విజయవాడ

సంసారంలో కిరికిరి! (చిన్నకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీలో సంసారంలో కిరికిరీలు ప్రోగ్రాం వస్తోంది. ‘ఇంతకీ నువ్వేమంటావు వెంకయ్యా?’ అడిగారు జయప్రభగారు.
‘ఎంకన్న బాబే లచ్చమ్మ అలిగిపోతే ఎతుకుతూ నాంచారమ్మతో వెళ్లాడు. నేను ఆ దేవుని దారిలోనే ఉన్నాను. అది మాటిమాటికీ అలిగి పుట్టింటికిపోతే నేను మగాడిని పస్తులుంటానా? ఎవరో ఒకరిని తెచ్చుకుని నా తప్పు లేదంటాను’
‘నువ్వేమంటావే?’ అడిగారామె. ‘ఆడు మగాడైతే నేనాడదా న్ని. మగాళ్లని ఆడించేదాన్ని. వాడు డబ్బిచ్చుకుని తెచ్చుకున్నా డు. నాకంత అవసరం లేదు. కన్నుగీటితే చాలు. ఎంతటోడైనా పొర్లుకుంటూ వచ్చేస్తాడంతే. నేడబ్బివ్వనవసరం లేదు. పైగా నజరానాలు. ఆడిదే ఒప్పయితే, నాది తప్పెలాగౌతుందీ ? నేనూ రైటే!’ చెప్పింది. జడ్జీ ప్రభ తెల్లముఖం వేసింది. చూస్తున్న అందరిళ్లల్లో నవ్వులు విరబూశాయి. అందరికీ నచ్చిన ప్రోగ్రాం వెయ్యి ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న శుభసందర్భంగా రేపు ఉత్తమ వీక్షకులకి ప్రైజులు ప్రకటిస్తాం’ జయప్రభ ప్రకటించారు.
- చావలి సూర్యం, విజయవాడ.
**

పుస్తక పరిచయం

సామాంపాతు సరస్వతీ భగవతీ..
లక్ష్మీ అనుగ్రహం కలిగి సరస్వతీ కటాక్షం లేని వ్యక్తి సంపన్నుడిగా పేరు పొందుతాడు. అదే సరస్వతీ కటాక్షం కలిగినవాడు జ్ఞానవంతుడిగా గౌరవం పొందుతాడు. ధనవంతుడిగానూ మారతాడు. సంఘంలో పెద్దల పూజలు సైతం అం దుకుంటాడు. సరస్వతీ కటాక్షం ఉం టే చాలు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే పిల్లలకు సరస్వతీదేవి ఆలయాల్లో విద్యాభ్యాసానికి శ్రీకారం చుడతారు. విద్యాసిద్ధి కోసం ‘సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా’ అంటూ అమ్మవారిని పూజించి విద్య ను కొనసాగిస్తారు. సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి నామాలను జపరూపంగా పఠిస్తారు. సరస్వతీదేవి నామాల్లో ఒక టి ‘్భరతి’. ఈ నామాన్ని జపించినా, తలచినా చాలని అంటారు. ఇంకా విశేషం ఏమిటంటే అమ్మవారి ద్వాదశ నామాలు ఒక్కొక్కటి ఒక్కో ఫలితం ఇస్తాయి. ఆ నామాల విశేషం ఏమిటా? అన్నదాన్ని మనకు విశదీకరించారు రచయిత్రి.
సరస్వతి అంటే సరస్సు. సకల జ్ఞానాదిష్ఠాన దేవత. అనేక మంది ఋషులు, మునులు, సిద్ధుల వంటివారు ఈ జ్ఞానజ్యోతిని దర్శించటానికి అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. జ్ఞానసిద్ధి పొందారు. అలాంటి సరస్వతీదేవి శ్లోకమైన యాకుందేదు తుషారహరధలళా.. అనే శ్లోకానికి విస్తృత అర్థం రాశారు రచయిత్రి. ఇందులో వాగ్దేవి వ్యు త్పత్తి వివరం అంటూ సరస్వతీదేవి జననాన్ని మనం తెలుసుకోవాలంటే వాగ్దేవి వివరం చదవాల్సిందే. సరస్వతీదేవియే బ్రహ్మవిద్య. వాగ్రూపిణియైన సరస్వతిని బ్రహ్మ తన నాలుకపై ధరించినందువల్లే ఆయన సృష్టి చేయగలిగాడు. అలాంటి జగన్మాత విశిష్ఠతను తెలుసుకోవాలనే జిజ్ఞాస అందరికీ ఉంటుంది. మరి ఆమె మహిమను తెలసుకోవాలంటే ఎలా? సరస్వతీదేవి పద్మం మీద ఎందుక్కూర్చుంటుంది?.. అనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి దానికి సమాధానం కావాలంటే.. శ్రీ సరస్వతీదేవి పద్యాలు, ప్రార్థనలు మనం విన్నాంకాని సరస్వతి సూక్తాలు తెలుసుకోవాలంటే మనందరం శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు స్వీయ అనుభవంతో రాసిన ‘సాయాంపాతు సరస్వతీ భవగతి’ అనే పుస్తకం చదవాల్సిందే. ఇంకా ఇందులో సరస్వతి ప్రార్థన, గణీకృత వాసర సరస్వతీ స్తోత్రమ్, సరస్వతి పూజాధ్యానం మొదలైనవి భక్తులకు అందించారు. సరస్వతి అనుగ్రహం కోరుకోనేవారు ఈ పుస్తకం ద్వారా తమకు కావాల్సిన విధానం ద్వారా అమ్మ అనుగ్రహం పొందవచ్చు.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122
**

మహాకవి శ్రీశ్రీ కవితకు
సలాం చేద్దాం రండి!

*ఏప్రిల్‌లో శతాధిక కవుల కవి సమ్మేళనం

రెండు తెలుగు రాష్ట్రాల కవులతో ‘శతాధిక కవుల ఏకదిన కవి సమ్మేళనం’ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో జరగనుంది. విజయవాడలో ఏప్రిల్ 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు మహాకవి శ్రీశ్రీ కవితకు సలాం చేద్దామని కవులను, సాహితీ సంస్థలను సాంస్కృతీ సమాఖ్య (యువ సాహితీ వికాస వేదిక) ఆహ్వానిస్తోంది. సమాజం, కళాభివ్యక్తి మారుతున్నాయి. చదువు, సౌందర్యం, కళ, సాహిత్యం, శాస్త్రం, శ్రీమ అమ్ముడుపోతున్నాయి. ఈ పరిణామంలోని ‘వ్యథార్థ జీవిత యధార్థ దృశ్యాలు’ నేపథ్యంతో మూడు కవితలు రాసి పంపాల్సిందిగా నిర్వాహకులు ఒక ప్రకటనలో కవులకు విజ్ఞప్తి చేశారు. హామీ పత్రం, చిరునామా, కవి ఫొటో, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి వివరాలన్నీ జతపరచాలి. ఇది పోటీకాదు. పాల్గొనే కవుల ఉత్తమ భావిదీప్తికి ముఖవాణిగా జరిగే కవి సంగమం. కవితా పఠనం చేసిన కవితలను ‘సాహితీ స్రవంతి’ 6వ కవితా సంకలనంగా 2017 సెప్టెంబర్‌లో ఆవిష్కరిస్తుంది. మార్చి 31వ తేదీ లోపుగానే ‘వి శిరీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, సాంస్కృతీ సమాఖ్య, విజయవాడ - 521212’ చిరునామాకు కవితలు పంపాలి. పాల్గొనే ఆసక్తి ఉండి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9985785322 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సాంస్కృతీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి వి శిరీష్‌కుమార్ వివరించారు.