రాజమండ్రి

కాలం సాక్షిగా (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూతకాల వలయంలోంచి
జ్ఞాపకాలు ఎగసిపడుతాయి
భవితాకాశమంతా
ఆశల పూజలు విరబూస్తాయి
వర్తమానమొక్కటే
వాస్తవాలతో జత కడుతుంది
మానవ జన్మ మాత్రం
నూరేళ్ల జీవితమై విస్తరిస్తుంది
కొందరు మాత్రమే
మనిషితనానికి రూపవౌతారు
వాళ్ల అనే్వషణ ప్రవృత్తి అవుతుంది
అనునిత్యం కాలాన్ని గమనిస్తూ
అవాస్తవాలపై కనె్నర్రజేస్తారు
సామాన్యుడిని వేదనల జలధి తాకితే
అక్కడేదో సమస్య మొగ్గ తొడిగినట్లే!
ఒకప్పుడు సిరి సంపదలతో
కాలాన్ని కొలిచిన రాజులు
ప్రజల పాలిట పాలకులయ్యారు
ఇప్పుడు, రోజులు మారాయి అని
అనుకుంటున్నారు అమాయకంగా!
అదే పరిస్థితి మళ్లీ మనిషిని అల్లుకుని
మోసగిస్తున్న దృశ్యం -
ప్రజలను నిస్వార్థంగా
ప్రేమించిన వాళ్లకే కనిపిస్తుంది
ప్రజల శిరస్సులపై ఎక్కి తొక్కుతున్న
ప్రజానాయకులంతా ధనవంతులు కారా!
ఏ వర్గం ఆ వర్గానికి
లాభమై వ్యవహరించటం నిజం కాదా!
సామాన్యులకి బాగా తెలుసు
వాళ్లనుభవిస్తున్న బతుకు కష్టాలు
ఐనా, ఐదేళ్లకోసారి
తేనెపూసిన వాగ్దానాలు
పలుకుల ములుకులు గుర్తొస్తున్నా
వౌన ప్రతిమల్లాగ ఓట్లు వేస్తూనే ఉంటారు
అందుకే, పాలనకి మార్గదర్శకాలు
తయారుకావలసిన చట్ట సభలు
క్రమశిక్షణా రాహిత్యాన్ని
ఒంటికి గంధంలాగ పులుముకొంటున్న
ఆకతాయి సందర్భాలవుతున్నాయి
చిత్తశుద్ధిని గాలిలోకి విడిచిన
మూర్ఖత్వపు లోగిళ్లవుతున్నాయి
*
- ఎస్.ఆర్.పృథ్వి
*
పదవీ విరమణ
*
కాలం
ప్రయాణంలో వయస్సు కలిగిపోయింది
పదవీ విరమణ వార్త
హృదయాన్ని తాకింది వెచ్చగా
అర చేతిలో
ప్రవహించే స్పర్శకోసం
ఆత్మీయ పిలుపుకోసం నిరీక్షణ
నాలోని
‘మాటల చెట్టు’2 చిగురు ఎండిపోయింది
ఏకాకి బతుకులో
వసంత, ఇక సంతకం చెయ్యదు
ఆకలి పద్మవ్యూహంలో
చిక్కుకుపోయాను
అయినా
అవి శ్వాసల్లో నుంచి విశ్వాసాన్ని
హృదయంలో నింపాలి
విజయం కోసం
నిరంతరం కాలంతో పోరాటం
నీటిలోని చేప
ఒడ్డున పడినట్లు
బాధల సుడిగుండంలోకి అడుగులు
కోరికలన్నీ
రాలిపోయిన ఆకుల్లా ఎటో ఎగిరిపోయాయి
ముసలి అంతరంగంలో
బాధల అలలపై
కదలాడే కాగితం పడవ జీవితం
కాలాన్ని కనురెప్పల క్రింద
బంధించలేక శూన్య క్యాలెండరులోని
తేదీల్లో చిక్కుకున్నాను
*
- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, సెల్: 92475 77501
*
నీడ జాడ
*
జాడ తెలియని ఒక నీడ
ఎవరిదో మరి ఆ నల్లని నీడ?
నిజానికది అతని నీడే,
కాలానికి కొంచెం అటు ఇటుగా...
తెలిసినా గుర్తించ లేడు,
అది అవ్యక్త భావాల నీడ

ఉదయాన ఆధ్యాత్మికత చాటుగా,
సాయంత్రపు వాహ్యాళి మాటుగా,
వ్యక్తిత్వపు అద్దాలలో సదా
పునరావృతమవుతుందే!
నిజానికది అతని నీడే,
కాలానికి కొంచెం అటు ఇటుగా...
ఉద్ధృతంగా వాన పడినా
ఎండ తన వాడి చూపినా
గుండె లోతుల్లోంచి వడగాలి రేగినా
నిస్సత్తువగా నిట్టూర్పు విడిచేది
నిజానికి అది అతని నీడ జాడే
కాలానికి కొంచెం అటు ఇటుగా...
*
- డాక్టర్ కూచిభొట్ల మధుసూదన కళ్యాణ చక్రవర్తి, భీమవరం