ఉత్తర తెలంగాణ

న్యాయం కోసం.. (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా
సాహసమే ఊపిరిగా
న్యాయం కోసం పోరాడు!
అలసిపోక, అదిరిపోక.. ముందుకు సాగు!
అవినీతిపరుల భరతం పట్టు
నిజాయితీకి పట్టం కట్టు..
వంచనకు గురయితే..
పడి లేచే కెరటంలా
పోరాట పటిమకు శ్రీకారం చుట్టు!
నువ్వు చేస్తున్న పోరాటం న్యాయమని..
నీ అంతరాత్మ చెబుతుంటే..
ఇంకా బెదురెందుకు?
ధైర్యానే్న ఆయుధంగా మలుచుకో
అనుకున్నది సాధించుకో..!

- ఎస్.్భరతి మూర్తి
మంచిర్యాల, సెల్.నం.9949777657
**
కూలిన బతుకులు
పట్టెడన్నం దొరకని కూలి పనితో
పొట్ట చేతపట్టుకొని
పుట్టెడు కష్టాల్ని భుజాన వేసుకొని
పట్నంలో బతుకుదామని
ఉన్న ఊరును కన్నవారిని ఒదిలి పెట్టి
ఊర్లెంబడి తిరుగుతున్న కష్టజీవులు
వంచిన తల ఎత్తకుండా పనిచేస్తూ
వంచన తెలియని మంచివాళ్లు
పొంచి ఉన్న ప్రమాదాన్ని
పసిగట్టలేని అమాయకులు..
కొండ చరియల్లాంటి సిమెంటు తునకలు
పిడుగుల్లా విరుచుకుపడుతుంటే
పేకమేడల్లా అవతారమెత్తిన భవన సముదాయం
రెప్పపాటు కాలంలో
అంతా కుప్పకూలిపోయింది
పిల్లలతోపాటు పెద్దలు
తలో దిక్కున చెల్లాచెదురవుతూ
నేలకొరిగిన అంతస్తుల పునాదుల్లో
సమాధులయ్యారు
బుట్టల్లో సరుకున్న బువ్వ మట్టిపాలయ్యింది
బంగారు భవిష్యత్తుపై కాలనాగు కాటువేసింది
అవినీతి దోసిళ్లతో ధనదాహం తీర్చుకుంటున్న
అక్రమ నిర్మాణపు కాంట్రాక్టుల్లారా..
నాణ్యతలేని అనుమతి రాని కట్టడాలకు
స్వస్తి పలకండి
ముచ్చటైన పాలనకు మచ్చతెచ్చేలా
పచ్చనోట్లను వెదజల్లి పండుగ చేసుకోకండి..!!

- రాకుమార గోదావరిఖని,
పెద్దపల్లి జిల్లా, సెల్.నం.9550184758
**
మైదానం

క్రీడ ఏదైతేనేం?
బతుకు పోరాటంలో అది
కడదాకా నిలిచే ఓ వేదిక!
అది గెలుపు ఓటములే కాదు..
మంచి చెడులు
ఎత్తులు పై ఎత్తులు
నేర్పించే ఓ ప్రాంగణం!
ఒంటిని స్వేదంతో నింపి
నీలోని మలినాలను కరిగిస్తూ
ఎప్పటికప్పుడు..
నిన్ను మనిషిగా తీర్చిదిద్దే కార్యస్థలం!
పోరాట పటిమను పెంచి
నాయకత్వ లక్షణాలను నేర్పించి..
క్రీడా స్ఫూర్తిని నింపి..
నిన్ను ముందుకు నడిపించే
మార్గదర్శి.. మైదానం!

- జలదంకి హిరణ్మయి
కామారెడ్డి, సెల్.నం.9440798954
**

కవితా లేఖ

దేవీ!
ఆనాడు మొదటిసారిగ నిను చూడగానే
నీ చూపులు నా చూపుల్ని పలకరించిన
శుభతరుణాన నా మదిలో తలచితి
ఎటులైనా నినే్న పరిణయమాడవలెనని..
ప్రాణేశ్వరీ!
నీవు మొదటిసారిగా మాతృమూర్తిగా మారి
నా కనుల ముందు ప్రత్యక్ష(మై) మయిన
శుభ తరుణాన, విదేశయానమునకైనాకు
ఆహ్వానము వచ్చినది అప్పుడే..
చెలీ! సఖీ..శ్రీలేఖా
నీనుండి విడివడి విదేశములకు
పయనమయిన నాడు
సామాన సమునీ చెంతన నిలిచి పోగా
అడుగులు తడబడ వెనుకకు వెళ్లుపాదముల
నెటులో ముందుకే సాగమంటూ..
అయిష్టముగనే ఆదేశించినాను..
ప్రియా! నీవు వీడ్కోలడిన నాడు
మబ్బు చాటు చందమామలా
ముచ్చటైన నీ మోము చంద్రుని
దాచితివి మూసిన అరచేతులలో...
ప్రియతమా!
నీవు నవ్వుతూ నాకు వీడ్కోలు పలికినా
నీ కనులలోని విషాదము
రాలిపడు భాష్పములను
తిలకించినాను, మూగనైనాను..
ఓ చెలీ!
శోకముతో అదురుచున్న గుండెలు
కంపించు అధరములను
నానుండి దాచుటకై నీ మోమును
పయ్యెదపరాలో దాచినావు..
రాగమరుూ!
విదేశముల కేగవలయునను నా ఆకాంక్షను
మొదటే నీకు తెలిపిన మన మనువు
ఆగిపోవునను శకంతో మాత్రమే
దాపరికము చేసితినిగానీ
నీ నుండి దాచవలయునను కాదు సుమా!
ప్రియతమా!
మన ఇరువురి హృదయాలొకటైనా
మాత్రముననే ఏమయినది
మనముద్దు కొన గొప్పవాడుగ
రాణించవలయునన్న మనము పది మందిలో
కీర్తినందవలయునన్న
డబ్బు (్ధనము) కావలయును గదా సఖీ యోచించుము హృదయేశ్వరీ!
మన కోరికలు నెరవేర వలయునన్న
మన భవిత బంగారు బాట కావలయునన్న
కొన్నినాళ్లు విరహమోపవలయును గదా..
అన్నీ తెలిసిన నీకది కూడా తెలియునని నా భావన..
అలకమాను చెలీ..
నా కలలో ప్రత్యక్షమై నీ సరదా కబుర్లు
కమ్మని పాటలు, చిలిపి చేతలు
నాకు వరంగా ప్రసాదించమని కోరుతూ...

- గరిశకుర్తి శ్యామల, హైదరాబాద్, సెల్.నం.9490189081
**
ఆభరణం!

ఒక జ్యోతితో
మరియొక జ్యోతిని వెలిగించినట్లు..
చీకటి ఆవరించిన
హృదయాలను కరుణతో
చిన్ని ఆశను చిగురింపజేయాలి!
మాటల్లో మాధుర్యం నాట్యమాడాలి
నవ్వుల మకరందాలతో
అందరినీ అలరించాలి!
అనురాగ మాలికలతో
పాషాణ హృదయాలను కదిలించాలి..
మంచితనమే
మనిషికి ఆభరణం కావాలి!

- బొమ్మకంటి కిషన్
కరీంనగర్, సెల్.నం. 9494680785