దక్షిన తెలంగాణ

రేపటి పౌరులు రాసిన కథలు! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 108, వెల : 50/-
ప్రతులకు: ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ హైస్కూల్
ముస్తాబాద్-505404
రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9440676048
**
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బడిపిల్లలు రాసిన కథలను ఏర్చి, కూర్చి గరిపెల్లి అశోక్ సంపాదకత్వంలో ‘జామపండ్లు’ పేరుతో ఓ కథా సంకలనం వెలువరించారు..కలం పట్టి కథలు రాసిన రేపటి పౌరుల సృజనకు అద్దం పట్టేలా ఇందలి రచనలు కొలువుదీరాయి! పిల్లల్ని చదువుకే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి ముస్తాబాద్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ అధ్యాపకులు అశోక్ చూపిన చొరవ ప్రశంసనీయం! ముద్దుగొలిపే ‘జామపండ్లు’ పేరుతో ముస్తాబై వచ్చిన ముస్తాబాద్ బడి పిల్లల కథలు పాఠకులను అలరిస్తాయి..‘జామపండ్లు’ శీర్షికతో పిట్ల అజయ్ కుమార్ రాసిన కథలో..జామపండ్ల పోషక విలువలు మరియు పిల్లలు అందరు కలిసి జామపండ్లు తినడంలోని ఆనందాన్ని చక్కగా ఆవిష్కరించాడు.
గొప్పలు చెబితే తిప్పలు తప్పవన్న కథను కూడా పిట్ల అజయ్ చక్కగా తీర్చిదిద్దాడు. ‘మనసెరిగి మసలుకొండని’ చెబుతూ ‘బాలవాక్కు’, ‘పక్షి నేర్పిన పాఠం’ ‘రైతు మిఠాయి’, ‘బహుమతి తెచ్చిన మార్పు’, ‘రెండు కోతులు’, ‘ప్రాణదాత’ తదితర కథలను మద్దికుంట సాయికృష్ణ చక్కగా రూపుదిద్దాడు. అలాగే బద్దిపడిగె దామోదర్ రాసిన ‘తప్పిన అపాయం’, ‘చీమ శాపం’, మంచి నీతిని మోసుకొచ్చాయి. కావటి రమ్య రాసిన ‘కనువిప్పు’, ‘పులిరాజు’ కథలు ఆలచనాత్మకంగా వున్నాయి..
పాశికంటి సాయినాథ్ రాసిన ‘కోతి కృతజ్ఞత’, ‘దురాశ’, ‘మార్పు తెచ్చిన అబద్ధం’, ‘అడవి జంతువుల ప్రతిజ్ఞ’, ‘నిజాయితీ’, ‘తెలివైన కుందేళ్లు’ కథలు సందేశాత్మకంగా వున్నాయి.. చెక్కపల్లి బాబు రాసిన ‘తప్పులు’, ‘బాబు కల’, బాలసాని మేఘన రాసిన ‘సీత జామచెట్టు’, ‘దుష్టులకు దూరంగా’ కథలు మంచి నీతిని ప్రబోధించాయి. ఎదునూరి వౌనిక రాసిన ‘తోడేలు తీర్పు’, గంధం లత రాసిన ‘నీళ్ల సహాయం’, వరద భవాని రాసిన ‘మంచి విద్యార్థి’ ఎదునూరి భాస్కర్ రాసిన ‘బుద్దికొచ్చిన పిల్లలు’ కథలు ఈ సంకలనానికి నిండు శోభను కూర్చాయి.
ఇంకా ఇందులో.. మాదాసు మహేష్ రాసిన ‘పరీక్ష (్ఫజు)’, లోకం భానుచందర్ రాసిన ‘మిత్రలాభం’, కొత్తపెల్లి దివ్య రాసిన ‘ఏనుగు చెప్పులు’ కథలున్నాయి. ఇవే కాక..‘ముసలమ్మ మాట’ కథను పుల్లూరి హరికృష్ణ రాసిన అందరినీ మెప్పించాయి. ఆరుట్ల సంతోషి ‘జంతువుల కబడ్డీ’ కథను చక్కగా తీర్చిదిద్దింది. వీటితో పాటు బట్టు నవీన్ ‘స్నేహబంధం’, ఎదునూరి శ్రీనివాస్ ‘రంగయ్య కల’, కంతుల రజనీకాంత్ ‘వనలక్ష్మీ’, గాండ్ల సంతోష్ ‘కలిసి మెలిసి’, చెవుల రంజిత్‌కుమార్ ‘ముసలమ్మ కోరిక’ కథలు ఇందులో వున్నాయి. ఆయా కథలకు గీసిన చిత్రాలు బాగున్నాయి. ఈ చిన్నారులను ప్రోత్సహించినట్లయితే మంచ కథా రచయితలుగా ఎదగడానికి అవకాశముంది. పిల్లలు తమ గురువుల మార్గదర్శనంలో సృష్టించిన ఈ కథల్లో అనేక అంశాలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా వున్నాయి. ప్రతి గ్రంథాలయంలో వుండదగినది. ప్రతి పాఠశాలలోనూ ఉండదగిన గ్రంథమిది! బాల సాహిత్యం అనుకున్నంత రాని ఈ కాలంలో బాలలే తమ సాహిత్యాన్ని తయారు చేసుకోవడం స్వాగతించదగింది.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544