రాజమండ్రి

కలా! నిజమా! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్రావుది రాజమహేంద్రవరం. బి.కామ్ చదివి, ఓ ఆఫీస్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. అవ్వట్లేదు. ఓ రోజున అన్నీ కుదిరాయి. వాళ్లు అమ్మ, నాన్న జాతకాలు బాగా లేవని వద్దన్నారు. ‘ఇలాగా’ జీవితంలో వుండాలి, ‘ఎలాగా’ జీవితంలో ఉండాలి, ఒకోసారి ‘ఇదేనేమో’ జీవితం అనుకునేవాడు.
ఇలాంటి సమయంలో ఒకమ్మాయితో పరిచయమైంది. రోజూ కోటిపల్లి బస్టాండ్‌లో కనబడుతూ ఉంటోంది. ఇద్దరి వివరాలు సరిగానే ఉన్నాయి. ఇద్దరి బాధలు ఒకేలా ఉన్నాయి. ఆమె సెల్‌ఫోన్ షాపులో కస్టమర్స్‌కి ఫోన్లు గూర్చి చెప్పే ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి పెద్దలు ‘ఓ.కే’ అన్నారు. పెళ్లయింది. రెండేళ్లు కావస్తోంది. కనబడిన ప్రతివాళ్లూ ‘పిల్లలా’ అని అడుగుతున్నారు. చెప్పలేకపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఓ రోజున శుభవార్త. మంచి మాటను స్వీట్స్ తింటూ పట్టుకొచ్చి చెప్పింది. ‘ఆఫీస్‌లో తల తిరుగుతోంది. వాంతులు వచ్చాయి. ఒకసారి లేడీ డాక్టర్‌తో చెకప్ చేయించుకున్నాను. మూడవ నెల అన్నారు. ఆ ఆనందంతో మనిద్దరికీ స్వీట్స్ తెచ్చాను!’ అంది పద్మావతి. ఆ ఆనందంతో గంతేశాడు. మరలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లాడు.
‘వేగంగా ఆటోను పిలిచి, నొప్పులు ఎక్కువైన పద్మావతిని ఆస్పత్రికి ఆటో ఎక్కించాడు.’ నెమ్మది. ఫరవా లేదు అన్నాడు. ఇటు పెద్దలు, అటు పెద్దలు వచ్చారు. నొప్పులు ఎక్కువయ్యాయి. పెద్ద కేక వచ్చింది. ‘క్యార్, క్యార్, క్యార్’ అంటూ కేకలు వినబడ్డాయి. పరుగెత్తుకుని వెళ్లాడు. ‘ఆడపిల్ల’ పుట్టింది. లక్ష్మీదేవి అనుకుని ఆనందించారు.
జో అచ్యుతానంద పాడితే ‘నవ్వుతోంది’. చందమామ రావే పాడితే ‘తొంగి చూస్తోంది’ బయటికి. ఇంగ్లీష్‌లో పాడితే ‘పూర్తిగా వింటోంది’. మనకు పుట్టిన పిల్ల ‘నేటి కాలానికి’ ప్రతినిధి’ అని వెంకట్రావు అనుకున్నాడు. పేరు పెట్టారు. లక్ష్మీదేవి, పద్మావతి లక్ష్మీదేవి పాత పేరు అని, ‘లక్’ నేటి పేరు, అదే పేరు ఖరారు అంది.
‘లక్’కి మూడేళ్లు వచ్చాయి.
పిల్లనీ ఆడించలేను. చూడలేను. లక్ వయసు వాళ్లని ‘స్టేజీల్లో, కేజీల్లో’ చేర్చాలి. ‘ఆయాలకి’ అప్పజెప్పాలి. ఎల్‌కెజి, యుకెజి, కిండర్‌గార్డెన్‌లలో చేర్చాలి. కిండర్‌గార్డెన్‌లో పిల్లల సంరక్షణ జాగ్రత్త చెప్పితే ‘వాళ్లే’ చూస్తారు అంది. ‘చేర్చడానికి కార్పొరేట్‌లో వేలకి వేలు కట్టాలి’ అన్నాడు ప్రిన్సిపాల్. ‘కంఠముడి దగ్గర మింగుడు పడుట లేదు.
ఎల్‌కెజి, యుకెజి లక్షలు అయ్యేలా కనబడుతోంది.
‘కార్పొరేటు చదువులు కర్మాగారాలు
ప్రభుత్వ పాఠశాల చదువులు ఓంకారాలు!
తల్లి భాషనే తొలగిస్తున్నారు.
పరాయి భాషనే పాడుతున్నారు’ అనే పాటను పాడుకున్నాడు.
భార్య విసుక్కుంది. ‘లక్’ కానె్వంట్ నుంచి రాగానే వెంకట్రావే ఆడించాలి. ‘తన జీతం ఎంత, పద్మావతి జీతం ఎంత, రెండింటినీ పోలిస్తే కార్పొరేట్ ఫీజు ఎంత’ అనుకున్నాడు?
పాలఖర్చు, ఇంటి అద్దె, సరకుల ఖర్చు, పెట్రోలు ఖర్చు, ఇవన్నీ చూస్తుంటే! తడిసి మోపెడంత అయ్యేలా ఉంది అనుకున్నాడు.
‘బాబోయ్’ పద్మావతీ! పద్మావతీ! పద్మావతీ!’ అంటూ అరిచాడు.
కళ్లు నులుముకుంటూ మెలకువలోకి వచ్చాడు.
‘ఇదంతా ‘కలేనా’! అనుకున్నాడు
అని పద్మావతితో కలగూర్చి అన్నాడు.
అపుడే పద్మావతి నెమ్మదిగా నడచి వస్తో, కాఫీ తెస్తో.. ‘ఎదర ఇది నిజమవుతుంది! అయనా అంత కెవ్వుకేక పెట్టారే’ అంటూ పెద్దగా నవ్వింది!

- పెమ్మరాజు సుబ్రహ్మణ్య గోపాల్
అమలాపురం, సెల్: 8500647281
**
ప్రేమ బంధం

సీత వంటింట్లో పనిచేసుకుంటుంటే ఏదో చెప్పాలని తపనతో కొడుకు రాజేష్ వచ్చాడు.
కొడుకు రాజేష్‌ని చూడగానే ఐదు నిమిషాలలో టిఫిన్ అయిపోతుంది అని చెప్పింది అసలు విషయం తెలియక.
టిఫిన్ గురించి కాదమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి ఆరు నెలలుగా చెబుదామని ప్రయత్నిస్తూనే ఉన్నా ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి చెయ్యి జారిపోతుంది సీత ముందు అయోమయంగా చూసిన కొడుకు మీద ప్రేమతో.
ఇంతకీ విషయం ఏమిటి? అంది లాలనగా తన తల్లి చెయ్యి పట్టుకుంటూ
అమ్మ నాకు హనీ అంటే ఇష్టం, నేను తననే పెళ్లి చేసుకుంటా?
ఒక్కసారిగా సీతకు అగ్నిపర్వతం బద్దలయ్యే లావాలో చిక్కినట్లుగా అన్పించింది.
హనీ ఒక క్రిస్టియన్, రాజేష్‌తోపాటు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుంది.
ఏంటి? రాజేష్ నువ్వు అంటున్నది తన మతం ఏమిటి?
మన మతం ఏమిటి? అంటూ వౌనంగా చేస్తున్న వంట ఆర్పేసి తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. రాజేష్ నిరాశ చెందాడు.
సీత భర్త జగదీష్‌కు విషయం చెప్పింది. జగదీష్ వివరణ ఇవ్వకుండా సీతనే నీ అభిప్రాయం చెప్పమన్నాడు.
మనం మంచి హోదాలో ఉన్నాము. ఈ మతంతర పెళ్లి వల్ల లేనిపోని సమస్యలొస్తాయి. మన కుటుంబం చీలిపోతుంది. చాలామంది మనతో మాట్లాడరు అంటూ ఆవేదన చెందింది.
మరోసారి సీత అర్ధమయినట్లుగా రాజేష్‌కి చెప్పింది, లాభం లేకపోయే సరికి సీత తన అన్నయ్యలకు, అక్కాచెల్లెళ్లకు కబురు చేసి రమ్మని చెప్పింది.
బంధువులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాజేష్‌ని మార్చడానికి ప్రయత్నం చేశారు. రాజేష్ మాత్రం హనీని తప్ప మరొకరిని చేసుకోనని తెగేసి చెప్పాడు.
వాళ్లందరికీ అర్ధమయ్యేలాగా తన ప్రేమ గురించి, ఎందుకు హనీ ఇష్టమో తెలియపరిచాడు.
హనీ నా ఆఫీస్‌లో జాయిన్ అయినప్పుడు నాలో ఎలాంటి ప్రేమ భావాలు లేవు. తొలిరోజే స్నేహితులయ్యాము. ఆరునెలలు గడిచిన తర్వాత ప్రేమ విషయం చెప్పింది. నేను కాదన్నాను. ఇలాంటివి వద్దు, మంచి స్నేహితులుగానే ఉందామని చెప్పాను. తనేమి బాధపడలేదు. ఇలా జరుగుతున్న సమయంలో నాకు ప్రమాదం జరిగింది. చాలా రక్తం పోయింది, అప్పుడు తనే నాకు రక్తం ఇచ్చింది. నేనున్న వారంరోజులు తను కూడా హాస్పటల్‌లోనే ఉంది. నాకు తను చేసిన సేవ ఎవ్వరూ చెయ్యలేనిది.
తను నన్ను ప్రేమిస్తున్నప్పుడు తన మతం నాకు గుర్తొచ్చింది. తను మాత్రం నాకు రక్తం ఇచ్చినప్పుడు ఎలాంటి మతంమైన ఆలోచన పెట్టుకోలేదు. ఇవన్నీ మీకు తెలియదు. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను అని మాత్రమే తెలుసు. అప్పుడే నా ఆలోచన మారింది. వెంటనే ఐ లవ్ యూ చెప్పాను. తను ఓకే చెప్పింది.
బంధువులు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బయట ప్రపంచం నాలుగు రకాలుగా అనుకున్నా వీళ్లు పెళ్లి చేసుకోవడమే ఉత్తమమని భావించి ఇరు కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుని తాంబూలం ఇచ్చిపుచ్చుకుని ఒకసారి అన్నవరం దేవస్థానంలో, మరోసారి చర్చిలో ఘనంగా పెళ్లి జరిపించారు. రాజేష్ హనీ ప్రేమబంధం పవిత్రంగా నిలిచింది.

- నల్లపాటి సురేంద్ర
సెల్: 9490792553
**
పుస్తక సమీక్ష
**
మతోన్మాద ఆగడాల్ని
ఎండగట్టే ‘జ్ఞానగుళికలు’!

రచన :
సింగంపల్లి అశోక్‌కుమార్,
పుటలు : 80
వెల : రూ. 60.
ప్రతులకు : ఆలోచన, 305, ప్రగతి టవర్స్, వీరయ్య వీధి,
మారుతీనగర్,
విజయవాడ - 520004
**
ఆధునిక తెలుగు సాహితీ రంగంలో అశోక్‌కుమార్‌లు చాలామంది కనిపిస్తారు. కానీ సింగంపల్లి అశోక్‌కుమార్ అంటే కొందరికి, ‘శ్రీశ్రీ అశోక్‌కుమార్’ అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. అంతటి శ్రీశ్రీ వీరాభిమాని అశోక్‌కుమార్. శ్రీశ్రీ స్ఫూర్తితో కలం పట్టి కవిత్వం రాస్తున్న వారిలో అశోక్‌కుమార్ ఒకరు. అలాగే ‘మినీ కవిత్వం’ ఉద్యమంలా మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఆ ప్రక్రియలో కవిత్వం రాస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ఇద్దరే. వారిలో అశోక్‌కుమార్ ఒకరనే సంగతి విడమర్చి చెప్పనక్కర్లేదు. అశోక్‌కుమార్ ఇప్పటి వరకు హేతువాద దృక్పథంతో 11 కవితా సంపుటాలు వెలువరించి పాఠకుల మన్ననలు పొందారు. ఇప్పుడు తాజాగా 12వ సంపుటిగా ‘జ్ఞానగుళికలు’ అందిస్తున్నారు. ఇందులోని కవితలు 1970-2016 కాలాల మధ్య రాసినవి అయినప్పటికీ అవి ఇప్పటి కాలానికీ సరిగ్గా నప్పేవే! నానాటికీ మతోన్మాదం పేట్రేగిపోయి ప్రగతిశీల వాదులపై, ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం తేవటం సరైన సందర్భమని సాక్షాత్తూ కవి అశోక్‌కుమార్ పేర్కొని, ఆయా ధోరణులపై నిరసన వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తం 60 హేతువాద మినీ కవితలున్న ఈ సంపుటిలో చాలా కవితలు పాఠకుల మనస్సులను సూటిగా తాకుతాయి. నిజాన్ని నిర్భయంగా తెలిపి, మసకబారుతున్న కళ్లను విదిలించి, పిడికిళ్లు బిగించి ఉద్యమించేలా ఉసిగొల్పుతాయి.
‘నీలోని నెత్తురు ఎరుపు/ నాలోని నెత్తురు ఎరుపు/ నువ్వూ, నేనూ వేరువేరని/ మతోన్మాదుల అరుపు’ అంటూ ‘మతహాసాన్ని’ సూటిగా చెప్పిన అశోక్‌కుమార్, ‘రాళ్లన్నీ మొక్కు/ దక్షిణలు కక్కు/ నెత్తిన నీకు/ శఠగోపం దక్కు’ అంటూ భక్తిపేరుతో కొందరు కుచ్చుటోపీ ఎలా పెడుతున్నారో వాస్తవాల్ని నిక్కచ్చిగా చెప్పటం పాఠకుడు ఇట్టే అర్థం చేసుకుంటాడు. అయితే గతంలో అశోక్‌కుమార్ రాసిన మినీ కవితలకు ఈ మినీ కవితలకు మధ్య కొంత తేడాను గమనించవచ్చు. సాధారణంగా మానవత్వాన్ని పెంపొందించేవి, మతోన్మాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసే కవిత్వాన్ని అందరూ అర్థం చేసుకొని మారవచ్చు, మార్చవచ్చు. కానీ ఈ ‘జ్ఞానగుళికలు’లో కొన్ని వివాదాస్పదమైనవి కూడా చేరటం గమనించవచ్చు.
‘మంత్రాలకు’ శీర్షికలో ‘ప్రభు ప్రార్థనలతో/ మనిషి స్వస్థత ఐతే సరి/ ఇన్ని మిషనరీ ఆసుపత్రులు/ ఎవరికో, ఎందుకో మరి’
‘హిందుత్వం సరేసరి’ శీర్షికలో ‘క్రైస్తవమ్ము ఐనా/ మహమ్మదీయమైనా/ ఉన్మాద పోటీలో/ నువ్వా నేనా?’
‘హంతక ఆయుధాలు’ శీర్షికలో ‘గుడి పూజారి కావచ్చు/ చర్చి ఫాదరు కావచ్చు/ మసీదు వౌల్వీ కావచ్చు/ ధనం దోపిడీ ఉచ్చు’
ఇలాంటి మినీ కవితల్లో వాస్తవం వుండొచ్చు కానీ, అత్యధిక ప్రజానీకం మనస్సులు గాయపడేలా కాకుండా, మత ప్రస్తావన లేకుండా మతవ్ఢ్యౌన్ని మాత్రమే ఎండగట్టేలా వుంటే బాగుండేదనిపిస్తుంది. అశోక్‌కుమార్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు మొదట్లో చెప్పుకున్నట్లు ఈ కాలంలో ప్రగతిశీల వాదులపై జరుగుతున్న మతోన్మాదుల దౌర్జన్యాలకు కలవరపడి రచయితల్లో ఇంతటి కోపానికి, ఆక్రోశానికి కారణమై వుండవచ్చని ఆలోచనాపరులు అర్థం చేసుకోగలరు.
- చలపాక ప్రకాష్,
చరవాణి : 9247475975