రాజమండ్రి

నవ్యాంధ్ర శారదా శాంతినికేతన్.. ఆచార్య రాయప్రోలు! (నివాళి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 13వ తేదీ కవిభూషణ్ ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి 125 వ జయంతి. ఆధునికాంధ్ర కవిత్వాన్ని సుసంపన్నం చేసిన భావకవి కోకిల స్వామి ఆయన. వారి పేరు చెబితే చాలు - ‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపింతునాడు’- అనే పద్యం గుర్తుకొస్తుంది. ‘ఏదేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీజాతి నిండు గౌరవము’ అనే దేశభక్తి గేయం వెంటనే స్ఫురిస్తుంది. అమలిన శృంగార సిద్ధాంతమొకటి జ్ఞప్తికొస్తుంది. తొలిగా వీరు తమ మేనమామ గారైన అవ్వారి సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారితో కలిసి అవధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చి, పద్య రచనలో ధారాశుద్ధిని సంపాదించుకున్నారు. వరుసకు పినతల్లి అయిన శ్రీమతి రామడుగు నరసమ్మ గారి వద్ద వెదుళ్లపల్లిలో పెరిగి, మన భారత రామాయణాదులలో స్ర్తి ఏవిధంగా సమస్యలకు గురయిందో ఆమె ద్వారా తెలుసుకున్నారు. అది భవిష్యత్తులో తాను ప్రతిపాదించబోయే అమలిన శృంగార సిద్ధాంతానికి ప్రాతిపదిక అయింది. రుద్రటుడనే సంస్కృతాలంకారికుడు ప్రతిపాదించిన ప్రయోరసమే రాయప్రోలు వారిచే ‘అమలిన శృంగారం’గా నరుూకరించబడింది! కథానిక, నాటకాది వచన సాహిత్య ప్రక్రియాపరంగా రాయప్రోలు వారు యుగకర్త అయ్యారు. శాంతినికేతన్‌లో రవీంద్రుని గురుత్వం వల్ల కూడా రాయప్రోలు వారి అక్షరాలు నవ్యాంధ్ర శారదానికేతనాలయ్యాయి. ‘కలసిన యంత మాత్రమున కాదుసుమీ! చెలికార మంతరంబుల నతుకంగ జాలిన అపూర్వపు లంకెయె స్నేహమ’న్న సిద్ధాంతమే అక్షరామల ‘తృణకంకణమ’యింది! ఆయన రచనలన్నీ ‘రమ్యాలోకన’ ‘మాధురీ దర్శనాలు’! ‘లలిత’ ‘స్నేహలతా’ ‘లావణ్య సరస్వతులు’! ఆంధ్ర భారతికి జడ అల్లి ‘జడకుచ్చులి’డిన నవ్యాలంకారికులు రాయప్రోలు వారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర భాషా సాహిత్యాచార్యులై ఎందరికో కవితాక్షర భిక్ష పెట్టిన మహనీయులు రాయప్రోలు వారు. ఆయనకు జన్మనిచ్చిన గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు గ్రామం ధన్యం - గణ్యం!

- హరితశ్రీ, చరవాణి : 9866944287