విజయవాడ

మూడు ‘డబ్ల్యు’ల మాయ! (చిన్నకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా నుంచి వచ్చిన ఆనంద్ తల్లిదండ్రులను కూడా చూడకుండా సరాసరి స్నేహితుడు అరవింద్ ఇంటికి వచ్చాడు. బాల్కనీలో కూర్చుని ఎదురింటి వంక ఆశ్చర్యంగా చూశాడు. ‘ఇక్కడ డాబా వుండాలి కదా. ఆ పెద్దాయన ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టేడు? బిల్డర్‌కి కాని ఇచ్చాడా?’ అని అడిగాడు.
‘అదేం లేదు. పెద్దావిడ పద్మావతి గారు చనిపోగానే ఆయన జబ్బుపడ్డారు. ఆయన్ని చూసుకోడానికి రంజని అనే పిల్లకి, ఒక డాక్టర్‌కి బాధ్యత అప్పగించాడు కొడుకు. డాక్టర్‌కి రంజని చాలా నచ్చింది. పెద్దాయన ట్రీట్‌మెంట్ జరుగుతున్న టైమ్‌లోనే మంచి మంచి టానిక్స్ అవీ తాగి నాలుగునెలల్లోనే రంజని చాలా అందంగా మారింది. ఆమెకు ఒక అపార్ట్‌మెంట్ కొనిచ్చారు. కొన్నాళ్లకి డాక్టర్ గారింట్లో దొంగలు పడి ఆయన భార్యని చంపి వందకాసుల బంగారం దోచుకుపోయారు. మరో ఆరు నెలలకి భార్యగా రంజని డాక్టర్ గారి ఇంట్లోకి ప్రవేశించింది. ఇదంతా తెలిసి చలపతిగారు డాక్టర్ తన దగ్గర వుంచిన ఓ సిస్టర్‌ని కూతురుగా భావించి ఫిజియోథెరపీ ఇవ్వడానికి వచ్చే కుర్రాడికిచ్చి పెళ్లిచేసి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు.
చలపతి గారబ్బాయి అమెరికా నుంచి వచ్చి తండ్రి పూర్తిగా కోలుకుని హుషారుగా వుండటం చూసి వారికి థేంక్స్ చెప్పాడు. తండ్రి తదనంతరం ఆ ఇల్లు సిస్టర్ రమ్యకి చెందేలా వీలునామా రాయించి తండ్రి బాధ్యతని ఆ యువ దంపతులకిచ్చి ఆనందంగా తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
స్థానికులంతా ఆ ఇంట్లో పద్మావతిగారు చనిపోయినప్పటి నుంచి జరిగేవన్నీ తమిళనాడు రాజకీయాలను మీడియా ద్వారా దేశమంతా గమనించినంత ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. వీలునామా రాసిన నెలరోజులకే మార్నింగ్ వాక్‌కెళ్లిన చలపతిగారిని ఒక పోలీస్ జీప్ ఢీకొనటంతో చనిపోయారు.
కొడుకు వచ్చి తండ్రి కర్మకాండలు చేసి వెళ్లిపోయాడు. బిల్డింగ్ రమ్య సొంతమైంది. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమైన ఆ ఎస్‌ఐ తరచూ వచ్చి రమ్యతో స్నేహం చేసి ఆ డాబా పడగొట్టి అందమైన ఈ మూడంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. మూడో అంతస్థులో ఎస్‌ఐ గృహంలోకి రమ్య చేరింది. ఫిజియోథెరపీ కుర్రాడు కనిపించకుండా పోయాడు. ఎక్కడన్నా ఉన్నాడో, అసలు ఈ భూమిమీద ఉన్నాడో, లేడో? తెలియదు. ఒకరోజు టెర్రస్‌పై ఫుల్‌గా మందుకొట్టి పైనుంచి కిందపడి ఎస్‌ఐ మరణించాడు. ఇనె్వస్టిగేషన్ చేసే ఎసిపి రమ్యని చాలా ఇబ్బంది పెట్టి ఆ బిల్డింగ్‌కి ఓనర్‌గా మారాడు. చిన్నప్పుడు చదివిన ‘టెంపోరావ్ డిటెక్టివ్’ గుర్తుకొచ్చింది. మూడు డబ్ల్యులు దీనంతటికీ కారణం. వెల్త్, ఉమన్, వైన్’ నవ్వుతూ వివరించాడు అరవింద్.
*
- జ్యోతిర్మయి, విజయవాడ.
**

*
మరణానికి పర్మిషన్! (కౌంటర్)
*
‘చిన్నత్తా.. మామ్మ చచ్చిపోయి నీ పొట్టలోంచి వస్తుందట తెలుసా?’ అన్నాడు నాని.
బాధగా వదినగారి వంక చూసింది రాధ.
‘చిన్నపిల్లవాడి దగ్గర ఇలాంటి మాటలు ఎందుకు చెపుతారు?’ అన్నది కోడలు కమల.
‘పిచ్చిదానా.. రేపు నేను చనిపోతే వాడు నాకోసం బెంగపడి జ్వరం తెచ్చుకుంటే.. అందుకే ముందుగా వాడికిలా చెప్పాను. అందుకు వాడేమన్నాడో తెలుసా?
‘‘అయితే ఫరవాలేదు. నువ్వు చచ్చిపో’’ అని నాకు చావడానికి పర్మిషన్ ఇచ్చాడు’ నవ్వుతూ అంది దుర్గమ్మ.
- కోట సావిత్రి,
విజయవాడ.
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net