విజయవాడ

వృద్ధాప్య విలాపం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం, కాంతివేగాన్ని సవాలు చేస్తూ
కల్మష వర్ణాలనన్నింటిని పులుముకొని
దిశా రాహిత్యమనసుతో గమిస్తోంది
‘రుజ’ కౌగిలిలో నలిగిపోయిన ‘జర’
ముడుదల ద్విపటి కింద మూల్గుతోంది
భారంతో, తలదించిన కన్నప్రేమ రథం
వృద్ధాశ్రమం వైపుకి పరుగిడుతుంటే
హాస్యపు నయనాలు ఆనందిస్తున్నాయి
ఆప్యాయంతో అందించిన గోరుముద్దలు
వికటించి విషతుల్యమైపోయాయి
అభేద్యమనుకున్న అభిమానకుడ్యాన్ని
క్షుద్బాధపు గునపం కూల్చివేస్తోంది
‘కందములు’లా కమ్ముకొన్న శుక్లపుపొరలు
కంటిపాపల్ని నిర్వీర్యం చేస్తున్నాయ
మానవీయ విలువలన్నీ మసకబారి
అదృశ్యరూపంలో ఆడుకుంటున్నాయి
దేహభారాన్ని భరించలేని పాదాలు
పని ఘర్షణకు అరిగిపోయిన కరాలు
పటుత్వరాహిత్యమైపోయిన నరాలు
కడతేర్చమని కాలాన్ని అర్థిస్తున్నాయి
అహంకారం హార్మ్యాలనెక్కి కూర్చుంటే
తిరస్కారం తీపిదనాన్ని మింగేస్తోంది
అజ్ఞానపు ఆలోచనలు సంఘటితమై
విజ్ఞానరూపాన్ని వికలం చేస్తున్నాయి
కలిమియే, కడదాకా తోడని భావిస్తూ
కన్నవారినే కడుహీనంగా చూస్తుంటే
ఆ వృద్ధాప్యపు జీవితానికి అర్థమేది?
ఆసరానివ్వగలిగిన
తగిన చట్టమేది?
*
- పరాశరం శ్రీనివాసాచార్యులు
నరసరావుపేట, గుంటూరు జిల్లా
చరవాణి : 9966434265
**

చేదు జ్ఞాపకాలు
*
పగిలిన హృదయపు
శకలాల కింద
శిశిరాన రాలిన జ్ఞాపకాల
ఆకుల కింద
నేను నడిచే ముళ్లబాటలో
కొత్తదనపు ఆనవాళ్ల కోసం
వెతుకుతునే ఉన్నా
మురికి మనుషుల మనసుల్లో
విలువలేక, నిలువలేక
నీడలేని అబలని
ఊరుమ్మడి సొత్తుని
వాడివదిలేసిన వస్త్రాన్ని
వద్దన్నా వినకుండా
ఆటవికంగా నా శరీరంతో
ఆడుకున్నారు
వారి కోర్కెని తీర్చుకుని
వదిలి వెళ్లారు
దాని ఫలితం..
నాకుతోడుగా
భువిపైకి మరొకరిని
వద్దనుకున్నా ఏమీ చేయలేని
నిస్సహాయ స్థితిలో మతిపోయి
రోడ్డుపైనే జన్మనిచ్చా
మానవత్వంలేని ఈ సమాజంలో
నా పసిగుడ్డును కాపాడే
నాథుడు కరవయ్యాడు
తండ్రి ఎవ్వరో తెలియని
ఆ పసిగుడ్డును
కుక్కలు పీక్కుతింటూ ఉంటే
తల్లినైన నేను
కదల్లేక కన్నీళ్లు కార్చానేకాని
కాపాడుకోలేకపోయా!
*
- పి కాశీవిశ్వనాథం, చరవాణి : 9494524445
**

సమస్త భారతం
*
రైలు ప్రయాణం
ఓ అద్భుత అనుభూతి
సమస్త భారతాన్ని
ఇక్కడ కలుసుకోవచ్చు
అరవై పైవాళ్లంతా
ఆమె నుంచి అమెరికా వరకు
అందాల నుంచి
రాజకీయాల వరకు
ఆడవాళ్లంత వొడవని ముచ్చట్లు
కుర్రకారంతా చెవుల్లో పుల్లలు
వారిలోకంలో వారు
కునికిపాట్లు కొందరు
కూనిరాగాలు కొందరు
‘ఏయ్ సమోసా, గరం గరం
కాఫీ, చాయ్ వేడివేడి’
రద్దీలో కూడా
రాసుకుంటూ పూసుకుంటూ
‘ఏభైకి ఆరు దానిమ్మ
ఉడకబెట్టిన పల్లీ, ఏయించిన పల్లీ’
ఆడ బేపారుల కీసుగొంతుకలు
‘అమ్మా! అయ్యా! గుడ్డివాడ్ని
ఒక్క రూపాయ్ దానం చేయండీ’
‘రావోయి చందమామ
మా వింత గాథ ఇనుమా!’
చిరుతలు వాయిస్తూ
జానెడు పొట్ట కోసం
నిరంతర పోరాటం
‘ఏయ్ పదికి పది సూదులండీ
మంచి మంచి సూదుల్
పాలీస్ సార్ మీ బూట్లకు పాలీస్’
ఓహో!
సమస్త భారతం
ఒక్క రైలు పట్టెలో!

*
- మండవ సుబ్బారావు, కొత్తగూడెం,
చరవాణి : 9493335150
**

హేమలంబ అందుకొమ్మ...
*
సీ. అరువదేండ్ల పిదప అరుదెంచినట్టి మా
తెలుగింటి పడచుగా వెలుగునట్టి
హేమలంబ ముదంబు హెచ్చుమీరగ నిన్ను
వేపపూల గొలుతు వేడ్క మీర
వగరు మావిచిగురు తెగమెక్కి కోయిల
పాడె స్వాగతగీతి పరవశించి
పెనుబాధల బాపు పెన్నిధి నీవని
అంజలించెదమమ్మ అందుకొమ్మ

తే.గీ. శిశిర ఋతువందు వసివాడి చేవలుడిగి
నేలరాలెను ఆకులు కాలమహిమ
చిగురు దొడిగెను మ్రోడులు చెలువు మీర
చూడ పచ్చలహారమై చూపరులకు
సీ. ఋతువులారింట వాసంత ఋతువు నందు
హేమలంబరుదెంచె హోయలు మీర
పాడిపంటలు సమృద్ధి పొంగునటుల
సిరిసంపదలింట చిందులేయ,
ఆయురారోగ్యముల్ అష్టసంపదలొంది
సౌఖ్యముగ బ్రతుకు సాగునటుల
దీవెనలొసగెడు దేవత నీవని
శిరసు వంచితినమ్మ శుభములిమ్మ

తే.గీ. భారమంతయు నీదిగా భవితలోన
విశ్వసించితినోయమ్మ వినుమ మనవి
కరవుకాటకముల నెల్ల కాలరాచి
దేశ శాంతిని కాపాడు దీటుగాను

- లక్కరాజు వాణీ సరోజిని, విజయవాడ.
చరవాణి : 9346978829