విజయవాడ

బంధువులు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరికి వస్తూనే ఉంటాయి
ఆత్మబంధువులై
చలికాలం మంచుపూలు కురిసే
వెనె్నల వేళ
మా ఊరి చింతచెట్లపైకి
దేశదేశాలు దాటి
ఎతె్తైన కొండల వరుసలు దాటి
అలల శబ్దాల గంభీర
సముద్రాలు దాటి
పైనుంచి పైకి ఎదిగిన ఎతె్తైన
అడవుల శిరస్సుల పైనుంచి
వస్తూనే.. వస్తూనే ఉంటాయి
రెక్కల టపటపల శబ్దాలు చేస్తూనే
వరుస వరుసలుగా సైబీరియా విహంగాలై
మా చింతపల్లిని విడిది చేసుకుని
గుడ్లను పొదిగి పిల్లలుగ
ప్రాణప్రతిష్ఠ చేసే
రక్షణ స్థావరంగా
ప్రతి ఏటా సైబీరియా కొంగలు
జాతర చేసినట్లు!
ఊరంతా సంబరం
స్వాగతం పలుకుతూనే
పక్షిజాతికి సంబరంగా
ఊరంతా సంబురాలు తెలుపుతూ
అదే! పక్షుల వేడుక చూడాలంటే
రండి మా చింతపల్లికి!
ఇదే సైబీరియా పక్షులకు
నిండుగుండెల ఆహ్వాన సంతోషం
వాటి రాకే మా ఊరికి శుభదాయకం!
(ఖమ్మం జిల్లా చింతపల్లికి సైబీరియా పక్షులు ప్రతి ఏటా వచ్చేవేళ
సంబురం చేసుకుంటూ..)
*
- సిహెచ్ అంజనాశ్రీ, ఖమ్మం. చరవాణి : 7702837483
**

గాలిలో కలిసిపోతూ..
*
గాలి రివ్వున వీస్తుంది
ఆకాశం మబ్బులతో నిండి ఉంది
ప్రశాంత నిశ్శబ్దం ఆవరించింది
అక్కడక్కడా చిన్న శబ్దాలు.. మూగజీవుల రోదనలు
అక్కడొక ప్రాణం జీవితానే్న వడికిపోసిన అనుభవం
చుక్కల్లో కలవనుంది జీవం కాలంతో పోరాడుతుంది
ప్రాణంలో ఒకింత ఆశగా తొంగిచూస్తోంది
కాలం భారమైపోతుంది జీవం నశిస్తుంది
ప్రపంచం నాశనమైపోతుంది
అది తెలియని జయం
కాలంతో ఆటలాడుతుంది
కానీ.. అది మన ఆలోచనల
ఫలితమేనని తెలియదు పాపం!
విజయం అనే అహం, మాటవినని మొండితనం
అనాథలా విలపిస్తూ గాలిలో కలిసిపోతుంది!
*
- వెంకట్రాజం, చరవాణి : 9676440268
**

సృష్టికి వ్యతిరేకులు!
*
భూమి నుంచి వచ్చింది ఫలం
భూమి పైనుంచి వచ్చింది మాంసం
మనిషి మనుగడకు కావల్సింది ఫలం
జంతు మనుగడకు
కావల్సింది మాంసం
ఇది సృష్టి నియమం
తెలియని అజ్ఞానం
రుచికరమా ఈ మాంసం?
ఇది రుచికరమే కానీ హానికరం
కండబలం నేడు జంతుఫలం
బుద్ధిబలం నేడు దైవఫలం
ఆహార శుద్ధి ఆత్మబలం
అహంకార బుద్ధి హానికరం
ఇది పెద్దలు చెప్పిన హేతుకరం
చదువంతా సంతలో వదిలావు
పెద్దలు చెప్పింది చాపకింద పెట్టావు
కాలం మారింది
కంపుకొట్టే నేడు
పండుగలు పడగలెత్తి
కాటేస్తున్నాయి
పాలు తాగే పాములు
బుసకొడుతున్నాయి
పుట్టలో పాలుపోసినా
పండగ కాదంటున్నాయి
నేడు కూరపండగే
కూటికంటే ఎక్కువాయె
అన్నమక్కర్లేదు..
మేము కూరనే తింటామంటారు జంతు భక్షకులు, మాంసప్రియులు!
‘గో’్భక్షకులు
సృష్టి వ్యతిరేకులు!!
*
- జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం.