విశాఖపట్నం

ప్రకృతి కన్యకి ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాత కిరణాలు పుడమిని తాకి
పులకించిపోయాయి
పక్షుల కిలాకిలారావాలు
ప్రకృతిని పరవశింపజేశాయి
గలగల పారే నదీమ తల్లి
రవికిరణాల తాకిడికి
ముగ్ద మనోహరంగా కనిపించింది
వాటి సోయగాల్ని మీలో కలబోతగా
నిండుగా తయారయిన నా ఊర్వశీ
దివిలోని తారలు అపురూపంగా
అచ్చెరువుగా నీ సౌందర్యాన్ని
అవలోకిస్తున్నాయి
పురి విప్పి నాట్యమాడే నెమలి
లిప్తకాలం పాటు మీ వైపు చూసి
నాట్యమే మరిచి
ప్రకృతినే పరవశింపజేసిన
ఓ నా అందాలరాశీ
నీకిదే నా ప్రేమాభిషేకం

- మల్లారెడ్డి రామకృష్ణ,
టీచర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బుడితి-532427.
శ్రీకాకుళం జిల్లా.
**

అక్షర సమరం
*
అక్షర విలువలు తెలిసిన నేను
అక్షరాల్ని ఎంతో సున్నితంగా
సరళంగా, ఒద్దిగ్గా, మెత్తగా
పూవులో దారం గుచ్చినట్లు
చుట్టూ ఉన్న సమస్యల్ని
నడుస్తున్న వ్యవస్థ లోతుపాతుల్ని
విష రాజకీయ క్రీనీడల్లో
నల్లధన కుబేరుల మనోగతాల్ని
కవితా వస్తువుల్లా మలచి
నా కలానికి పని చెప్పి రాసినా
ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు
అవును మరి
నేడు అక్షరాలకు భయపడేదెవరు?
కత్తులనే ఖాతరు చేయడం లేదు జనం
అందాకే అక్షరాలను కుసుమాల్లా కాక
ముల్లుల్లాంటి చురకత్తుల్లా నేనొక్కడినే కాదు
సమస్యలను సమస్త కవులు, రచయితలు
కథా కవితా రూపాల్లో అక్షరయుద్ధం
చేయడానికి సమైక్యమవ్వాలని
అక్షరం దేన్నయినా శాసించగలదనే
నగ్నసత్యాల్ని అందరికీ తెలియజేయాలని
అక్షర సమరానికి కవితా శ్రీకారం చుడతా

- ఈవేమన, శ్రీకాకుళం.
సెల్ : 7893457307.
**
రేపటి కోసం
*
ఓ మనిషీ ప్రమాద ఘంటికలు
మోగుతున్నాయి గమనిస్తున్నావా?
ఆకాశం, భూమి, నీరు, గాలి
కాలుష్య విషంతో నిండిపోతుంది
నీ వంతుగా ఏం చేస్తున్నావు?
నకిలీ మనసుతో నకిలీ సూత్రాలతో
మురికి వ్యాపారంతో
తల్లడిల్లే బదులు
ప్రకృతిని ప్రేమిస్తూ
కులమతాల గోడలు కూలదోస్తూ
రేపటి తరం కోసం
మంచికి పట్ట్భాషేకం చెయ్యి
మానవతకు మార్కులెయ్యి

- గుడిమెట్ల గోపాలకృష్ణ,
అరసవిల్లి.
**
అపరకాళి
*
సహనమున జానకిరా
సమరమన సత్యభామరా
ప్రాతిపత్యమున అరుంధతిరా
తాళి కోసం యముడితో పోరాడిన సతీసావిత్రిరా
సాహసమున ధైర్యలక్ష్మిరా
సంగీతమున సరస్వతిరా
ధనమున ధనలక్ష్మిరా
తనయుని వీరునిగా పెంచే తల్లిరా
త్యాగమున థెరిసారా
తేడా వస్తే తెగ నరికే అపరకాళిరా
అబల కాదురా భద్రకాళిరా
ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా
అణుబాంబురా
ఆ బ్రహ్మ సృష్టించిన జన్మనిచ్చే జననిరా
అఖిల జగానికి అన్నం పెట్టే అమ్మరా
ఈ జగతికే ఇలవేల్పురా
ఈ జగతిని వెలిగే జీవన జ్యోతిరా
అందరి మేలు కోరే అమృతమూర్తిరా

- కారసాల శ్రీనివాసరావు,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ,
శ్రీకాకుళం.
సెల్ : 8374536549.