ఉత్తర తెలంగాణ

మనసును రంజింపజేసే శతకం! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 36, వెల: రూ.10
ప్రతులకు: శ్రీమతి ఎం.గోదాదేవి
11-73/2, హన్మకొండ రోడ్,
హుస్నాబాద్,
జిల్లా సిద్ధిపేట-505467
సెల్.నం.9440155240
**

‘్భవ చిత్రాలు’ మినీ కవితా సంకలనంతో కవిగా సాహితీ లోకంలోకి అడుగిడిన శ్రీదాస్యం లక్ష్మయ్య గారు ‘తండ్లాట’ కవితా సంపుటిని వెలువరించి కవిగా నిలదొక్కుకున్నారు. ఆ తరువాత ‘బుర్క పిట్టలు’ పేరుతో నానీల సంకలనాన్ని ప్రకటించారు. ఇవేకాక చాలా గ్రంథాలకు సంపాదకత్వం వహించిన అనుభవం ఆయనకు వుంది. డాక్టర్ టి.శ్రీరంగ స్వామి నీల మోహనాష్టకం-ఒక పరిశీలన పేరుతో వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. ఛందోబద్ధ కంద పద్యాలతో ఇప్పుడు ‘మనసా’ పేరుతో రీతి శతకాన్ని వెలువరించారు. ‘మనసా’ మకుటంతో సాగే ఇందలి పద్యాలు..శ్రీ దాస్యం గారి రచనా వైచిత్రికి అద్దం పట్టేలా రూపుదిద్దుకున్నాయి. సమకాలీన సామాజిక సంఘటనలకు పెద్దపీట వేస్తూ చక్కని భావాలతో ఇందలి పద్యాలకు జీవం పోశారు. సామాజిక రుగ్మతలపై తమ కలాన్ని సంధించారు. సంక్లిష్టతకు తావివ్వకుండా సరళంగా తమ రచనను కొనసాగించారు. మనసే మన అసలు ముసుగు అని తేల్చి చెప్పారు. మనో ప్రవృత్తికి రూపమున్నప్పటికీ.. మనసుకు మాత్రం రూపం లేదని నొక్కి వక్కాణించారు. కవి లక్ష్మయ్య గారు మనసుపై.. మనసుపడి మనసును విభిన్న కోణాల్లో ఆవిష్కరించారు. సాధారణంగా భక్తిప్రద అంశాలకు పెద్దపీట వేస్తూ శతకాలు రాస్తారు, కాని లక్ష్మయ్య గారు మనిషిలో సత్ప్రవర్తన అలవడడానికి మనసునే కేంద్రం చేసుకుని అనేక సమకాలీన సంఘటనలను పద్యాల్లో నిక్షిప్తం చేశారు. ఆయన రాసిన ఇందలి పద్యాలు మసక బారుతున్న మానవ సంబంధాలకు మెరుగులు అద్దుతాయి! అంతేగాక ఈ పద్యాల్లో రైతన్నల వ్యథాలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు. పాశ్చాత్య నాగరికత మోజులో మన సంస్కృతికి ఆచారాలకు దూరమవడం పట్ల తమ ఆవేదనను వ్యక్తపరిచారు. పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. టివి, ఇంటికి, కంటికి కంటకమవుతున్న తీరును ఎండగట్టారు. చెప్పుడు మాటలు వినవద్దనీ.. తప్పుడు కూయవద్దనీ, తుప్పును వదిలింపజేయడానికి అందరూ ముందుకు రావాలని హితవుపలికారు. చీటికి మాటికి కోపము వలదనీ.. తన పరయను గతుల నెంచి.. మనసెరిగి మాట్లాడాలని సూచించారు. ఇలా నీతి ప్రబోధ అంశాలెన్నో ఈ కావ్యంలో ఉదహరించడానికి వీలుగా వున్నాయి! మొదటి ప్రయత్నంలోనే.. చక్కని ఛందోబద్ధ పద్య కావ్యాన్ని వెలువరించిన లక్ష్మయ్య గారికి అభినందనలు తెలియజేద్దాం.
**

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net