దక్షిన తెలంగాణ

కొత్త కవులకు అధ్యయనం అవసరం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందాళై రాఘవాచార్య
ప్రముఖ కవి, రచయిత
నిజామాబాద్
సెల్.నం.9908612007
**
కొత్త కవులు అధ్యయనంపై దృష్టి సారించాలని నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ కవి కందాళై రాఘవాచార్య అభిప్రాయపడ్డారు. 1969 నుండి నేటి వరకు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న ఆయన ఇంతవరకు కవితా సంపుటిని వెలువరించలేక పోవడం గమనార్హం! కొత్తలో భావ కవిత్వం రాసినప్పటికీ.. ఆ తరువాత సామాజిక చింతనతో అనేక రచనలు చేశారు. కందాళై రాఘవాచార్య వి.పి.చందన్ రావు గారితో కలిసి జంట కవులుగా భాసిల్లుతున్నారు.. యోగాచార్యులు లింగాల నారాయణ రుషి గారి జీవిత చరిత్రపై ఓ గ్రంథాన్ని ప్రకటించారు. గీతాంజలి అనువాదం చేశారు. అది అచ్చులో రావాల్సి వుంది. 20 వరకు కథలు రాసిన అనుభవం ఆయనకుంది. ‘ఇందూరు భారతి’ సాహితీ సంస్థలో క్రియాశీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆయనతో మెరుపు ముచ్చటించింది. వారితో జరిపిన ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం అందిస్తున్నాం.

ఆ మీరు కవిత్వం రాయడానికి ప్రేరణ ఏమిటి?
మాకు ఒక ఆలయం ఉండేది. ప్రతీ రోజు కవులు, పండితులు హరికథలు చెప్పే భాగవతార్‌లు వచ్చేవారు. వారి మధ్య సాగే సంభాషణలు కవిత్వం రాయడానికి మహాప్రేరణను ఇచ్చాయి!

ఆ మీ కవిత్వానికి వేదిక ఏది?
నేను 1969 మార్చిలో చక్రం గుడిలో సైలు ఒక కవిత చదివా! అది కేశనకూర్తి వీరభద్రాచారి, సైలు, బద్దూరి, సూర్యప్రకాష్ గార్లు విని నన్ను ‘ఇందూరు భారతి’కి ఆహ్వానించారు. ఇదే నా మాతృసంస్థ!..

ఆ మీరు కవిత్వం దేనిపై ఎక్కువగా రాస్తారు?
కొత్తలో భావకవిత్వం రాశాను. తరువాత అనేక మంది కవుల రచనలు చదివి పరిణతి చెంది సామాజిక స్పృహ గల రచనలు చేశాను.

ఆ ఇంతవరకు సంకలనం ఎందుకు వేయలేదు? మీపై అప్పటి-ఇప్పటి తరం చాలా ఆశలు పెట్టుకున్నారు కదా!
నిజమే! మేము కవిత్వం కొత్తగా రాస్తున్న కాలంలో ప్రింటింగ్ ధరలు బాగా ఉండేది. అయినా పరిపక్వత రాలేదు అనిపించింది. అనేక పత్రికల్లో అచ్చయినాయి. కన్నడం, ఆంగ్లం, హిందీలో కవితలు అనువాదాలైనాయి. మురిగొండ వీరభద్రయ్య గారు నా కవిత్వంపై ప్రముఖుల రచనల గురించి రాసిన మానవ కవులలో పరిగేలనలో స్థానం కల్పించారు. సంకలనం తప్పకుండా వేస్తాం.

ఆ ఈ మధ్య ఒక యోగా పుస్తకం రాశారు
కదా! ఏమిటది?
మా యోగాచార్యులు శ్రీ లింగాల నారాయణ రుషి దగ్గర ఒక పుష్కర కాలం ఉన్నాను. వారు గొప్ప సామాజిక సేవకులు. వారి జీవిత చరిత్ర రాయటం జరిగింది. ఒక మహానుభావుడు దానిని అచ్చు వేయించాడు.

ఆ మీకు వచ్చిన అవార్డుల వివరాలేమిటి?
చాలా వచ్చాయి. ప్రముఖంగా రంజని - కుందుడై అవార్డు రావడం అది ‘సినారె’ చేతుల మీదుగా అందుకోవటం మరచిపోలేని అనుభూతి!

ఆ కవిత్వం రాయడం విషయంలో
ఇప్పటి తరంపై మీ అభిప్రాయం?
ఇప్పటి తరానికి సాహిత్య అధ్యయనం తక్కువైంది. పరిణతి లేకుండానే సంకలనాలు వేసేస్తున్నారు. అధ్యయనంలో భావజాలం పెరుగుతుంది.

ఆ మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులెవరు?
ముందు వేమన పద్యాలు బాగా ప్రభావితం చేశాయి. శ్రీశ్రీ, సినారె, శేషేంద్ర, శివారెడ్డి, అజంతా, గోపి ఎక్కువగా కవిత్వంపై - శిల్పంపై ప్రభావం చూపాయి.

ఆ మీరు, చందన్‌రావు జంటగా కవిత్వం రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
1981 డిసెంబర్ మాసంలో రాత్రి చలిలో నడుస్తున్నాం. చలిలో స్వెట్టర్లు అమ్ముతున్న నేపాలీల చూసి స్పందించి ఇద్దరం కలిసి చలి-గిలి అని కవిత రాశాం. ఒక 100 వరకు జంట కవితలు రాశాం. బాపు, ఆరుద్ర, పురాణం, దాశరథి, సినారె ప్రముఖుల ప్రశంసలనందుకున్నాం.

ఆ కథలు ఏమైనా రాశారా?
20 కథలు రాశాను! ప్రచురింపబడ్డాయి. గీతాంజలి అనువాదం చేశాను! రాత ప్రతి మాత్రమే ఉంది. భవిష్యత్తులో ప్రచురించాల్సి ఉంది.

ఆ మీకు సాహిత్య రచనలో
తృప్తి ఉందా?
తృప్తి ఉంది. రోజుకొక్క కవిత దాదాపు నా 15వ యేట నుండి రాస్తన్నాను. ఇందూరు సాహితీ లోకం నన్ను అభిమానంగా ‘కవితల కార్ఖానా’ అంటారు! పుకార్లు కవిత అందరికీ కంఠాపాఠం!

ఆ సాహిత్యం కోసం మీ సంస్థ
చేసిన కృషి?
గృహ సమావేశాలు, కవిత్వం పోటీలు, ఏక కవి కవితా పఠనం మొదలైన కార్యక్రమాలు నిర్వహించాం.

ఆ మీ సంస్థ ఇందూరు భారతి ప్రేరణ
ఎలా ఉండేది?
ఈ సంస్థ నుండే సిహెచ్.మధు, బైస రామదాసు సోదరులు. చందనరావు, శ్రీ లక్ష్మి, సైలు, సూర్యప్రకాష్ స్వాతి శ్రీ పాదలాంటి ప్రముఖులు తయారు కావటం జరిగింది.

ఆ ఇప్పటి సాహితీ సంస్థలపై
మీ అభిప్రాయం?
చాలా సంస్థలు మన రాష్ట్రంలో స్థాపించబడ్డాయి. సాహితీ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. మళ్లీ సాహిత్య అకాడమీలు రావాలి. దీనివలన సాహిత్యం పరిపుష్టమవుతుంది!
*
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544