ఉత్తర తెలంగాణ

చిన్ని ఆశ ! ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడతెగని
ఆలోచనా తరంగాలు
పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ
హృదయ తీరాన్ని
కల్లోల పరుస్తుంటే..
కలత చెందుతు
కలవరపడుతూ
కలలు కనడం మాని వేస్తున్నప్పటికీ..
వేదనకు అంతులేదు!
ప్రతి రేయి కళ్లు చెమర్చే రోదనే
నన్ను వెంటాడుతుంటే...
ఏమి చేయను?
ఎలా ముందుకు సాగను?
పనులలో అవరోధాలు
నడకలో అడ్డంకులు
నన్ను వెక్కిరిస్తుంటే..
ఎలా అడుగేయను?
అయినా..
ఆత్మస్థైర్యమే ఆయుధంగా మలుచుకుని
ఎప్పటికైనా విజయం వరిస్తుందన్న
చిన్ని ఆశతో.. ముందుకు సాగుతా!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031
**

కొత్త నోట్లు

కొత్త నోట్లు
మన ప్రగతికి మెట్లు..
కోట్ల కొలది దాచిపెట్టిన
నల్ల కుబేరుల భరతం పట్టడానికే
ఈ చర్య అని గ్రహించు!
ఇప్పుడు కొన్ని రోజులు మనం
బ్యాంకుల వద్ద బారులు తీరితేనేం?
మన భవిష్యత్తంతా బంగారుమయం!

- ఆర్.పోచయ్య
బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా
ఫోన్.నం.08735-225184
**

అసహాయురాలిని!

నేను ఈ లోకంలో ఒక జీవిని!
ఏదో చేయాలన్న తహ,తహ తపన నాలో ఉంది!
కానీ ఏమి చేయలేని నిస్సహాయురాలిని!
ఆకాశంలో నీలి, నీలి మబ్బుల్లోన
స్వేచ్ఛ విసంగంలా విహరించాలని ఉంది!
కాని రెక్కలుండి, ఎగరలేని నిస్సహాయురాలిని,
చిటారు కొమ్మల్లో, మావి చిగురు తిని కోయిలలా,
పాడాలని ఉంది. కానీ గొంతు ఉన్న మూగ జీవిని!
తెల్లని మల్లెపూవుల్లా నవ్వాలని ఉంది
తెల్లని మనసున్నా నవ్వలేని వౌన జీవిని
ప్రకృతి అందాలన్ని తిలకించాలని ఉంది కానీ
కళ్లు ఉన్న కబోదిని నేను!
లేడిల్లాగ గెంతాలని ఉం, కానీ కాళ్లు ఉన్న కుంటిదానిని!
కానీ.. నిలబడ్డాను నేను, ఒక వెలుగుతున్న కొవ్వొత్తిలాగ
నేను కరిగిపోతూ వెలుగులు విరజిమ్మాను
ఆ వెలుగులో నా పిల్లలు దారి వెతుక్కున్నారు
అప్పుడు అనుకున్నాను నేను, అసహాయురాలినని,
నేను వెలుగుతూ, కరుగుతూ ఉన్న
ఒక మాతృమూర్తినని!

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల గ్రామం, జగిత్యాల జిల్లా
సెల్.నం.9493210293
**

ఆనందమయం

తనవారి నుండి వేరుచేసినా
తనువంతా ఛిద్రాలైనా వౌనంగా ఉంటుందా వెదురు?
మైమరిపించే మధురగానమై విన్పించదా వేణువు
బురద నీటిలో కూరుకుపోయాననీ
దిగులు పడుతుందా తామర?
తన విలువేంటో తెలుసుకుని వికసించదా
పరమాత్ముడి పాదాలు చేర
తనను తాను చూసుకుంటూ
చిరాకుపడి చింతిస్తుందా గొంగళిపురుగు?
చిత్రమైన వర్ణాల సీతాకోకచిలుకగా మారిపోదా?
చుట్టూ ముళ్లేనని చిన్నబోయి
ముడుచుకుపోతుందా గులాబీ?
కంటకాల్లోంచే అలవోకగా విచ్చుకుని
అత్తరు సువాసనలందించదా!
కొలిమిలో కరగడం కష్టమంటూ
కంటతడి పెడ్తుందా పసిడి?
అందులోంచే అందమైన నగగా అవతరించదా?
తనలో అగాధాలున్నాయని
అడుగుకే కృంగిపోతుందా సంద్రం?
ఉవ్వెత్తున ఎగిసే అలలతో ఉత్సాహంగా ఉప్పోంగదా
ఆటంకాలెదురైనా ఆగుతుందా నది పయనం?
పాయలుగా చీలయినా సాగిపోదా ప్రవాహం
అవాంతరాలెన్నీ ఎదురైనా ఆత్మవిశ్వాసంతో
అడుగు ముందుకేయడమే మనిషికి ముఖ్యం!
అప్పుడే అవుతుంది జీవితం ఆనందమయం!

- సిహెచ్.సుధారాణి
నాగులమల్యాల, సెల్.నం.9966172266
**

సంస్కృతి

ఓ యువత! మీరే దేశానికి భవిత
పగటి కలలు కనకండి
గాలి మేడలు కట్టకండి
పంచభూతాల దేహాన్ని
ప్రేమ పరిమళంలో బంధించకండి
పావురాల జంటలాగా
గాలిలో ఎగురాలనుకుంటే
గాలం వేసి లాగే వారున్నారు
కాలానికి ఎదురేగుతే
బ్రతుకే దుర్భరం చేస్తారు
ప్రేమంటేనే సర్వస్వం కాదు
పెళ్లంటేనే బతుకు కాదు
ప్రేమ పెళ్లిళ్లు నిలవాలంటే
పెద్దల ఆశీస్సులు ఉండాలి
దేశ భవిత కోసం
మీరే మార్గం చూపాలి
ముందుతరం నిలువాలి
భారతీయ సంస్కృతి వెలగాలి

- జాధవ్ పుండలిక్ రావు పాటిల్
భైంసా, నిర్మల్ జిల్లా
సెల్.నం.9441333315