సాంక్తిక పరిణామం వాళ్లని ఎక్కువ కాలం ఎంగేజ్ చేస్తోంది. నిజానికి సాహిత్యం యువతను చేరలేకపోతోంది. ఆంగ్ల, తెలుగు సాహిత్యాల్లో పిజిలు చదువుతున్న వారికి కూడా టెక్ట్స్ బుక్స్ తప్ప సాహిత్య లోతులు తెలియడం లేదు. మూడున్నర దశాబ్దాల కాలేజీ అనుభవంలో నేను తెలుసుకున్నదేమంటే మంచి కవిత్వం, మంచి సినిమా వారిని చెరగలిగితే వారు తప్పకుండా ఆకర్షితులవుతారు. మంచి మనుషులుగా మారతారు.

ఆ ఆధునిక కాలంలో తెలుగు భాషా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని ఒక వాదన వినిపిస్తుంది. ఇది నిజమా? అయితే దీనికి ప్రధాన కారణాలేమై ఉంటాయి?
ఆధునిక కాలంలో విస్తృతంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల అనేక అంశాల ప్రాధాన్యతా క్రమం ఒడిదొడుకులకు గురవుతున్నది. అది భాషా విషయంలో కూడా వుంది. ఎప్పుడయితే విద్యా అధ్యయనం విజ్ఞానం కోసం వ్యక్తిత్వ వికాసం కోసం కాకుండా కేవలం ఉద్యోగం కోసమే అన్న పరిస్థితి ఏర్పడిం తరువాత భాష అధ్యయనం పాత్ర తగ్గిపోయింది.

ఆ గ్రంథాలయాధికారిగా మీకున్న విశేషానుభవంతో విద్యార్థి పాఠకులలో తెలుగు భాష విషయంలో మీరు ఎలాంటి మార్పు గమనించారు?
మూడున్నర దశాబ్దాలకు పైగా విద్యార్థుల తోనూ పుస్తకాలతోనూ గడిపాను. ఈ కాలంలో పుస్తకాల పట్ల అధ్యయనం పట్ల అనేక మార్పుల్నే చూశాను. భారతి, స్రవంతి లాంటి సాహిత్య పత్రికలతో పాటు శ్రీశ్రీ, చలం, కుటుంబరావు లాంటి వారి సాహిత్యాన్ని చదివిన విద్యార్థుల్నీ, యుద్దనపూడి, యండమూరి లాంటి వ్యాపార రచయితల పుస్తకాల్ని చదివిన విద్యార్థుల్నీ గమనించాను. వ్యాసరచన, ఉపన్యాస లాంటి వ్యాపార రచయితల పుస్తకాల్నీ చదివిన విద్యార్థుల్నీ గమనించాను. వ్యాసరచనా, ఉపన్యాస పోటీల్లో తెలుగులో విశేషంగా పాల్గొన్న వారినీ చూశాను కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారింది. ఇప్పుడు కేవలం సిలబస్ పుస్తకాలు చదవడమే గగనమయిన పరిస్థితి వుంది. అది కూడా ఆంగ్ల మాధ్యమం. అంతే కాదు నోట్స్ గైడ్లూ, ప్రశ్న బ్యాంకులకే పరిమితమయిన విద్యార్థులే అధికంగా వున్నారు.

ఆ విద్యార్థులలో వచ్చిన ఈ మార్పుకు ప్రభావ హేతువు ఏమై ఉండవచ్చు?
నేరం విద్యార్థులది కాదు. సమాజానిదే అందులో ముఖ్యంగా ప్రభుత్వాలు, తల్లిదండ్రులదే.

ఆ ఈ రోజు తెలుగు పేరుతో సినిమాల్లో, సినిమా పాటల్లో వినిపించే భాష ఆహ్వానించదగ్గదేనా?
ఇవ్వాళ తెలుగు సినిమాల్లో తెలుగుతనమే లేదు. స్పష్టంగా చెప్పుకోవాలంటే దానికి ఎలాంటి స్థానికతా లేదు. ఇవ్వాల్టి సినిమా కథలకు, పాత్రలకు వునికి లేదు కేవలం అర్థం లేని వూహలు మాత్రమే, ఇక భాష విషయంలో చర్చించాల్సిన అవసరమే లేదు. వాటిల్లో సరయిన భాష గాని వ్యక్తీకరణ గానీ వుండడం లేదు. అంతా కృతకమయిపోయింది.

ఆ మాతృభాష ప్రాధాన్యత పెంచే విషయంలో ప్రజలను ఏవిధంగా భాగస్వాములను చేయవచ్చు?
ప్రజల్ని చూసి (టివి మొ) లక్షణం నుంచి చదివే లక్షణం వైపు మరల్చాలి. పౌర గ్రంథాలయాల్ని అభివృద్ధి చేసి మొదట తెలుగు చదివే అలవాట్లు పెంచాలి.

ఆ విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?
విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు. ఏ రంగంలోనయినా సృజనాత్మకత కలిగిన వారే ఉన్నత శిఖరాలకు చేరుతారన్న విషయాన్ని ఎప్పుడూ మనసులో వుంచుకోవాలి.
**

చిత్రం..వారాల ఆనంద్, కరీంనగర్
సెల్.నం.9440501281

- దాస్యం సేనాధిపతి కరీంనగర్, సెల్.నం.9440525544