నెల్లూరు

హాస్యకథ సత్యానే్వషణ సూపర్ ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో ప్రచురించిన సత్యానే్వషణ కథ చాలా బాగుంది. కథ ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నాను. కథలోని సంభాషణలు చాలా బాగున్నాయి. ఉదయం పేపర్లు చదవడం దగ్గర నుంచి టీవీ కార్యక్రమాల విశే్లషణ, సెటైర్లు అన్నీ కడుపుబ్బ నవ్వించాయి. చిదానందం, సదానందం పాత్రల చిత్రీకరణ ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంది. ప్రస్తుతం సమాజంలో టీవీల ప్రభావం ఎలా ఉందో హాస్యభరితంగా వివరించారు. అలాగే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా వుండి పాఠకులు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక సతమతమవుతున్న విధానాన్ని బాగా కుదిర్చారు.
- వేల్పుల రజని, నెల్లూరు
- అల్లం శశిధర్, తిరుపతి

మొక్క గొప్పతనాన్ని చాటిన ఉపకర్త
ఒక మొక్కకు నీళ్లు పోసి పెంచితే అది మనకు ఏరకంగా ఉపయోగపడుతుందో చక్కగా వివరించి మొక్క గొప్పతనాన్ని వివరించిన కవిత ఉపకర్త. నిజంగా మొక్కకు మనం జీవితాంతం మొక్కినా రుణం తీరదు. అంతటి గొప్ప ఉపకర్త మొక్క. కవిత ప్రారంభమే గొప్పగా సాగింది.
- ఆల్తూరి సాయిబాబా, వింజమూరు
- కందుకూరు సత్యనారాయణ, దర్శి

ఆకట్టుకున్న కాలం కొత్తదనాన్ని గెలిచారు
గత వారం మెరుపులో చాలాకాలం తరువాత దుగ్గినపల్లి ఎజ్రాశాస్ర్తీ గారి కవితను చదివాము. కవిత ఆధ్యంత్యం ఆకట్టుకునేలా సాగింది. గొప్ప భావాన్ని అందించిన రచయితకు ధన్యవాదములు.
- అయినాబత్తిన ఘనశ్యాం, చీరాల

**
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net