విశాఖపట్నం

మాతృభూమి గొప్పదనాన్ని చాటే దూరాలు దగ్గరవ్వాలి ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంతో పోల్చుకుంటే వర్తమానంలో నవల, కథల పఠనం కొంతమేర తగ్గింది. ఈ పరిణాం వల్ల ఔత్సాహిక రచయితలు, చేయి తిరిగిన రచయితలపై మరింత భారం లేదా బాధ్యత పడిందనే చెప్పాలి. కొంతమంది తమ రచన పేరొందిన పత్రికల్లో అచ్చయ్యాక పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకొందరు ఉత్సాహంతో పుస్తకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. తీరికలేని పాఠకుడు ఈ రెండో రకం నవల్లోకి వెళ్ళేముందు ఏదైనా పత్రికల్లో పడిందా లేదా అని పరిశీలిస్తాడు. అలా పడితేనే ‘హిట్టు’ అనే భావం పాఠకుల్లో లేకపోలేదు.
విశాఖపట్నం రచయిత అడపా రామకృష్ణ ‘దూరాలు దగ్గరవ్వాలి’ అనే తన నవలలో కథాంశం పాతదైనా ‘దేశభక్తి’ గోచరిస్తుంది. భారతదేశంలో ఉన్న ఓ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ధనుష్ అమెరికా చదువు కోసం వెళ్ళి స్థిరపడతాడు. భార్యాభర్త సంపాదన పరులే. వీరి ముద్దుల కూతురు భారతి. పుట్టిన గడ్డపై ఉన్న మమకారంతో ధనుష్ కుమార్తెకు భారతి అని పేరు పెట్టాడు. కానీ, ఆమెలో అన్నీ విదేశీ అలవాట్లే ఉంటాయి. భయపడ్డ ధనుష్ మళ్ళీ సొంతూరు అదే ఇండియాకు వెళ్ళిపోయి, ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుదామని తలుస్తాడు. ఆర్థిక సమస్యల వల్ల ఛిద్రమైన తమ ఉమ్మడి కుటుంబాన్ని, ఏళ్ళ నుంచి సంబంధాలు తెగిపోయిన బంధుత్వాలను మళ్ళీ పునరుద్ధరించుకుందామని అనుకుంటాడు. భార్య, కుమార్తెకు విషయం చెప్పి, ఇక్కడున్న స్నేహితుని సలహాతో ఇండియా వస్తాడు.
సొంతిల్లు ఉండాలనే క్రమంలో స్నేహితుడు చెప్పిన మరో వ్యక్తి అమర్‌జీ సాయం తీసుకుంటాడు. అయితే ఇల్లు కొనుగోలు సమయంలో అమర్‌జీ కమీషన్ కోసం కక్కర్తి పడ్డాడని తెలుసుకుని విభేదిస్తాడు. కారు డ్రైవర్ సుందరం వల్ల అమర్‌జీ సంగతులు ధనుష్‌కు తెలుస్తుంటాయి. తర్వాత ఆయన సాయం లేకుండానే ఇల్లు కొంటాడు. ధనుష్ భార్య శృతి లౌక్యం వల్ల ధనుష్ అమర్‌జీ వల్ల సేవ్ అవుతాడు. ఇవన్నీ మొదట్లో భారతికి ఇష్టం ఉండదు.
వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు ధనుష్. ఓ ప్రకటనతో శ్రీ్ధర్‌ని కలుస్తాడు. శ్రీ్ధర్ మరో వ్యక్తి సంపత్ గురించి చెబుతాడు. ఇలోగా భారతి, శ్రుతి ఉన్నప్పుడే శ్రీ్ధర్‌కు తమ పూర్వపు కుటుంబం సంగతులు చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత అమర్‌జీలానే శ్రీ్ధర్‌పై కూడా ధనుష్‌కు సదభిప్రాయం తగ్గుతుంది. మొత్తమీద వ్యాపారం చేయాలనుకున్న ధనుష్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. హాయిగా అమెరికాలో ఉండక ఇక్కడికి వచ్చి ఈ పాట్లు ఏమిటని మానసికంగా బాధపడతాడు. కానీ ఈ రచనలో ధనుష్ ప్రభుత్వ అధికారులను ఎందుకు సంప్రదించలేదు అనే విషయం పాఠకునికి అర్థం కాదు. ఇంత అలజడిలో ఉన్నా అక్కడక్కడ మితిమీరిన వర్ణనలు చదువరులకు విసుగు తెస్తాయి (పేజీ 57, 58). నవల కథాంశం 60వ పేజీ నుంచి కొంత ఆసక్తిగా సాగుతుంది.
ఒకప్పటి సొంతూరు విశాఖపట్నం రావడంతో చిన్ననాటి జ్ఞాపకాలు ధనుష్‌కు స్ఫురణకు వస్తాయి. అష్టకష్టాలు పడి తన పాత ఇంటికి చేరుకుని, తన మామయ్య గోపాలం, అత్తమ్మ పూర్ణ, వీరి కొడుకు దినేష్‌ను కలుసుకుంటారు. కుటుంబ సంగతులు మాట్లాడుకుంటారు. దినేష్, భారతి స్నేహితులవుతారు. అసలు సంగతికి వస్తారు. ఇక్కడ పడిన కష్టాలు ధనుష్ వివరిస్తాడు. ఇన్ని కష్టాలు బదులు తిరిగి అమెరికాకు వెళ్ళిపోవడం మంచిదని ధనుష్ గోపాలం ముందు తన నిర్ణయాన్ని పెడతాడు. అప్పుడు గోపాలం హితబోధ (పేజీ 98లో రెండో పేరా) ఆకట్టుకుంటుంది. అలాగే ధనుష్ పలికిన అమెరికా వాస్తవగాథ (పేజీ 99) పాఠకునికి తెలుస్తుంది. దీంతో ధనుష్ నిర్ణయం మార్చుకుని ఇండియాలో స్థిరపడడానికి నిశ్చయించుకుంటాడు. గోపాలరావు ధనుష్‌కు ఇచ్చిన భగవద్గీత వారిని మంచివైపు నడిపిస్తుంది. గోపాలరావు కొడుకు దినేష్‌తో భారతి వివాహం జరుగుతుంది. అయితే, ముఖచిత్రం అమెరికా అమ్మాయి బొమ్మ పెట్టారు. ఈ బొమ్మనే ‘్భరతి’ అని పాఠకుడు భావించుకోవాలా?
- గున్న కృష్ణమూర్తి

ప్రతులకు
అడపా రామకృష్ణ,
43-21-21, వెంకటరాజునగర్,
దొండపర్తి, విశాఖపట్నం-530016,
ఫోన్లు-0891 2540848, 9505269091.
**

తడి ఆరని కవిత్వం

‘శ్రమజీవుల చెమట తడిని వెదుకుదాం... కష్టజీవుల తడిలో కాలాన్ని నిలుపుదాం, నా లోలోన కలతే తడి, బరువెక్కిన బాధల తడి, ఇలాంటి తడి గుండెలను చూద్దాం రండి... వెదికి వెదికి ఆ గుండెలను ఓదార్చుదాం రండి’ అంటూ పిలుపునిచ్చిన కవిశ్రీ అంబటి నారాయణ బడుగు జీవుల ఆక్రందనను, ఆవేదనను పరికించి, ఆర్ద్రత చెందిన హృదయాన్ని తెరచి, అక్షరాలతో ఆహ్వానిస్తున్నారు.
ఈ తడి కావ్యం 58 కవితల సమాహారమై ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ ప్రజాకవి జనజ్వాల, డాక్టర్ సి. కాశీం వంటి లబ్ధప్రతిష్టుల ముందు మాటల ముత్యాల మూటలతో వెలువడింది.
కాకిది మానవ సంబంధంతో ముడిపడిన జీవితం. మనుషుల మధ్య మానవత్వాన్ని తెలుపుతుంది. కల్మషత్వాన్ని తొలగిస్తుంది. పిండ ప్రదానం చేసే వేళ దానిని ముట్టి గతించే వారి ఆత్మలకి శాంతి నందిస్తుంది. అందుకే మానవ లోకానికి దూరపు చుట్టంగా అల్లుకుంటూ అవసరానికి ఆదుకుంటుంది. పక్షి దేహమైనా మానవత్వపు మార్గంలో నడిచి మనుషులను మేల్కొలుపుతాయంటున్న కవి పంక్తులు అక్షరసత్యాలు. మన చుట్టూ ఉన్న ప్రాణికోటి అందిస్తున్న సేవలు అమూల్యాలు. మనిషి వాటి నుండి ఎంతో నేర్చుకోవలసి ఉంది.
నీ అందమైన ఊహల ప్రతిరూపాన్ని ఉమ్మనీటిలో గుండెను తడుపుకుని కొత్త ప్రపంచాన్ని చూడాలని వస్తున్నా, నిన్ను మోసం చేసి ఏ కాముకుని జ్ఞాపకాల గుర్తునో, నన్ను వదిలించుకోవాలని, చంపాలని చూడకమ్మా! అంటూ భ్రూణహత్యలను నిరసిస్తూ ఖండిస్తూ రాసిన కవిత నేటి సామాజిక దుర్బుద్ధికి సాక్ష్యంగా నిలుస్తుంది.
‘పల్లె పిలిచింది’ స్వర్గం కన్నా మిన్న మీకు జన్మనిచ్చిన గడ్డ అనడంలో స్వదేశంపై ప్రేమ కమ్ముకొస్తుంది బతుకమ్మ కవితలో. కష్టజీవుల కన్నీటి బొట్లతో, నీ పారాణి పాదాలు కడిగి, దీపాన్ని వెలిగించి నీ పాదాలు తాకిన నేల నాకు సర్వస్వం అనడంలో ఆ దేవతపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాలు స్పష్టమవుతాయి.
దేవుడంటే అమ్మ రూపమే, అమ్మ పదంలో ఆత్మీయత అమృతం ఉన్నాయి. అమ్మ రుణం తీర్చలేనిదని కవి తన కృతజ్ఞతను ప్రకటిస్తారు. శ్రమజీవుల్ని చైతన్యపు వారసలు, సమాజానికి పునాదులంటారు. ఆయుధమై లేవరా, అడుగు ముందుకేయరా అంటూ యువశక్తిని మేల్కొలుపుతారు.
అక్షరాలు దిద్దాల్సిన చేతులు చెత్త కుండీలో చెత్తను తోడుతున్నాయి. చదువు సంధ్య లేకపోయె, సంసారం దు:ఖభాజనమాయె, పేదరికం చీకటి బ్రతుకులో- అంటూ కవి ఆక్రందిస్తారు ‘రేపటి పౌరులు’ కవితలో.
ప్రజల కొరకు బతుకు, ప్రజల కొరకు చావు అదే నిజమైన నాయకుడి లక్షణమని నిర్భయంగా గర్జిస్తారు కవి.
బాల్యం పోయింది, బాధలు మిగిలాయి. ప్రాయం వచ్చింది పరుగులు తీయించింది. గుండె తడిలో జీవితాన్ని పండించుకోవాలి. అన్నార్తుల ఆర్తనాదాలకు కలం ఒక ఆయుధం, పేదల ఆకలి ఒక ఆయుధం, పీడితవర్గ పిడికిళ్లే ఒక ఆయుధం, అన్నిటికీ నా కలమే ఆయుధం అంటూ నినదిస్తారు కవి తన కవితల్లో.
కత్తుల కాలాన్ని మీ ముందుంచి తుపాకుల తోరణాన్ని మీ గుమ్మానికి వేలాడదీస్తానంటున్న కవితలో మానవాతీతవాదం తొణికిసలాడుతుంది. కవిని అభినందిస్తూ మరిన్ని కావ్యాలను వెలువరించాలని ఆకాంక్షిద్దాం.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 9293327394.
సాహితీ సుషమ
**
వ్యాసాలు, పీఠికలు

ప్రతులకు
దేవళ్ల చిన్నికృష్ణయ్య,
13/7, తణికాలం వీధి,
ట్రిప్లికేన్, చెన్నై-600005.
ఫోన్ - 044-28440406.
**
తెలుగు భాషకు పట్టం కట్టినట్లు తీర్చిదిద్దిన మహానుభావులెందరో అందరికీ సాదర ప్రణామములు అంటూ బ్రహ్మశ్రీ దేవుళ్ల చిన్నికృష్ణయ్య తనదైన శైలిలో విరచించిన ‘సాహితీ సుషమ’ తెలుగు భాషకు మకుటయమానంగా భాసిల్లుతుంది. తెలుగు సాహిత్య చరిత్రను ఆమూలాగ్రం శోధించి అనర్ఘరత్నములను మనకందించిన ఘనత చిన్నికృష్ణయ్యది. ఆంధ్ర భాషా సాహితీ శీర్షికన ‘యానేవ శబ్దాన్ వయమాల పామ: ఆంధ్రత్వమ్ - ఆంధ్ర భాషాచ’ అంటూ తెలుగు జగతి ప్రత్యేక సంచికల సారాంశం, కావ్య భాషా ప్రశంస- ప్రతిభాత పరిణామాలు, ‘తిక్కన అద్వైత వైచిత్రి’, ప్రముఖాంధ్ర నూరవ ప్రత్యేక సంచిక సారాంశం, ఇక ప్రబంధ సాహితీ శీర్షికన తమిళనాట 1995, 2001లో, 10, 11వ తరగతులకు చెందిన పాఠ్యాంశాలు, అష్టదిగ్గజ కవుల సాహిత్యం, పాండురంగ మహాత్మ్యం ప్రబంధానికి చెందిన సుశీల కథ, శ్రీరామకృష్ణ వజ్రోత్సవ సంచిక ప్రబంధ సాహితీ భక్తిసీమలు... ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నికృష్ణయ్య రచనలు అనేకం. వారి రచనలు విజ్ఞానదాయకాలు, సారస్వత కరపీటికలు అని చెప్పవచ్చు. రెపరెపలాడుతున్న తెలుగు భాషా సాహితీ జ్యోతిని జ్వాజ్వలమానం చేయడంలో వారి రచనలు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు. సాహిత్య పిపాసుకులకు అమూల్య కానుకగా అందించిన ఇంతటి సద్గ్రంధాన్ని ఆదరించి, వారి ప్రతిభను కొనియాడక తప్పదు.

- మండా శ్రీ్ధర్,
గోవిందనగర్‌కాలనీ,
శ్రీకాకుళం-532001.
సెల్ : 9493309030.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.