విశాఖపట్నం

భగ్గుమంటున్న భానుడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భానుడు భగ్గుమంటున్నాడు
భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు జనం
నీళ్ల దర్శనం కానలేం
నింగి వైపు చూస్తుంటాం
పాదరక్షలు లేకుంటే
పుడమిపై నడవలేం
ఆరంభంలోనే ఆదిదేవుడు
కురిపిస్తున్నాడు ఆగ్రహం
భరించలేకున్నారు
భువిన జనం
కొండలు కోనలు
అగ్నిశిఖలవుతున్నాయి
గిరిజనం తాపంతో అల్లాడుతున్నారు
గుక్కెడు మంచినీళ్ల కోసం
ముదితలు మండుటెండలో
సాగిస్తున్నారు అనంత పయనం!
*
- చెన్నా లక్ష్మణరావు,
పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 8985914107.
*
మినీ కవితలు
*
వెనె్నల
వెనె్నల రేయి వచ్చింది
మనసు మైదానంలో
కలల కావ్యం మొదలయింది
వేకువ అలలతో
అనంతంగా ఆలోచన వచ్చింది
రేపటి రోజును కలగంటూ
నా పయనం సాగింది

చెట్టు
చెట్టు నాతో మాట్లాడింది
నీడనిచ్చి సేద దీర్చింది
ఆకలిని చూసి అమ్మయింది
నేల సాక్షిగా
నన్నూ ఓ మనసు చెట్టును చేసింది
*
- బి. గోవర్దనరావు,
సెల్ : 9441968930.
వాక్కు
*
తెలివివాక్కు సంపదను కూర్చు
దయావాక్కు బంధువులను చేర్చు
మంచివాక్కు కీర్తి శిఖరాలను చేర్చు
సాదరవాక్కు స్నేహితులను కూర్చు
కోపవాక్కు పాపాలను తెచ్చు
కఠినవాక్కు కానివారిగా మార్చు
వదరువాక్కు సంకెళ్లను తెచ్చు
క్రూరవాక్కు మారణకాండగా మార్చు
నిర్మలవాక్కు దయాగుణం కురిపించు
*
- ఎ. నాగభూషణరావు,
బాబామెట్ట,
విజయనగరం.
సెల్ : 8985916755.
*
నీకేమని చెప్పను?
*
మరుభూమిలో పారే సెలయేటి గలగలలా
మరీచికలో కురిసిన చిరువర్షపు జల్లులా
కారడివిలో విరిసిన కనె్న మందారంలా
కటిక చీకటిలో మెరిసిన కాంతి పుంజంలా
రుద్రభూమిలో పూసిన ఎర్రగులాబీ తోటలా
మధుకలశంలో నిండిన మకరందంలా
రిక్తమయిన నా హృదిలో రవిలా ఉదయించావని
అణగారిన ఆశలను ఆరిపోయిన ఆశయాలను
రాలిపోయిన ఆనందాలకు
ఊహల ఊపిరిలూదావని ఎలా చెప్పను నీకు?
*
- శివాని, విశాఖపట్నం.
*
జ్ఞానోదయం
*
వెలిగే భారతదేశపు
ఫలవృక్షానివి నీవు
ఆశల పల్లకివి నీవు
తల్లిదండ్రుల
ఆశాసౌధానివి నీవు
ఈ దేశపు భవితవ్యపు
కాంతిరేఖవు నీవు
మాదకద్రవ్యాలకు బానిసవైపోతావా?
కన్నవారికి గుండెకోత
మిగిలిస్తావా?
ఫలవృక్షానివి నీవు
విషపు నీళ్లు పోస్తావా
మంచి లక్షణాలు ఉన్న
తులసిని ఆదర్శం చేసుకో
జ్ఞానదీపమై వెలిగి
దేశానికి కాంతులందించు
*
- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.